- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బీసీల్లారా.. తానీషాలవ్వండి!
బీసీలు తరతరాలుగా అగ్రకుల నాయకుల కింద బానిసలుగానే ఉంటున్నారు. అన్ని రాజకీయ పార్టీలు అన్ని రంగాలలో బీసీలను మోసం చేస్తూనే ఉన్నాయి. ఇప్పటి తెలంగాణ పాలకులు నిన్నటి ఆంధ్ర పాలకుల చెంచాలు. రాష్ట్రం వచ్చాకా ఆ చెంచాలు పాలకులయ్యారు. మరి బానిసలు పాలకులుగా ఎప్పుడు మారుతారు? మేలుకో బీసీ ఏలుకో... నీ తెలంగాణ రజాకార్లను తరిమిన గడ్డ బడుగు బలహీనవర్గాల రక్తంతో తడిసిన నేల ఇది! ఇప్పుడున్న పాలక దొంగల ముఠా ఒక లెక్కా, వారిని రాజకీయాల నుండి తరమాలి! ఓటుతోనే వారి రాజకీయ జీవితాన్ని సమాధి చేయాలి. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన యోధులు బడుగు బలహీనవర్గాల వారు.. తెచ్చిన తెలంగాణను చెరపట్టి బీసీలకు ఎంగిలి మెతుకులు విదిలించి వారు మాత్రం అధికారాన్ని సంపదను దోచుక తింటున్నారు. ఒక్కొకడు వేల కోట్ల ధనాన్ని, భూములను మింగినారు.
దానికి తోడు తెలంగాణలో బీసీలకు జనాభా పరంగా 70 ఎమ్మెల్యే సీట్లు రావాలి! కానీ ఇవ్వరు, పైగా పిట్టల దొరలను మించిన మాటలు సభలలో మాట్లాడుతారు. పైగా, చెప్పును నిలపెట్టినా కుక్కని నిలపెట్టినా గెలుస్తుందంటారు. కానీ పైసలు ఖర్చు పెట్టగలిగే ఆర్థిక నేరస్తులకే ఎమ్మెల్యే టికెట్స్ ఇస్తారు! బీసీలకు మాత్రం పంచభక్ష్య పరమాన్నం చూపించి పచ్చడి నాకిస్తున్నారు. జనాభా పరంగా 10 శాతం కూడా లేకున్నా అధికారం గుప్పిట్లో పెట్టుకొని బీసీలకు సీట్లు ఇవ్వమని బెదిరిస్తున్నాయి. వారిని బెదిరించాల్సిన స్థితిలో ఉండాల్సిన 60 శాతం జనాభా కలిగిన బీసీలు మాత్రం అడుక్కుంటున్నారు. తెలంగాణలో బీసీలు అంపశయ్య మీద ఉన్నారు. బీసీలకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వని చోట వారికి ప్రచారం చేసే బీసీ కులం వాడు, బీసీల పాలిట సైంధవుడు, మారీచుడు, గుర్తు పెట్టుకోండి. వాడు ఎంగిలి కూడుకు ఆశపడే మూర్కుడు. బీసీలు అగ్రకులాల పల్లకి మోసే బోయలుగా ఇంకెంతకాలం ఉంటారు. అదే పల్లకిలో రాజుగా ఉండాలంటే కేవలం బీసీలు... బీసీలకు మాత్రమే ఓటు వేయాలి. మొద్దు నిదురలో ఉన్న బీసీలను చైతన్యం ఉన్న బీసీలు తట్టి లేపండి, మనం పాలితులంగా కాదు ఉండాల్సింది, పాలకులుగా ఉండాలని నినదించి చెప్పండి! ఎన్నికల బరిలో నిలపండి!
నారగొని ప్రవీణ్ కుమార్
సామాజిక కార్యకర్త
98490 40195