పోస్ట‌ల్ బ్యాలెట్ కోసం మార్గ‌ద‌ర్శ‌కాలు

by Shyam |
పోస్ట‌ల్ బ్యాలెట్ కోసం మార్గ‌ద‌ర్శ‌కాలు
X

దిశ ప్ర‌తినిధి , హైద‌రాబాద్: కోవిడ్ కార‌ణంగా పోస్ట‌ల్ బ్యాలెట్ సౌక‌ర్యాన్ని వినియోగించుకునే వారి కోసం ఎన్నిక‌ల క‌మిష‌న్ మార్గ‌ద‌ర్శ‌కాలను జారీ చేసింది. సైనిక సంస్థ‌ల్లో ప‌ని చేసే వారు , వారి కుటుంబ స‌భ్యులు, ప్రివెంటివ్ డిటెన్ష‌న్‌లో ఉన్న వారు, ఎన్నిక‌ల విధుల్లో ఉన్న ఉద్యోగులు, అంగ‌వైక‌ల్యం ఉన్న వారు, 80 యేండ్ల‌కు పైబ‌డిన వారు , 1 న‌వంబ‌ర్ 2020 త‌ర్వాత కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారు పోస్ట‌ల్ బ్యాలెట్‌ను వినియోగించుకునే అవ‌కాశాన్ని రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ క‌ల్పించింది.

అంతేకాకుండా గ‌త‌ జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల ఓట‌రు జాబితాలో పేరు ఉండి తాజా జాబితాలో లేని వారు, ప‌లు ర‌కాల కార‌ణాల‌తో ఇండ్లు మారిన వారి జాబితాల‌ను సిద్ధం చేసి దొంగ ఓట్లు ప‌డ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ ఉత్తర్వుల్లో పేర్కొంది.

Next Story