Bank of Maharashtra Jobs: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల

by Maddikunta Saikiran |   ( Updated:2024-10-15 14:39:06.0  )
Bank of Maharashtra Jobs: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయితున్న వారి కోసం ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(Bank of Maharashtra) గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో 600 అప్రెంటీస్ పోస్టుల(Apprentice posts) భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జనరల్ కేటగిరీలో 305, ఎస్సీ కేటగిరీలో 65, ఎస్టీ కేటగిరీలో 48, ఓబీసీ కేటగిరీలో 131, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో 51 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌(AP)లోని బ్యాంకు శాఖల్లో 11, తెలంగాణ(Telangana)లోని బ్యాంకు శాఖల్లో 16 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు www.bankofmaharashtra.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 24 అక్టోబర్ 2024.

విద్యార్హత:

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

అభ్యర్థుల వయస్సు జూన్ 30 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.ఎస్టీ, ఎస్సీలకు 5 ఏళ్లు; ఓబీసీలకు 3 ఏళ్లు; దివ్యాంగులకు 10-15 ఏళ్ల వరకు సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ:

12వ తరగతి (హెచ్‌ఎస్‌సీ/ 10+2)/ డిప్లొమా మార్కులు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను అప్రెంటీస్ పోస్టులకు ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు:

అన్ రిజర్వ్డ్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.150+జీఎస్టీ, ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు రూ.100+జీఎస్టీ అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. దివ్యాంగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

జీతం:

అప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.9000 స్టైపెండ్ అందిస్తారు.

Advertisement

Next Story

Most Viewed