AF CAT ఫలితాలు విడుదల

by Jakkula Mamatha |
AF CAT ఫలితాలు విడుదల
X

దిశ,వెబ్‌డెస్క్: భారత వైమానిక దళం(Indian Air Force)లోని పలు విభాగాల్లో 336 పోస్టుల భర్తీకి నిర్వహించిన ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్(AF CAT) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ క్రమంలో ఫిబ్రవరి 22, 23 తేదీల్లో ఈ నియామక పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా ఫలితాలు వెల్లడించారు. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఏఎఫ్‌సీఏటి అధికారిక వెబ్‌సైట్‌లో https://afcat.cdac.in/afcatreg/candidate/loginలో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఫలితాల కోసం లింక్ ఓపెన్ చేసి ఈ-మెయిల్ ఐడీ, పాస్ వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. అలాగే అభ్యర్థులు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ పాస్‌వర్డ్ కోసం తమ ఈ-మెయిల్ లోని ఇన్‌బాక్స్‌తో పాటు స్పామ్ ఫోల్డర్‌ను చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.



Next Story

Most Viewed