ఉద్యోగుల జీవితాల్లో మట్టికొట్టొద్దు.. కేసీఆర్‌పై ఈటల ఫైర్

by Sridhar Babu |   ( Updated:2021-12-28 02:20:33.0  )
Eetala
X

దిశ, సూర్యా పేట: ఉద్యోగులను మనోవేదనకు గురిచేయద్దని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. సూర్యాపేట పీజీఏఫ్ కళాశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన సూర్యాపేట జిల్లా బీజేపీ శిక్షణ తరగతులలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. జీవో 124 ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా స్థానికత ఆధారంగా మూడు సంవత్సరాల ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం స్థానికత ప్రాతిపదికన ఉద్యోగుల విభజన జరగాలని ఆదేశాలున్నప్పటికి కేసీఆర్ నిద్రావస్థలో ఉన్నాడని ఎద్దేవా చేశారు. ఆయన కేవలం ఫార్మ్‌హౌస్‌కె పరిమితమై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉద్యోగులను నిర్లక్ష్యం చేశారన్నారు.

అభ్యంతరాలపై ఉద్యోగులతో చర్చించి విధివిధానాలు ఖరారు చేయాలని, ఉద్యోగుల బదిలీలపై ఏకపక్షంగా కేసీఆర్ నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఉద్యోగులను కేసీఆర్ హింసిస్తున్నారని, శాస్త్రీయత, పారదర్శకత లేకుండా బదిలీలు చేయడం విడ్డూరమని ఈటల అన్నారు.ఉద్యోగుల డిమాండ్లను పరిగణలోకి తీసుకొని బదిలీలు చేపట్టాలని కేసీఆర్ తానే రాజని, తనకే అన్నీ తెలుసని, తాను చెప్పిందే చేయాలని హుకుం జారీ చేస్తున్నారని అన్నారు. మూడు సంవత్సరాలు కుంభ కర్ణుడిలా పడుకొని పట్టించుకోకుండా ఇప్పుడు హడావుడి చేస్తున్నారని అన్నారు. సకల జనుల సమ్మె చేసి తెలంగాణ సాధనలో భాగమైన వారి జీవితాల్లో మట్టి కొట్టొద్దని ఆటల అన్నారు.

Advertisement

Next Story

Most Viewed