- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నేనింతే.. నా వైఖరి ఇదే : దీదీ
by Shamantha N |

X
కోల్‌కతా : ఎన్నికల సంఘం తనకు ఎన్ని నోటిసులిచ్చినా తన వైఖరి మాత్రం మారదని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. మతం ఆధారంగా ఓట్లు చీల్చుతున్నారన్న ఆరోపణలతో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ).. వాటిపై ఆమె వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీదీ స్పందిస్తూ.. ‘మీరు (ఈసీ) నాకు పది షోకాజ్ నోటీసులైనా ఇచ్చుకోవచ్చు. కానీ నా స్పందనలో మాత్రం ఎలాంటి మార్పూ ఉండబోదు.
హిందూ, ముస్లింలుగా ఓటర్లను విభజించడానికి వ్యతిరేకంగా నేను మాట్లాడుతూనే ఉంటాను. నేనెప్పుడూ ఇదే వైఖరికి కట్టుబడి ఉంటాను’ అని తేల్చి చెప్పారు. ప్రధాని మోడీ హిందూ ముస్లింల ఓటు బ్యాంక్ గురించి రోజూ మాట్లాడుతున్నారని, మరి ఆయనకు నోటిసులెందుకు ఇవ్వడం లేదు..? అని మమత ప్రశ్నించారు.
Next Story