చైనాలో యూరిన్‌తో ఎగ్ బాయిల్డ్.. ఆ రుచే వేరంటున్న ప్రజలు

by vinod kumar |   ( Updated:2021-09-27 02:27:02.0  )
చైనాలో యూరిన్‌తో ఎగ్ బాయిల్డ్.. ఆ రుచే వేరంటున్న ప్రజలు
X

దిశ, వెబ్‌డెస్క్ : వంట చేయడానికి ముఖ్యంగా కావాల్సింది ఆయిల్. ఆయిల్ లేకుండా అసలు వంటనే వండలేము. అలాగే ఏవైనా ఉడకబెట్టడానికి నీటిని వాడుతుంటాము. అవి మంచినీరు మాత్రమే, పంపువాటర్ లాంటివి వాడటానికి ఇష్టపడం. అలాంటిది వాటర్ లేకుండా ఎగ్ ఉడక బెడుతారంటా.. అక్కడ ! వాటర్ లేకుండా ఎగ్ ఉడకపెట్టడం ఏంటీ అనుకుంటున్నారా.. చైనాలో ఎగ్‌ని వారు వాటర్‌తో కాకుండా టాయిలెట్ పోసి ఉడక బెడుతారంట.. ఇది వినడాని ఏదోలా ఉంది కదా.. కానీ, ఇదే నిజం.

చైనాలోని జెజియాంగ్‌లోని డాంగ్‌యాంగ్ ప్రాంతంలో ఓ వింత సాంప్రదాయం ఉంది. టాయిలెట్‌లో ఎగ్ ఉడకబెట్టడం వారి సాంప్రదాయ వంటకం. అంతే కాకుండా అక్కడి ప్రజలు దీన్ని చాలా ఇష్టంగా తింటారట. అయితే గుడ్లను ఉండికించడానికి.. 10 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల నుంచి మూత్రం సేకరించేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ మూత్రంలో ఉడకబెట్టిన గుడ్లతో అక్కడివారు ప్రత్యేక వంటకం చేస్తారు. ఆ వంటనానికి Virgin boy egg డిష్ అని పిలుస్తారు. అయితే గుడ్లను ఉడికించడానికి అవసరమైన మూత్రం సేకరించడానికి.. అక్కడ ఫుడ్ స్టాల్ యజమానులు.. స్కూల్స్‌లో బకెట్లను ఉంచుతారు. 10 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను వాటిలో టాయిలెట్ కి వెళ్లాల్సిందిగా చెప్తారు. ఆ విధంగా సేకరించిన మూత్రాన్ని గుడ్లు ఉడికించడానికి వాడతారు. అలా ఉడక బెట్టిన ఎగ్ తినడం వారి ఆరోగ్యానికి చాలా మంచిదని వారి విశ్వాసం.

Advertisement

Next Story

Most Viewed