ఆదివారాల్లో ఇక ‘‘స్పెషల్ చార్మినార్’’..!

by Shyam |   ( Updated:2021-10-16 23:37:10.0  )
ఆదివారాల్లో ఇక ‘‘స్పెషల్ చార్మినార్’’..!
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ నగర వాసులకు గుడ్ న్యూస్. గత కొన్ని రోజుల నుంచి ట్యాంక్ బండ్‌పై సండే ఫండే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి నగర వాసులకు అధికారులు తీపి కబురును అందిస్తూ.. ఈ కార్యక్రమాన్ని నేటి నుంచి చార్మినార్‌ వద్ద ‘ఏక్‌ షామ్‌ చార్మినార్‌ కే నామ్‌’ పేరుతో నిర్వహించనున్నారు. దీంతో ప్రశాంతంగా చార్మినార్ చూద్దాం అనుకునేవారి కల ఈ ఆదివారల్లో తీరబోతుంది అన్నట్టు. నిత్యం పర్యాటకులు, వ్యాపారులు, వాహనాలతో కిటకిటలాడే చార్మినార్‌ నేడు ప్రశాంత వాతావరణంలో దర్శనమివ్వనుంది. ఈ పురాతన కట్టడాన్ని తనివితీరా చూస్తూ, ఇష్టం వచ్చిన వస్తువులను, ఆహార పదార్థాలను కొనుక్కునే అవకాశం నేటి నుంచి అందుబాటులోకి రానుంది. మరీ ఇంకెందుకు లేటు ప్రతీ ఆదివారం చార్మినార్ వెళ్లండి.. సండేను ఫండే‌గా ఏంజాయ్ చేసి రాండి.

Advertisement

Next Story

Most Viewed