హుజురాబాద్ వేదికగా ఈటల సంచలన ప్రకటన

by Anukaran |   ( Updated:2021-07-10 06:54:39.0  )
హుజురాబాద్ వేదికగా ఈటల సంచలన ప్రకటన
X

దిశ, హుజురాబాద్ : అధికార టీఆరెస్ పార్టీని ముప్పతిప్పలు పెట్టి, వారి వ్యూహాలన్ని కూడా బెడిసి కొట్టే స్కెచ్ వేశారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు టీఆరెస్ ముఖ్య నాయకులంతా హుజురాబాద్ పైనే దృష్టి సారించారు. ఈటల ఓటమే లక్ష్యంగా టీఆరెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో గులాబీ దండుకు షాకిచ్చేందుకు ఈటల సంచలన ప్రకటన చేశారు.

శనివారం ఆయన హుజురాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నియోజకవర్గం అంతా పాదయాత్ర చేయబోతున్నట్టు ప్రకటించారు. బత్తినివారిపల్లి నుండి ప్రారంభం కానున్న పాదయాత్ర 350 నుడి 400 కిలోమీటర్లు ఉంటుందని రాజేందర్ తెలిపారు. దీంతో నిత్యం ప్రజల మధ్య ఉన్నట్టవుతుందని ఈటల భావిస్తున్నారు. టీఆరెస్ ప్రజలను తనకు అనుకూలంగా మల్చుకునేందుకు ఈటల పాదయాత్ర స్కెచ్ వేసినట్టు అర్థం అవుతోంది.

Advertisement

Next Story