పాతబస్తిలో దారుణం.. అమ్మమ్మతో సహజీవనం… మనువరాలిపై అత్యాచారం!

by Sumithra |
gang rape in Gandhi Hospital
X

దిశ, చార్మినార్: కామంతో కళ్లుమూసుకుపోయిన 80 ఏళ్ల వృద్దుడు అమ్మమ్మతో సహజీవనం చేస్తూనే 11 ఏళ్ళ మైనర్ బాలికపై కన్నేశాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆ మైనర్​బాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేగాకుండా.. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బాలికను బెదిరించి లైంగికదాడి చేశాడు. ఈ ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫలక్ నుమా ఏసీపీ మాజిద్​వివరాల ప్రకారం.. పంజేషాకు చెందిన హబీబుద్దీన్​అలియాస్​బషీర్(80)కు గౌలిపురాలోని ఓ ఇంట్లో పాచిపనులు చేసే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త మధ్య ప్రేమగా మారి, 20 ఏళ్లుగా ఇరువురు సహజీవనం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆమెకు 11 ఏండ్ల వయస్సున్న మనువరాలు ఉంది. అమ్మమ్మతో సహజీవనం చేస్తూనే ఆమె మనువరాలి(మైనర్)పై బషీర్​దృష్టి పడింది. నెల రోజుల క్రితం ఇంట్లో ఎవరు లేని సమయంలో బషీర్ ఆ మైనర్‌ను బెదిరించి అత్యాచారం చేశాడు. ఎవరికైనా చెబితే చంపుతానంటూ బెదిరించాడని బాలిక అమ్మమ్మకు చెప్పింది.

దీంతో ఆమె బషీర్‌ను నిలదీసింది. తనకేం తెలియదని బషీర్​బుకాయించాడు. దీంతో అత్యాచారం జరిగిందా? లేదా? అని మైనర్​బాలికను రెండు మూడ్రోజుల క్రితం వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ విషయమై ఉస్మానియా ఆసుపత్రి వర్గాలు వెంటనే అఫ్జల్‌గంజ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అఫ్జల్‌గంజ్ పోలీసులు బాధితురాలు ఉండే ప్రాంతం గౌలిపురా కావడంతో మొఘల్​పురా పోలీసులకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తమ పరిధి కూడా కాకపోవడంతో మొఘల్​పురా పోలీసులు ఛత్రినాక పోలీసులకు సమాచారం అందించారు. మైనర్​అత్యాచారం కేసు కావడంతో స్వయంగా ఫలక్ నుమా ఏసీపీ మాజిద్​ఈ కేసుపై విచారణ చేపట్టాడు. బషీర్‌పై ఫోక్సోచట్టం కింద కేసులు నమోదు చేసి శుక్రవారం సాయంత్రం రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును ఛత్రినాక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed