- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దృశ్యావిష్కరణలకు ప్రతీక ఝాంగ్
1980ల తర్వాత అంతర్జాతీయ సినిమాను చైనా తన దేశంలోకి అనుమతించడంతో 'బీజింగ్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్' నుంచి ఐదవ తరం చలనచిత్రకారులు ఉద్భవించారు. ఫ్రెంచి సినిమాల ప్రభావంతో చైనాలో న్యూ వేవ్ ఆరంభమైంది. అట్లా ఆధునికతను సంతరించుకున్న దర్శకులలో ఝాంగ్ యిమో, జాంగ్ జూన్ జాడో, చెం కైగీ, లాంటివారు ముఖ్యులు. 1950లో శాంగ్చీ ప్రాంతంలో జన్మించిన ఝాంగ్ యిమో కుటుంబం నేషనలిస్ట్ ఆర్మీతో సంబంధాల కారణంగా అష్టకష్టాలు పడింది. 1966లో చైనా సాంస్కృతిక విప్లవ కాలంలో సెకండరీ స్కూలు విద్యనూ వదిలేసి ఓ చేనేత మిల్లులో కార్మికుడిగా చేరాడు. ఆ తర్వాత ఫొటోగ్రాఫర్‌గా ఎదిగాడు.
'ఝాంగ్ యిమో' చైనా నుంచి ఎగిసి వచ్చిన ఓ గొప్ప దర్శకుడు. ఆయన సినిమాల నిండా మానవ ఉద్వేగాలూ ప్రేమలూ, అభిమానాలూ, హింస. ప్రతీకారాలు వెరసి మానవ జీవితాలలోని అన్ని స్పందనా ప్రతిస్పందనలను మనం గమనించవచ్చు. ఝాంగ్ సినిమాలలో ప్రతి ఫ్రేమూ, మౌలిక రంగుల సాంద్రత, అద్భుతమనిపించే లైటింగ్, విశాలంగా కనిపించే దృశ్యాలూ కలగలిసి విశాలమైన కాన్వాస్ పైన గీసిన పెయింటింగ్‌లా కనిపిస్తాయి. ముఖ్యంగా ఝాంగ్ తొలి సినిమాలలో తాజాదనం చూపరులను తన్మయులను చేస్తుంది.
తను ప్రాథమికంగా ఫొటోగ్రాఫర్ కావడంతో దృశ్యాల మధ్య లయను సాధించడంలో విజయాన్ని సాధించాడు. ప్రపంచవ్యాపితంగా అందరి ప్రశంసలను అందుకున్నాడు. ఝాంగ్ సినిమాలలో చైనాకు సంబంధించిన గతం, వర్తమానం, భవిష్యత్తు గోచరిస్తాయి. చైనాకు చెందిన ఐదవ తరం దర్శకులలో ఝాంగ్ ఎన్నదగినవాడు. ఆయన నిర్మాణ శైలిలో విజువల్ డిస్‌ప్లే ప్రధాన అంశం. అందులోనూ మహిళలను ప్రధాన భూమికగా చేయడం కూడా ఆయన ప్రతిభ.
ఆధునికతను సంతరించుకుని
1980ల తర్వాత అంతర్జాతీయ సినిమాను చైనా తన దేశంలోకి అనుమతించడంతో 'బీజింగ్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్' నుంచి ఐదవ తరం చలనచిత్రకారులు ఉద్భవించారు. ఫ్రెంచి సినిమాల ప్రభావంతో చైనాలో న్యూ వేవ్ ఆరంభమైంది. అట్లా ఆధునికతను సంతరించుకున్న దర్శకులలో ఝాంగ్ యిమో, జాంగ్ జూన్ జాడో, చెం కైగీ, లాంటివారు ముఖ్యులు. 1950లో శాంగ్చీ ప్రాంతంలో జన్మించిన ఝాంగ్ యిమో కుటుంబం నేషనలిస్ట్ ఆర్మీతో సంబంధాల కారణంగా అష్టకష్టాలు పడింది. 1966లో చైనా సాంస్కృతిక విప్లవ కాలంలో సెకండరీ స్కూలు విద్యనూ వదిలేసి ఓ చేనేత మిల్లులో కార్మికుడిగా చేరాడు. ఆ తర్వాత ఫొటోగ్రాఫర్‌గా ఎదిగాడు. 1974లో సొంత కెమెరా కొనుక్కొని ఝాంగ్ తీసిన ఫొటోలు పత్రికలలో అచ్చయ్యాయి.
1979లో ఆయన 'బీజింగ్ ఫిలిం అకాడమీ' లో చేరాడు. 1982లో కోర్సు పూర్తి చేసుకుని పూతియాన్ మింగ్ అనే దర్శకుడి వద్ద సహాయకుడిగా కుదిరాడు. 'ఓల్డ్ వెల్' సినిమాకు ఫొటోగ్రాఫర్‌గా పని చేసాడు. చెం కైగీ లాంటి దర్శకుల వద్ద పని చేసాడు. ఎల్లో ఎర్త్, డి వాన్ ఎర్త్ లాంటి సినిమాలకు కెమెరా వర్క్ చేసాడు. 1987లో ఝాంగ్ తీసిన 'రెడ్ సోర్ఘం' జూడో, రేస్ ది రెడ్ లాంతర్' ఆయన ట్రిలోజీగా పేరు తెచ్చుకున్నాయి. 'రెడ్ సోర్ఘం' ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలను అందుకుంది. 1988లో బెర్లిన్ అంతర్జాతీయ చిత్రోత్సవంలో గోల్డెన్ బేర్ అవార్డును అందుకుంది. 1930ల నాటి ఉత్తర చైనా ప్రాంత ప్రజలకు చెందిన కథ ఇది. ఆనాటి ప్రజలు నేల కోసం, తన సోదరుల త్యాగాల కోసం తమను తాము అర్పించుకోవడం మనసులను కదిలిస్తుంది. సినిమా అద్భుత గేయంలాగా సాగుతుంది. సినిమా చివరికి వచ్చేసరికి ఒక ఉద్విగ్నతకు లోనవుతాం. ఉద్వేగంతో పాటు సాంకేతిక పరిణితి స్పష్టంగా కనిపిస్తుంది. సినిమా చివరిదాకా ఉండే కథనాత్మక బిగువు మన కళ్లని, మనసుని కట్టి పడేస్తుంది.
నానమ్మ కథ అంటూ..
'రెడ్ సోర్ఘం' కొంతవరకు దర్శకుడు ఝాంగ్ యిమో ఆత్మ కథే. అందుకే ఆయన ఆ సినిమాను తన 'నానమ్మ కథ' అంటూ మొదలు పెడతారు. మనుమడు కనిపించడు. కేవలం కథ చెబుతూ ఉంటాడు. నానమ్మ పెళ్లవగానే అత్తవారింటికి బయలుదేరుతుంది. ఆనాటి ఆచారం ప్రకారం ఆమె తండ్రి డబ్బు తీసుకుని ఆమెను 50 ఏళ్ల లోఫర్‌కు ఇచ్చి పెళ్లి చేస్తాడు. అతడు సారాయి తయారు చేసేవాడు. పల్లకిలో అత్తవారింటికి వెళ్తుండగా దారిలో బందిపోటు దొంగలు దోచుకునే ప్రయత్నం చేస్తారు. బోయీలు ఎదిరించి పోరాడుతారు. బందిపోటు దొంగలు పారిపోతారు. భర్త సేవకులలో ఒకడు పెళ్లి కూతురిని స్పర్శించడంతో వారిద్దరిలో ప్రేమ అంకురిస్తుంది.
అత్తావారింటిలో మూడు రోజులున్న తర్వాత తిరిగి ఆమె తండ్రి వద్దకు వస్తుంది. మళ్లీ అత్తవారింటికి వెళ్లడానికి నిరాకరించడంతో ఆమెను తిట్టి పంపిస్తారు. కోపంతో బయలుదేరిన ఆమెను దారిలో భర్త సేవకుడు ఎత్తుకెళ్లి అనుభవిస్తాడు. ఊరు చేరేటప్పటికి భర్తను ఎవరో చంపేసి ఉంటారు. ఆమె సేవకులందరినీ కూడగట్టి అక్కడే సారా తయారు చేయడం ఆరంభిస్తుంది. సేవకుడు అందరినీ ఒప్పించి ఆమెను తన భార్యగా ప్రకటిస్తాడు. దాంతో అతడు బాస్ అయిపోతాడు. కొంత కాలానికి వారికి కొడుకు పుడతాడు. ఇంతలో చైనాపై జపనీయుల దాడి ప్రారంభమవుతుంది. జపాన్ సైనికులు వీరి ఊరి పైన దాడి చేసి అందరినీ పట్టుకుని బానిసలుగా చేసుకుని తమ పనులు చేయించుకుంటారు. ఆమె ఒక రాత్రి తనవారినందరినీ లేపి 'మీరు మగవాళ్లయితే జాపాన్ ట్రాక్‌ను పేల్చి వేయండి' అంటుంది. అంతా మర్నాడు ట్రాక్‌ను పేల్చేసి అందరూ మరణిస్తారు. ఆమె కూడా మరణిస్తుంది. భర్త, కొడుకూ మిగిలిపోతారు. చైనా గ్రామీణ సౌందర్యాన్ని ఆవిష్కరిస్తూ సాగే ఈ సినిమాలో హీరోయిన్ గాంగ్ లీ విశేష ప్రశంసలు అందుకుంది.
ఇవీ కళాఖండాలే
ఝాంగ్ తిలోజీలో రెండో సినిమా 'జుదో' ఇది కూడా చారిత్మాక అంశంతోనే రూపొందింది. ఆస్కార్‌కి నామినేట్ అయిన తొలి చైనా సినిమాగా పేరు తెచ్చుకుంది. ఝాంగ్ యిమో తర్వాతి సినిమా 'టు లివ్' 20 వ శతాబ్దం ప్రారంభ కాలం నుంచి మూడు తరాల చైనీయులు ఎదుర్కొన్న అనుభవాలను మన ముందుంచుతుంది. సినిమా ఎపిక్‌లాగా సాగుతుంది. తర్వాత ఝాంగ్ యిమో 'షాంఘై ట్రేడ్' సినిమా తీశారు. 1930ల కాలంలో ఏడు రోజుల కాల గమనం దీని ఇతివృత్తం.
14 ఏళ్ల గ్రామీణ యువకుడి కోణంలోంచి అండర్ వరల్డ్‌నీ చూపిస్తుందీ సినిమా. తర్వాత కీప్ కూల్ (నియో రియలిస్టిక్ స్టయిల్‌లో నిర్మంచబడింది), నాట్ వాన్ లెస్ ( ఆధునిక చైనా నగరం పైన తీసింది), ద రోడ్ హోం, హాప్పీ టైం, రైడింగ్ అలాన్ ఫర్, కార్స్ ఆఫ్ ద గోల్డెన్ ఫ్లవర్, మూవీ నైట్, థౌజెండ్స్ ఆఫ్ మైల్స్ , హీరో, హౌస్ ఆఫ్ ఫ్లయింగ్ దాగార్స్ లాంటి సినిమాలు తీశాడు. ఝాంగ్ యిమో. 2006లో కార్స్ ఆఫ్ ది గోల్డెన్ ఫ్లవర్, రోడ్ హోం తీశారు. రోడ్ హోం అచంచల ప్రేమతో ఉన్న ఒక యువతి గాథ. యిమో గత సినిమాలకన్నా భిన్నమయిన సినిమాగా పేరు తెచ్చుకుంది.
వారాల ఆనంద్
94405 01281