హీరోయిన్లను కొడతానని రానిచ్చేవారు కాదు : స్టార్ ప్రొడ్యూసర్

by Shyam |
హీరోయిన్లను కొడతానని రానిచ్చేవారు కాదు : స్టార్ ప్రొడ్యూసర్
X

దిశ, సినిమా : బోల్డ్ కంటెంట్ సిరీస్‌లతో స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న నిర్మాత ఏక్తా కపూర్.. చిన్నతనంలో తన తండ్రి, ఫేమస్ యాక్టర్ జీతేంద్ర పట్ల ఎంత పొసెసివ్‌గా ఉండేదో తెలిపింది. శనివారం ఫాదర్‌తో కలిసి కపిల్ శర్మ దివాళీ స్పెషల్ ఎపిసోడ్‌కు హాజరైన ఏక్తా.. ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించింది. ‘చైల్డ్‌హుడ్‌లో నాన్న పట్ల చాలా పొసెసివ్‌గా ఉండేదాన్ని. ఆయనతో హీరోయిన్లను షూటింగ్ చేయనిచ్చేదాన్ని కాదు. వాళ్లను చూసి అసూయపడేదాన్ని, వారిపై దాడి చేయాలన్నంత కోపం వచ్చేది. అందుకే నన్ను నాన్న చేస్తున్న సినిమాల షూటింగ్ సెట్‌లోకి రానిచ్చేవారు కాదు’ అని పేర్కొంది. అంతేకాదు అతనితో ఎవరు మాట్లాడినా తనకు అస్సలు నచ్చేది కాదని చెప్పుకొచ్చింది.

కాగా బాలీవుడ్‌లో ఐదు దశాబ్దాలకు పైగా నటించిన జీతేంద్ర.. ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్, వైట్ అవుట్‌ఫిట్స్‌కు చాలా ఫేమస్. 1967లో ‘ఫర్జ్’ మూవీతో ఫస్ట్ సక్సెస్ అందుకున్న ఆయన.. 2013లో వచ్చిన ‘మహాభారత్ ఔర్ బార్బరీక్’ మూవీలో చివరిసారి కనిపించాడు. కాగా గతేడాది ఏక్తా కపూర్ నిర్మించిన ALT బాలాజీ సిరీస్ ‘బారిష్’లో స్పెషల్ అప్పియరెన్స్‌తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చాడు.

Advertisement

Next Story