ఆర్టీసీ అభివృద్ధికి అందరూ కృషి చేయాలి : బాజిరెడ్డి గోవర్దన్

by Shyam |
ఆర్టీసీ అభివృద్ధికి అందరూ కృషి చేయాలి : బాజిరెడ్డి గోవర్దన్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆర్టీసీ అభివృద్ధికి ఉద్యోగులు, సిబ్బంది పాటుపడాలని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపు నిచ్చారు. అధికారులు, సిబ్బంది.. సంస్థ తమదనే భావనతో ముందుకు సాగితే ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావొచ్చు అన్నారు. హైదరాబాద్ లోని టీఎస్ ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్ భవన్ లో హంస ఈక్విటీ పార్టనర్స్ సౌజన్యంతో మేధో మథనం సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీని గట్టేక్కించే బాధ్యత ప్రతీ ఉద్యోగిపై ఉందన్నారు. సంస్థ మనది అనే భావన రావాలని అప్పుడే సంస్థ లాభాల బాటలో పయనిస్తుందన్నారు. ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. సంస్థ అభివృద్ధిలో ఉద్యోగులు, సిబ్బంది భాగస్వాములు కావాలన్నారు. స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని ముందుకు సాగాలని సూచించారు. ఈ సదస్సులో ప్రభుత్వ కార్యదర్శి కేఎస్ శ్రీనివాసరాజు, సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, హెచ్ఓడీలు, రీజినల్ మేనేజర్లు, డివిజన్ల మేనేజర్లు, డిపో మేనేజర్లు పాల్గొన్నారు.

Advertisement

Next Story