GATB & బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్ - 2023

by Harish |
GATB & బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్ - 2023
X

దిశ, ఎడ్యుకేషన్: పోస్ట్ గ్రాడ్యుయేట్ బయోటెక్నాలజీ విభాగాల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ -బయోటెక్నాలజీ (జీఏటీ-బీ) 2023, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్‌ల కోసం (బీఈటీ) 2023ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహిస్తోంది. ఈ పరీక్షలో సాధించిన మెరిట్ ద్వారా వివిధ ఇన్‌స్టిట్యూట్లు, యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందవచ్చు.

వివరాలు:

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ - బయోటెక్నాలజీ (జీఏటీ-బి), బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్ (బీఈటీ) 2023.

జీఏటీ -బీ కోర్సులు:

1. ఎంఎస్సీ (సంబంధిత విభాగాలు)

2. ఎంటెక్ (సంబంధిత విభాగాలు)

3. ఎంవీఎస్సీ (యానిమల్ బయోటెక్నాలజీ)

అర్హత: 55 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఎస్సీ, ఎంబీబీఎస్, బీడీఎస్, బీవీఎస్సీ, బీఎఫ్‌ఎస్సీ, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీపీటీ, బీటెక్, అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం ఉత్తీర్ణులై ఉండాలి.

బీఈటీ కోర్సులు: ఈ ఎగ్జామ్ లో చూపిన ప్రతిభ ఆధారంగా పీహెచ్‌డీ ప్రోగ్రాంలో ప్రవేశాలు పొందవచ్చు.

అర్హత: 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంబీబీఎస్, ఎంటెక్, ఎంఎస్సీ, ఎంవీఎస్సీ, ఎంఫార్మసీ, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 28 ఏళ్లు మించరాదు. (నిబంధనల ప్రకారం సడలింపు వర్తిస్తుంది)

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: మార్చి 31, 2023.

పరీక్ష తేదీ: ఏప్రిల్ 23, 2023.

వెబ్‌సైట్: https://dbt.nta.ac.in

Advertisement

Next Story

Most Viewed