- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో బీజేపీ కీలక మలుపు
రాష్ట్రంలో మోడీ పర్యటన సమయంలో ప్రజల దృష్టి మళ్ళించడం కోసం యశ్వంత్ సిన్హా ను పిలిపించి బైక్ ర్యాలీ చేయడం వింతగా ఉంది. రాష్ట్రపతి ఎన్నికలలో ఓట్లు వేసేది ఎంపీలు, ఎమ్మెల్యేలు కానీ సామాన్య ప్రజలు కాదు కదా? దేశ ప్రధాన మంత్రి, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్రానికి వస్తే కనీసం స్వాగతం పలకకపోగా సేల్స్ మ్యాన్ అని విమర్శించారు. నిజంగా మోడీ సేల్స్ మ్యాన్. ఆయన సింబల్ ఆఫ్ సెల్ఫ్ లెస్ సర్వీసు అనే విషయం మరవరాదు. అతిథి దేవో భవ అన్న మాట మరచిపోవద్దు. అలాగే కార్యవర్గ సమావేశంలో ఇంటెలిజెన్స్ అధికారిని పంపి తీర్మానం కాపీలు దొంగిలించే ప్రయత్నం దేనికి సంకేతం?
భాగ్యనగర్ కేంద్రంగా బీజేపీ మూడు రోజులపాటు అట్టహాసంగా నిర్వహించిన జాతీయ కార్యవర్గ సమావేశాలు రాష్ట్ర రాజకీయాలను కీలక మలుపు తిప్పాయి. దేశ ప్రధానమంత్రి సహా కేంద్ర మంత్రులు, పందొమ్మిది మంది బీజేపీ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, దేశం నలుమూలల నుంచి వచ్చిన అగ్రనాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశాల ముగింపు సందర్భంగా అగ్ర నాయకులంతా ఒకే వేదిక పంచుకోవడం ద్వారా బీజేపీ తన బలాన్ని బలగాన్ని పటిష్ట నాయకత్వాన్ని ప్రదర్శించింది.
బీజేపి బలపడిందనడానికి
దేశం నలుమూలల నుంచి సమర్థవంతమైన జాతీయ నాయకులను తెలంగాణలోని 119 నియోజకవర్గాలలో మోహరించారు. వారు క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేసి ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. దాని ఆధారంగా తెలంగాణ సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై కూలంకషంగా చర్చించారు. గతంలో బీజేపీ కార్యవర్గ సమావేశాలు జరిగినా ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి ప్రక్రియ చేపట్టలేదు. బీజేపీ చరిత్రలో మొదటిసారి ఇలా చేసింది. దీనిని బట్టి జాతీయ నాయకత్వం రాడార్ మీద తెలంగాణ ఉందన్నది స్పష్టమవుతుంది. కూకటివేళ్ళతో కల్వకుంట్ల కుటుంబ పాలనను పెకిలించాలని బీజేపీ కృత నిశ్చయంతో ఉన్నది.
'టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం మేమే'అని బీజేపీ స్పష్టమైన సంకేతాలు ఇచ్చి ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఈ సమావేశాల ద్వారా ఐదు విషయాలు స్పష్టమయ్యాయి. అందులో మొదటిది తెలంగాణలో మోడీ ఇమేజ్ సరికొత్త స్థాయికి చేరడం, రెండవది రాష్ట్రంలో బీజేపీ పట్ల ఆసక్తి, ఆదరణ పెరగడం, మూడవది కేసీఆర్ ప్రభుత్వాన్ని కూకటివేళ్ళతో పెకిలించడానికి దృఢమైన నిర్ణయానికి రావడం, నాలుగోది దక్షిణాదిలో బీజేపీకి స్థానం లేదని వాదన తప్పని నిరూపితం కావడం. ఐదవది ఇక్కడ బీజేపీకి ఆదరణతో కేసీఆర్, టీఆర్ఎస్ అభద్రతా భావంతో ఉన్నారనేది. అందుకే సభ రోజు యశ్వంత్ సిన్హాను ఆహ్వానించడం, పోటాపోటీగా ప్లెక్సీలు పెట్టడం లాంటివి ఆయన భయానికి నిదర్శనం.
కుటుంబ పాలనకు వ్యతిరేకంగా
రాష్ట్రంలో మోడీ పర్యటన సమయంలో ప్రజల దృష్టి మళ్ళించడం కోసం యశ్వంత్ సిన్హా ను పిలిపించి బైక్ ర్యాలీ చేయడం వింతగా ఉంది. రాష్ట్రపతి ఎన్నికలలో ఓట్లు వేసేది ఎంపీలు, ఎమ్మెల్యేలు కానీ సామాన్య ప్రజలు కాదు కదా? దేశ ప్రధాన మంత్రి, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్రానికి వస్తే కనీసం స్వాగతం పలకకపోగా సేల్స్ మ్యాన్ అని విమర్శించారు. నిజంగా మోడీ సేల్స్ మ్యాన్. ఆయన సింబల్ ఆఫ్ సెల్ఫ్ లెస్ సర్వీసు అనే విషయం మరవరాదు. అతిథి దేవో భవ అన్న మాట మరచిపోవద్దు.
అలాగే కార్యవర్గ సమావేశంలో ఇంటెలిజెన్స్ అధికారిని పంపి తీర్మానం కాపీలు దొంగిలించే ప్రయత్నం దేనికి సంకేతం? సంకల్ప సభ జరుగుతున్న సమయంలో ఆ వార్తలు ప్రజలకు కనిపించకుండా ఉండేందుకు కోట్లాది రూపాయల ప్రజా ధనం దుర్వినియోగం చేస్తూ పత్రికలలో అసందర్భంగా ప్రకటనలు ఇచ్చారు. ఈ ప్రయత్నాలు కేసీఆర్ భయాన్ని తెలియజేస్తున్నాయి.కేసీఆర్ తన రాజకీయం కోసం ఎంతైనా దిగజారుతారని తెలిసి ప్రధాని మోడీ కేసీఆర్ వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోలేదు. ప్రధానిని ఇరానీ చాయ్ తాగి, బిర్యానీ తిని వెళ్ళండని కేటీఆర్ విమర్శించడం దారుణం. తెలంగాణ ఏమైనా మీ జాగీరా? కేసీఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మోడీ దేశానికి, అన్ని రాష్ట్రాలకు ప్రధానమంత్రి అని తెలుసా? కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు బీజేపీ అనేక సామ్రాజ్యాలు కూలదోస్తూ వచ్చింది. ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబ సమయం వచ్చింది.
కేసీఆర్ వైఫల్యాలు బీజేపీ ఆయుధాలు
ప్రభుత్వ వైఫల్యాలే బీజేపీకి ఆయుధాలుగా మారుతున్నాయి. రుణమాఫీ, రైతుబంధు సకాలంలో అందకపోవడం, పాఠశాలలో కనీసం చాక్ పీసులు లేకపోవడం, పాఠ్య పుస్తకాల ముద్రణ కాకపోవడం, సంక్షేమ హాస్టల్ వసతులు, బాసర ట్రిపుల్ ఐటీ వసతులు వంటివి బీజేపీకు ఆయుధాలుగా మారుతున్నాయి. ఈ సమస్యలతో ప్రజల విశ్వాసం కోల్పొయింది ప్రభుత్వం. దీనిని పసిగట్టిన బీజేపీ రాష్ట్రస్థాయిలో చేరికలను ప్రోత్సహించాలని కమిటీ వేయడం, దానికి ఈటలను కన్వీనర్ గా నియమించడం చూస్తే టీఆర్ఎస్ను గద్దె దింపడానికి స్పష్టమైన ప్రణాళిక ప్రకారం బీజేపీ బలపడుతుంది రాష్ట్రంలో.అనుభవం ఆలోచన కలిగిన నాయకులను సభ్యులుగా ఎంచుకోవడం బట్టి చూస్తే టీఆర్ఎస్ ను గద్దె దింపడానికి ఒక స్పష్టమైన ప్రణాళిక తో ఆట ప్రారంభించిందని చెప్పవచ్చు. బీజేపీ ధాటికి రానున్న రోజులలో టీఆర్ఎస్ పార్టీ ఐస్ గడ్డలా కరిగి పోవడం ఖాయం.
ఏనుగుల రాకేశ్రెడ్డి
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
90005 22400