- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
SBI SCO పరీక్ష హాల్ టికెట్ విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
దిశ, ఫీచర్స్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ (SCO) రిక్రూట్‌మెంట్ పరీక్ష కోసం అడ్మిట్ కార్డ్‌ను విడుదల చేసింది. SBI అధికారిక వెబ్‌సైట్ sbi.co.inలో అడ్మిట్ కార్డ్ లను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు దరఖాస్తు నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేసి అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు 2 ఫిబ్రవరి 2024 వరకు మాత్రమే హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా మొత్తం 439 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, మేనేజర్ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 2వ తేదీన పరీక్షలు నిర్వహించనున్నారు.
అడ్మిట్ కార్డ్‌ని ఇలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..
SBI అధికారిక వెబ్‌సైట్ sbi.co.inకి లాగిన్ అవ్వండి.
హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న కెరీర్ లింక్ పై క్లిక్ చేయండి.
ఇప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
లాగిన్ ఆధారాలను ఇక్కడ నమోదు చేసి సమర్పించాలి.
మీ స్క్రీన్ పై హాల్ టికెట్ కనిపిస్తుంది.
వెంటనే మీరు మీ హాల్ టికెట్ ని డౌన్లోడ్ చేసుకోండి.
SBI జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం నిర్ణీత కేంద్రాలలో పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులందరూ పరీక్ష సమయంలో మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉంటుంది. హాల్ టిక్కెట్‌తో పాటు, మీరు పరీక్షా కేంద్రానికి ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ, పాన్ కార్డ్ వంటి అధికారిక ఫోటో గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి.