- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇక్కడ వధువుకి.. అక్కడ వరుడికి కరోనా
దిశ, ఏపీ బ్యూరో: కరోనా వైరస్ ఎంతోమంది జీవితాల్లో మార్పులు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా కరోనా ఇద్దరి పెళ్లిళ్లు ఆపేసి, వాయిదా వేసేలా చేసింది. వధువుకి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో తెల్లవారితే జరగాల్సిన వివాహం ఆగిపోయిన ఘటన కర్నూలు జిల్లా నందికొట్కూరులో చోటుచేసుకుంది. ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే.. నందికొట్కూరులోని చెంచుకాలనీకి చెందిన యువతికి ఈ నెల 25 వివాహం నిశ్చయమైంది.
అయితే, తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన కొవిడ్ నిబంధనల ప్రకారం పెళ్లికి మూడు రోజుల ముందు వధూవరులిద్దరూ కొవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. నిన్న ఉదయం వచ్చిన రిపోర్టుల్లో వధువుకు కరోనా సోకినట్టు తేలింది. దీంతో అధికారులు వెంటనే ఆమె ఇంటికి చేరుకుని విషయం చెప్పారు. దీంతో చేసేదేమీ లేక ఇరు కుటుంబాలు పెళ్లిని వాయిదా వేసుకున్నాయి.
మరో ఘటనలో తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో యువకుడిని పెళ్లి కుమారుడిని చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. అదే సమయంలో అతడికి కరోనా సోకినట్టు రిపోర్టులు రావడంతో పెళ్లిని వాయిదా వేసుకున్నారు. కాగా, నందికొట్కూరులో ఈ నెల 22న కోటా హైస్కూలు వద్ద 378 మందికి అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు. తాజాగా, వీరిలో 100 మందికి వైరస్ సంక్రమించినట్టు రిపోర్టుల్లో నిర్ధారణ అయింది. దీంతో పెళ్లిళ్లలో కరోనా కష్టాలని ఆందోళన చెందుతున్నారు.