- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘నిజం గెలవాలి' ఫలించేనా?
నలబై రోజులుగా చంద్రబాబు పార్టీ శ్రేణులకు దూరం అవడంతో తెలుగుదేశం పార్టీలో ఓ రకమైన స్తబ్దత నెలకొంది. ఆయనపై కోర్టులో కేసులు సాగుతున్న తీరు చూస్తున్న ప్రజలకు కూడా ఇది ఇప్పుడప్పుడే తేలే వ్యవహారం కాదని అర్థమైంది. దీంతో పార్టీని ప్రజలకు దగ్గర చేసేందుకు చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ప్రజల మధ్యకు వెళ్లేందుకు నిర్ణయించుకొన్నారు. ‘నిజం గెలవాలి’ పేరుతో ఈ వారం నుంచి జిల్లా పర్యటనలను ప్రారంభించారు. పనిలో పనిగా జిల్లాలలోని పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆమె ముఖాముఖీ సమావేశమవుతూ తదుపరి కార్యాచరణ గురించి చర్చిస్తున్నారు. అయితే, తెలుగుదేశం పార్టీని నడిపే బాధ్యతని నారా భువనేశ్వరి తీసుకోబోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. టీడీనీ గౌరవాధ్యక్షురాలిగా నారా భువనేశ్వరి పేరుని పలువురు పార్టీ సీనియర్లు ప్రతిపాదిస్తున్నారు. ఆమె గౌరవాధ్యక్షురాలిగా వుంటే, సింపతీ వేవ్ పని చేస్తుందని పార్టీ శ్రేణులు నమ్ముతున్నారు.
కుటుంబాల పరామర్శ వ్యూహం
చంద్రబాబు అరెస్ట్ వేళ.. ఆవేదనతో మరణించిన అభిమానుల కుటుంబాల్ని పరామర్శించడం ద్వారా వారిలో నైతిక స్థైర్యాన్ని పెంచడం అనే వ్యూహంతో పాటు.. పార్టీ కార్యక్రమాలు వేగవంతం చేసి ప్రజలకు చేరువ కావాలనే అభిప్రాయంతో ఆమె ఈ పర్యటనలు చేస్తుందని తెలుస్తోంది. నిజానికి చంద్రబాబు అరెస్ట్ తర్వాత నారా బ్రాహ్మణి టీడీపీ పార్టీలో కీ రోల్ పోషిస్తుందని ప్రచారం జోరుగా సాగింది. కానీ తాజాగా.. ఆమెకు బదులుగా భువనేశ్వరితో ‘నిజం గెలవాలి’ కార్యక్రమాన్ని రూపొందించడం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ నిర్ణయం వెనకాల కారణం మాత్రం బలంగా ఉన్నట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండటంతో బ్రాహ్మణిని తొందరపాటుతో పార్టీలోకి లాగకుండా, నారా భువనేశ్వరిని ఇందులోకీ తీసుకొచ్చారు. పైగా ఆమెకు ఎన్టీఆర్ కుమార్తె అన్న సెంటిమెంట్‌తో పాటు.. చంద్రబాబు సతీమణిగా ప్రజల్లోకి వెళ్లేందుకు.. మరింత కష్టపడేందుకు వీలు కలుగుతుందనే వ్యూహంతో ముందుకు సాగుతున్నట్టు తెలుస్తుంది. అంతకీ అవసరమైతే బ్రాహ్మణి సేవలు కూడా వినియోగించుకోవాలని చూస్తుంది పార్టీ. భువనేశ్వరి వాగ్ధాటికి తోడు, చంద్రబాబు సతీమణిగా ఆమె పట్ల సానుభూతి ఉండటంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించి ప్రజల్లోకి వెళ్ళేందుకు నిర్ణయించుకున్నారు. ఈ యాత్ర జోన్ కు ఒకటి చొప్పున ఐదు జోన్లలో నిర్వహించే సభల్లో భువనేశ్వరి పాల్గొంటారు.
టీడీపీ ప్రభంజనం తప్పదా?
మరోవైపు లోకేశ్ కూడా భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తున్నారు. నిజానికి భువనేశ్వరి ఎప్పుడో జనంలోకి వెళ్లేవారు కానీ చంద్రబాబు కేసుల్లో నిర్ణయం కోసం వేచి చూశారు. అయితే ఇది ఎప్పటికప్పుడు వాయిదా పడుతుండటంతో భువనేశ్వరి జనాల్లోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. పైగా ఎన్నికలకు పెద్దగా సమయం కూడా లేకపోవడంతో జనాల్లోకి వెళ్లేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నారు టీడీపీ సానుభూతిపరులు. అలాగే చంద్రబాబు అరెస్టుతో ఆగిన భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నారా లోకేశ్ చేత ప్రారంభించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. పార్టీ కార్యక్రమాలు నిర్వహణ, సమీక్షపై నాలుగైదు రోజుల్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగనుంది. చంద్రబాబుతో నేను కార్యక్రమం నిర్వహిస్తూనే ప్రజల సమస్యలపై పోరాటాలు, పార్టీ కార్యక్రమాల స్పీడ్ పెంచాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. నిజానికి ఇప్పటివరకు భువనేశ్వరి వ్యాపారాలు తప్ప ఆమె రాజకీయాల్లో క్రియాశీలకంగా లేదు. అలాంటి భువనేశ్వరి జనాల్లోకి వెళితే వారు ఆమెను గుండెకు హత్తుకోవడం ఖాయం. ఈ యాత్ర విజయవంతమైతే ఇక మీదట టీడీపీ ప్రభంజనం కొనసాగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు.
వి. సుధాకర్
రాజకీయ విశ్లేషకులు
99898 55445