- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నివేదన:పండుగ రోజు పదిలం
పిల్లలు, యువతీ,యువకులు, ప్రేమికులు అధికంగా ఇష్టపడే పండుగ హోలీ. ఉత్తర భారతదేశంలో ఎక్కువగా జరుపుకుంటారు. చరిత్రలో ఈ పండుగ గురించి రకరకాల కథనాలు ఉన్నాయి. కానీ, ఎక్కువగా హోలికా దహనంగానే జరుపుకొంటారు. ఖాళీ ప్రదేశంలో ఒక దిష్టి బొమ్మ ఉంచి, ఇంటిలో ఉన్న పాత బట్టలు, కర్ర సామానులు, మండే పదార్థాలతో అగ్నిని జ్వలింపజేస్తారు. దీనిని చెడుపై మంచి సాధించిన విజయంగా గుర్తించి హోలీ మంటల చుట్టూ తిరుగుతూ నృత్యం చేస్తారు. హొలీ దహనం జరిగిన మరుసటి రోజు రంగులను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఆలింగనం చేసుకుంటారు.
ఈ రోజు శత్రువులను మరచి కౌగిలించుకొని పండుగ చేసుకుందాం అనుకుంటారు. ఉత్తరప్రదేశ్‌లోని మధుర పరిసరాలలో మహిళలు గోపికలుగా, పురుషులు కృష్ణులుగా వేషధారణ ధరించి వేడుకలు జరుపుకుంటారు. దక్షిణ భారత దేశంలో ప్రేమ దేవుడు కాముడికి పూజలు నిర్వహిస్తారు. హోలీ ఆడిన అనంతరం ఉత్తరంలోని ముఖ్య నగరాలలో కవి సమ్మేళనాలు జరుగుతాయి. భంగ్ అనే మత్తు పదార్థంతో తయారు చేసిన ప్రత్యేక పానీయాలు సేవించడం సహజం.
భద్రతా చర్యలు తీసుకోవాలి
ఈ మధ్యకాలంలో హోలీ పండుగ రోజు అపశ్రుతులు జరుగుతున్నాయి. ఒకప్పుడు చెట్ల ఆకులతో తయారైన రంగు నీళ్లు చల్లుకునేవారు. నేడు రసాయన రంగులు, చైనా రంగులు చల్లుకుని కంటి చూపు కోల్పోవడం, శరీరాలపై కల్తీ రంగులు చల్లుకోవడం ద్వారా చర్మ వ్యాధులు సంక్రమించి అంగ వైకల్యం పొందుతున్నారు. హోలీ ఆడిన అనంతరం స్నానాల కొరకు పిల్లలు యువతీ యువకులు స్నానం కొరకు, నదులు, కాలువలు, చెరువుల దగ్గరకు వెళ్లి నీటిలో మునిగి చనిపోయిన ఘటనలు ప్రతి సంవత్సరం చూస్తున్నాము.
రెండు సంవత్సరాల నుంచి కరోనాతో వల్ల ప్రజలు ఈ హొలీ వేడుకలు జరుపుకోలేక పోయారు. ఈ సంవత్సరం పిల్లలు యుక్త వయస్సు వారు తగు జాగ్రత్తలు పాటిస్తూ ఈ హోలీ నాడు మృత్యుకేళి నాట్యమాడ రాదని ఆశిద్దాం. ప్రభుత్వ యంత్రాంగం నదులు, చెరువులు, జలాశయాల వద్ద తగిన భద్రత చర్యలు చేపట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూడాలి.
ఎ. వేణుమాధవ్
86860 51752