- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కంటెంట్ మొత్తం... కరెంట్ చుట్టూ..
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ‘కరెంట్’ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం రాజేస్తున్నది. కాంగ్రెస్ ఆధికారంలోకి వస్తే కరెంట్ ఉండదని, మూడు గంటల కరెంట్ కావాల్నో .. 24 గంటల కరెంట్ కావాల్నో తేల్చుకోవాలంటూ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సహా ఆ పార్టీ నేతలంతా ప్రచార సభల్లో అంటున్నారు. దీనికి దీటుగా పీసీసీ చీఫ్ కాంగ్రెస్ నేతలు రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలన్న ఆలోచన చేసిందే కాంగ్రెస్ అని, అమలు చేసింది కూడా కాంగ్రెస్సేనని కౌంటర్ ఇస్తున్నారు. బీఆర్ఎస్ చెప్తున్న 24 గంటల ఉచిత కరెంట్ రాష్ట్రంలో ఎక్కడా లేదని, ఉన్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని ప్రకటిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే తప్పకుండా 24 గంటలు నాణ్యమైన విద్యుత్ రైతులకు అందిస్తామని ప్రకటనలు గుప్పిస్తున్నారు.
వారికే ప్రజల మద్దతు!
నిజానికి భౌగోళికంగా తెలంగాణ భూభాగం విభిన్నంగా ఉంటుంది. సాగునీరు అనేది కాలువల ద్వారా అందించడం చాలా కష్టంతో కూడుకున్న చర్య. ఇటు కృష్ణా.. అటు గోదావరి రెండు నదుల కంటే తెలంగాణ భూభాగం ఎత్తులో ఉంటుంది. అందుకే రాష్ట్రంలో వ్యవసాయం బోర్లు, బావులపైనే ఆధారపడి ఉంటుందనేది అక్షరాలా నిజం. ఈ బోర్లు, బావుల్లోంచి నీటిని తోడుకునేందుకు విద్యుత్తు అవసరం. కానీ సొంత రాష్ట్రం ఏర్పడేంత వరకు కూడా ఉమ్మడి ప్రభుత్వాలు వ్యవసాయానికి కరెంటు అందించడంపై దృష్టి సారించలేకపోయాయి. దీంతో తెలంగాణ రైతులు తమ పంటలు సాగు చేసుకునేందుకు.. అదృష్టాన్ని, వరుణదేవున్ని నమ్ముకొనేవారు. నాణ్యమైన పూర్తి ఉచిత విద్యుత్తును అందించాలనే ఏకైక లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలకు రూపకల్పన చేసి అమలు చేసింది. సంస్థల్లో సంస్కరణలు తీసుకొచ్చారు. దీనివల్ల నాణ్యమైన విద్యుత్ సరఫరా సాధ్యపడింది. ఖచ్చితంగా 24 గంటలు విద్యుత్ అందించారా? లేదా అన్న దానిని పక్కకు పెడితే గత పాలకులకంటే మెరుగైన విద్యుత్‌ని రైతులకు అందించారనేది యధార్థం. ఈ విషయంపై చర్విత చరణమైన ప్రసంగాల కంటే వ్యవస్థలో ఉన్న తప్పులు సరిదిద్దుకుంటాం, ఇంకా మెరుగైన విద్యుత్ సంస్కరణలు తెస్తాం, అన్న ప్రకటన వైపే ప్రజలు మొగ్గుచూపుతున్నారు.
పదే పదే ప్రకటనలొద్దు!
రైతులకు విద్యుత్ ఒక్కతే ఇస్తే సరిపోదు. విత్తనాలు, ఎరువులు, నాణ్యమైన పురుగుమందులు, గిట్టుబాటు ధర, పంటల బీమా పై స్పష్టత ఇవ్వాలి. రైతులకు గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్, వ్యవసాయ యంత్రాల కొనుగోలుకి రుణాలు అందించి రైతు సంక్షేమంపై దృష్టి సారించాలి. రైతుబంధు లోని లోటు పాట్లను సరిద్దిద్దుతాం, అందరికి అర్హులైన వారికి ఇస్తామన్న హామీ రావాలి. రైతును రాజుగా చేస్తాం అని చాటాలి. రైతు సంక్షేమం గూర్చి చిత్తశుద్దిగా పనిచేస్తామని నమ్మకం కలిగించిన వారే విజేతలు. ఏది ఏమైనా ప్రచారంలో అస్త్రంగా కరెంట్ భలే షాక్ పుట్టిస్తోంది. ఒకే ప్రచారాస్త్రం తోనే కాకుండా మిగతా ఆంశాలపై తమ తమ వైఖరిని వెల్లడించి ఓటర్ల మన్ననను పొందాలి.
- వి. సుధాకర్
99898 55445