దరఖాస్తుకు ఇంకా ఐదు రోజులే.. ఇంతకీ దేనికంటే..?

by Naveena |
దరఖాస్తుకు ఇంకా ఐదు రోజులే.. ఇంతకీ దేనికంటే..?
X

దిశ, రాజాపేట: రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు కొరకు ఇప్పటికే 25 వేలకు పైగా జిల్లాలో దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఈనెల 14వ తేదీ ఆఖరి రోజు కావడంతో.. భారీగా దరఖాస్తులు వస్తాయని అధికారులు ఆశిస్తున్నారు. పాత కులం సర్టిఫికెట్ తో ఆదాయ సర్టిఫికెట్ లేకున్నా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది. ప్రజలు కులం సర్టిఫికెట్ కోసం మీ సేవలకు తరలి వెళ్తున్నారు. అక్కడ దరఖాస్తు చేసి తహసిల్దార్ కార్యాలయానికి వెళ్లి చేయించుకుంటామని మీ సేవ వాళ్ళతో గొడవ చేస్తున్నారు. తహసిల్దార్ కార్యాలయం అధికారులు తమ కార్యాలయానికి పంపించవద్దని సూచిస్తున్నారని చెప్పినప్పటికీ వినడం లేదని మీ సేవ నిర్వాహకులు వాపోతున్నారు. 12న రెండో శనివారం 13న ఆదివారం 14న సెలవు దినం కావడంతో ఎప్పుడు తమ సర్టిఫికెట్లు వస్తాయో అని ఎదురు చూస్తున్నారు.

దరఖాస్తుదారులు రావద్దు : డిప్యూటీ తాసిల్దార్

మీ సేవలో దరఖాస్తు చేసిన కులం సర్టిఫికెట్ కొరకు రిసిప్ట్ పట్టుకుని తమ కార్యాలయానికి రావద్దని డిప్యూటీ తాసిల్దార్ వెంకటరెడ్డి మీసేవ నిర్వాహకులకు బుధవారం సూచించారు. దరఖాస్తు చేసిన వారు తమ ఫోన్ లో మెసేజ్ వచ్చిన తర్వాత మీ సేవకి వెళ్లి సర్టిఫికెట్ తీసుకోవాలని అన్నారు. నాలుగు రోజుల క్రితం అప్లై చేసిన కులం సర్టిఫికెట్ కొరకు రిసిప్ట్ తో కార్యాలయానికి మణెమ్మ అనే వ్యక్తి వెళితే రావద్దని పంపించారు.



Next Story

Most Viewed