- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్ర ఉద్యోగులకు... ప్రత్యేక సెలవులు..
ప్రసూతి సెలవు..
ఇద్దరు కంటే తక్కువ పిల్లలున్న (అప్రెంటీస్‌తో సహా) స్త్రీ ప్రభుత్వ ఉద్యోగికి 180 రోజుల పాటు ప్రసూతి సెలవు మంజూరు చేస్తారు. గర్భస్రావం, గర్భ విచ్ఛిత్తి విషయమై జీవించి ఉన్న పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా స్త్రీ ప్రభుత్వ ఉద్యోగులకు 45 రోజులు మించని ప్రసూతి సెలవును మంజూరు చేస్తారు. ప్రసూతి సెలవును ఏదైనా ఇతర రకాల సెలవుతో కలపవచ్చు. సరోగసీ విషయంలో సరోగేట్ ఇద్దరు కంటే తక్కువ పిల్లలున్న కమిషనింగ్ తల్లికి 180 రోజుల పాటు ప్రసూతి సెలవు మంజూరు చేస్తారు. (Rule 40).
పితృత్వ సెలవు..
ఇద్దరు కంటే తక్కువ పిల్లలున్న (అప్రెంటీస్‌తో సహా) పురుష ప్రభుత్వ ఉద్యోగికి తన భార్య ప్రసవ సమయంలో 15 రోజుల పాటు పితృత్వ సెలవు మంజూరు చేస్తారు. అంటే పిల్లల ప్రసవ తేదీకి 15 రోజుల ముందు లేదా 6 నెలల వరకు.. పితృత్వ సెలవును ఏదైనా ఇతర రకాల సెలవుతో కలిపి వాడుకోవచ్చు. సరోగసీ కేసులో కూడా పురుష ప్రభుత్వ ఉద్యోగులు పితృత్వ సెలవుకు అర్హులు(రూల్ 43 ఎ) పిల్లల దత్తత విషయంలో కూడా పితృత్వ సెలవు ఇవ్వవచ్చు (రూల్ 43 ఎఎ).
బాల దత్తత సెలవు..
ఇద్దరు కంటే తక్కువ పిల్లలు ఉన్న స్త్రీ ప్రభుత్వ ఉద్యోగి దత్తత తీసుకోవడానికి ఒక బిడ్డను అంగీకరించినప్పుడు 180 రోజుల సెలవు మంజూరు చేస్తారు. ఇట్టి సెలవు ఏదైనా ఇతర రకాల సెలవుతో కలిపి వినియోగించుకోవచ్చును. (రూల్ 43 బి)
చైల్డ్ కేర్ లీవ్
స్త్రీ ప్రభుత్వ ఉద్యోగి, సింగిల్ పురుష ప్రభుత్వ ఉద్యోగులు పెంపకం లేదా విద్య, అనారోగ్యం వంటి వారి అవసరాలను చూసుకోవడానికి ఇద్దరు జీవించి ఉన్న పిల్లలను చూసుకోవడానికి మొత్తం సర్వీసులో 730 రోజులు మం జూరు చేస్తారు. ఇది ఒక క్యాలెండర్ సంవత్సరంలో మూడు విడతలకు మించి మంజూరు చేయబడదు. కానీ సింగిల్ స్త్రీ ప్రభుత్వ ఉద్యోగి విషయంలో ఇది ఒక క్యాలెండర్ సంవత్సరంలో 6 విడతలకు పొడిగించబడుతుంది. చైల్డ్ కేర్ సెలవును ఒక విడతలో 5 రోజుల కంటే తక్కువ కాలానికి మంజూరు చేయకూడదు. ఇది ఏదైనా ఇతర రకాల సెలవుతో కలిపి వాడుకోవచ్చును. ( రూల్ 43 సి).
పని సంబంధ వ్యాధి, గాయం సెలవు..
ఈ సెలవు తన అధికారిక విధుల నిర్వహణలో ఆరోగ్యం క్షీణించిన లేదా గాయపడిన ప్రభుత్వ ఉద్యోగికి మంజూరు చేస్తారు. 6 నెలల పూర్తి జీతభత్యాలు, 12 నెలల సగం జీత భత్యాలు చెల్లించబడతాయి. ఈ 12 నెలలు సగం జీతం సెలవు ఖాతా నుండి డెబిట్ చేయబడతాయి. ఈ సెలవు కాలంలో నగదు జీతపు సెలవు, సగం జీతపు సెలవు క్రెడిట్ చేయబడదు (Rule 44).
సిమెన్స్ సిక్ లీవ్
ప్రభుత్వ నౌకలో వారెంట్ ఆఫీసర్ లేదా పెటీ ఆఫీసర్ తన నౌకలో లేదా ఆసుపత్రిలో అనా రోగ్యం లేదా గాయం కారణంగా వైద్య చికిత్స పొందుతున్నప్పుడు ఈ రకమైన సెలవు మం జూరు చేస్తారు. మొదటి ఆరు వారాలకు పూర్తి జీత భత్యాలు చెల్లించబడతాయి. వ్యక్తి డిసెబులిటీతో ఉంటే, 3 నెలల వరకు పూర్తి జీతం, భత్యాలు చెల్లించబడతాయి. ( Rule 47).
లైంగిక వేధింపులకు ప్రత్యేక సెలవు..
ఈ ప్రత్యేక సెలవు పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల కింద విచారణ సమ యంలో అంతర్గత కమిటీ లేదా స్థానిక కమిటీ సిఫార్సు చేసినప్పుడు 90 రోజుల పాటు స్త్రీ ప్రభుత్వ ఉద్యోగికి మంజూరు చేస్తారు (రూల్ 48).
అధ్యయన సెలవు :
కొన్ని నిబంధనలకు లోబడి గరిష్టంగా 3 సంవత్సరాల వరకు ప్రభుత్వ ఉద్యోగులకు అధ్యయన సెలవు మంజూరు చేస్తారు (రూల్ 51).
సి.మనోహర్ రావు,
రిటైర్డ్ ప్రభుత్వ అధికారి.
85198 62204