- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Alert:650 బ్యాంకు ఉద్యోగాలకు దరఖాస్తు చేశారా?.. లాస్ట్ డేట్ ఇదే!

దిశ,వెబ్‌డెస్క్: IDBI బ్యాంకులో 650 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు మార్చి 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ పాసై, 20-25 ఏళ్ల మధ్య వయసున్న వారు అర్హులు. రిజర్వేషన్ బట్టి సడలింపు ఉంటుంది. ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఏప్రిల్ 6న పరీక్ష ఉంటుంది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.idbibank.in/ ను సందర్శించండి.
అర్హతలు..
*అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
*కంప్యూటర్ నాలెడ్జ్, ప్రాంతీయ భాష పరిజ్ఞానం ఉండాలి.
*వయోపరిమితి: మార్చి 1, 2025 నాటికి 20 - 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
*జీతం-స్టైపెండ్: శిక్షణ సమయంలో నెలకు రూ.5,000, ఇంటర్న్‌షిప్ సమయంలో నెలకు రూ.15,000 స్టైపెండ్ ఉంటుంది.
దరఖాస్తు విధానం..
*ఈ పోస్టులకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
*దరఖాస్తు ఫీజు: SC/ ST/ PWD అభ్యర్థులు రూ.250, ఇతరులు రూ.1050 చెల్లించాల్సి ఉంటుంది.
*పరీక్షా కేంద్రాలు: ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, లఖ్‌నవూ, పట్న తదితర నగరాల్లో పరీక్షా కేంద్రాలు ఉంటాయి.
*ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
Read More ....
యూట్యూబ్‌లో యాడ్స్‌తో చిరాకొస్తుందా? అయితే ఈ స్పెషల్ ఆఫర్ మీకోసమే.. ఏంటో తెలుసుకోండి!