Big Breaking: రేపు ఈ జిల్లాలోని స్కూళ్లకు సెలవు లేదు

by Kavitha |
Big Breaking: రేపు ఈ జిల్లాలోని స్కూళ్లకు సెలవు లేదు
X

దిశ, వెబ్‌డెస్క్: రేపు(సెప్టెంబర్ 14) సెకెండ్ శనివారం కావడంతో తెలంగాణ రాష్ట్రంలో సెలవు ఉండనుంది. కానీ, ఏపీ లోని గుంటూరు జిల్లా వ్యాప్తంగా రేపు స్కూళ్లు యథావిధిగా పని చేస్తాయని DEO శైలజా ఆదేశాలు జారీ చేశారు. 2వ శనివారం అయినా కూడా ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు వర్కింగ్ డే ప్రకటించారు. ఇటీవల భారీ వర్షాల నేపథ్యంలో వరుస సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ కారణంగానే రేపు వర్కింగ్ డేగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాగా మిగతా జిల్లాల్లోనూ స్కూళ్లకు సెలవులు రద్దు చేయడంపై ఆయా జిల్లాల కలెక్టర్లు నిర్ణయం తీసుకునే ఛాన్సుంది.

Advertisement

Next Story

Most Viewed