- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాలంటరీ రిటైర్మెంట్‌కు ఎవరు అర్హులు?
ప్రభుత్వ సర్వీసులోకి ప్రవేశించిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు అందులో ప్రవేశించగానే ఉద్యోగ విరమణ తేదీ ఖరారు చేయబడి ఉంటుంది. అయితే కొంత మంది ఉద్యోగులు ఉద్యోగ విరమణ కన్నా ముందే వివిధ రకాల కారణాల వల్ల ముందే ఉద్యోగ విరమణ చేయుటకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇటువంటి ఉద్యోగ విరమణను స్వచ్ఛంద ఉద్యోగ విర మణ అంటారు. అయితే, స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు ఎవరు అర్హులు? ఎంత సర్వీసు కలిగి ఉండాలి? తదితర అంశాల పట్ల ఉద్యోగ, ఉపాధ్యాయులకు, డిడివోలకు కనీస అవగాహన కలిగి ఉండాలి.
మూడు నెలల ముందు నోటీస్ ఇస్తేనే..
సవరించిన పెన్షన్ నియమావళి-1980 లోని రూల్ 43 ప్రకారం, ఉద్యోగి కొన్ని షరతులకు లోబడి స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేయుటకు ప్రభుత్వం అనుమతించింది. ఉద్యోగి కనీసం ఇరవై సంవత్సరాలకు తగ్గకుండా అర్హత గల సర్వీసు పూర్తిచేసి ఉంటేనే స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు అర్హులు. జీవో 130 తేదీ 21.3.1992 ప్రకారం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ అభీష్టం తెలియజేస్తూ ఉద్యోగి మూడు నెలల ముందుగా నియామకపు అధికారికి ముందస్తు సమాచారం ఇవ్వవలసి ఉంటుంది. అప్పుడే డీడీవో అనుమతించవచ్చు. క్రమశిక్షణా చర్యలు, న్యాయ విచారణలు అపరిష్కృతంగా ఉంటే స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు అవకాశం లేదు. రూల్ 43(5) జీవో 360 తేదీ- 31.12.1984 ప్రకారం పెన్షన్ లెక్కిం చడం కోసం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగికి ఐదు సంవత్సరాలు మించకుండా అర్హతగల సర్వీసుకు కలుపుతారు. మెడికల్ సర్టిఫికెట్ ఆధారంగా తీసుకున్న సాధారణ సెలవు ఇతరత్రా తీసుకున్న అలాంటి సెలవులు అర్హత గల సెలవులుగా పరిగణించబడవు. కానీ రాష్ట్రంలో గానీ, రాష్ట్రం వెలుపల గానీ దేశం వెలుపల గానీ ఉన్నత విద్యను అభ్యసించడానికి స్టయిఫండ్ తప్ప ఇతరత్రా ఏ విధమైన చెల్లింపులు స్వీకరించకుంటే అట్టి కాలం అర్హత గల సర్వీసుగా పరిగణించబడుతుంది.
కావాల్సిన సర్టిఫికేట్లు..
1980 రివైజ్డ్ పెన్షన్ రూల్స్‌లోని రూల్ -43 సబ్ రూల్ -3 ప్రకారం, లీవ్ నాట్ డ్యూలో ఉన్న ఉద్యోగి ఉద్యోగంలోకి తిరిగి రాకుండా స్వచ్ఛంద పదవి విరమణతో వెళ్లడానికి అనుమతిస్తే సెలవు మొదలైన తేదీ నుండి అమల్లోకి వస్తుంది. ఒకవేళ సెలవు జీతం చెల్లించకుంటే అటు మొత్తం తిరిగి రాబట్టాలి. గైర్హాజరు అయిన ఉ ద్యోగి స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కోసం అభ్యర్థిస్తే, అలాంటి అభ్యర్థనను క్రమ శిక్షణ చర్యలకు లోబడి అంగీకరించవచ్చు. క్రమశిక్షణ చర్యలు తీసుకోవలసి ఉంటే సదరు ఉద్యోగికి అభియోగ పత్రాలు జారీ చేయవలసి ఉంటుంది. తదుపరి ఉద్యోగి స్వచ్ఛంద పదవీ విరమణ చేసినప్పటికీ క్రమశిక్షణ చర్యలు కొనసాగించే అవకాశం ఉంటుంది. రూల్ 43(5) ప్రకారం గ్రాట్యుటీ 20 సంవత్సరాలకు లెక్కవేస్తారు. కుటుంబ పెన్షన్, కమ్యూటేషన్ సౌకర్యాలు వర్తిస్తాయి. స్వచ్ఛంద పదవీ విరమణ పొందువారికీ కారుణ్య నియామక పథకం వర్తించదు. స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పొందువారికి ఎటువంటి వైద్య పరీక్షలు అవసరం లేదు. స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పొందే ఉద్యోగ, ఉపాధ్యాయులు నియామక అధికారికి కొన్ని సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది. అవి 1. వాలంటరీ రిటైర్మెంట్ ప్రోఫార్మా. 2. నో అలిగేషన్ సర్టిఫికెట్. 3.నాన్ క్లైమింగ్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ ఫర్దర్ ఇన్ డిపార్ట్మెంట్. 4.మెడికల్ ఫిట్ నెస్ సర్టిఫికెట్. 5.అఫిడవిట్ ఆఫ్ ఫ్యామిలీ మెంబెర్స్. 6.డిక్లరేషన్ ఆఫ్ నో జాబ్ సర్టిఫికెట్ 7.నో డ్యూ సర్టిఫికెట్ 8. క్యాన్సలేషన్ ఆఫ్ స్టడీ సర్టిఫికెట్.
సుధాకర్.ఏ.వి
రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి, (STUTS)
90006 74747