Ayodhya: అయోధ్య భక్తులకు గుడ్ న్యూస్.. రామ్ దర్బార్‌లోకి భక్తులకు అనుమతి!

by D.Reddy |
Ayodhya: అయోధ్య భక్తులకు గుడ్ న్యూస్.. రామ్ దర్బార్‌లోకి భక్తులకు అనుమతి!
X

దిశ, వెబ్ డెస్క్: అయోధ్య (Ayodhya) వెళ్లాలనుకునే భక్తులకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ (SRJBT) గుడ్ న్యూస్ చెప్పింది. రామాలయంలో నిర్మించిన రామ్ దర్భార్ (Ram Darbar)లోకి జూన్ 6 నుంచి భక్తుల్ని అనుమతించనుంది. అయితే, రామ్ దర్భార్ ప్రారంభానికి ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌డం లేద‌ని స్పష్టం చేసింది. జనవరి 22, 2024న రామ్‌లల్లా ప్రాణష్టాపన చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రాజారాంగా రాముడి విగ్ర‌హాన్ని రామ్ ద‌ర్బార్‌లో ప్ర‌తిష్టించ‌నున్న‌ారు. ఫ‌స్ట్ ఫ్లోర్‌లో నిర్మిస్తున్న ద‌ర్బార్‌లో రాజా రామ్‌ను ప్ర‌తిష్టిస్తారు.

మే 23వ తేదీన జ‌రిగే కార్య‌క్ర‌మంలో రాముడు, సీత, రాముడి సోద‌రుల విగ్ర‌హాల‌ను ఆ రోజున ప్ర‌తిష్టించనున్నారు. ద‌ర్బార్‌లో రాముడి విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టించిన స‌మ‌యంలో పూజ‌లు నిర్వ‌హిస్తామ‌ని, కానీ అది ప్రాణ ప్ర‌తిష్ట త‌ర‌హాలో ఉండ‌ద‌ని ఆలయ ట్రస్ట్ వెల్లడించింది. ర‌క‌ర‌కాలు పూజ‌లు నిర్వహిస్తామ‌ని, అవి జూన్ 5వ తేదీన పూర్తి అవుతాయ‌ని తెలిపింది. ఇక పూజ ముగిసిన త‌ర్వాత జూన్ 6వ తేదీ నుంచి రామ్ ద‌ర్బార్‌లోకి భ‌క్తుల్ని అనుమ‌తించనుంది.



Next Story

Most Viewed