- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రాచీన తెలంగాణ నకాశీ చిత్రకళ గురించి తెలుసా?
తరతరాలుగా ఈ చిత్రకళను వారసత్వంగా అందిపుచ్చుకుంటున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఈ చిత్రపటాలు గీసిన తర్వాత వందల యేళ్ల పాటు భద్రంగా ఉంటాయి. ఈ చిత్రకళ తెలిసిన ఒకరిద్దరు కళాకారులు నగరం నుంచి 1942లో చేర్యాలకు వలస వచ్చి స్థానికులకు నేర్పించారు. అప్పటి నుంచి ఇక్కడ నకాశీ చిత్రాలు వేయడం ఆనవాయితీగా మారింది. అవే 'చేర్యాల పెయింటింగ్స్' గా పేరు పొందాయి. ఇక్కడి కళాకారులు రామాయణం, మహాభారతాలను వస్త్రాల మీద చిత్రీకరించి, ఫొటో ఫ్రేములు తయారు చేసి దేశవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇస్తున్నారు. అయినప్పటికీ 500 యేళ్ల చరిత్ర ఉన్న ఈ కళకు రావాల్సినంత గుర్తింపు, ప్రచారం రాలేదు. ఇప్పుడిప్పుడే కొంచెం మెరుగుపడుతోంది.
తెలంగాణలో బాగా ప్రాచుర్యం పొందిన జానపద చిత్రకళ 'నకాశీ'. పురాణాలు, జానపద కథలు, కుల చరిత్ర ఘట్టాలను ఒక బట్టపై రంగులతో చిత్రించి, దాని ఆధారంగా కథలను ప్రేక్షకులకు చెబుతారు. అలా రంగులతో చిత్రాలను రచించే కళనే 'నకాశీ చిత్రకళ' అంటారు. ఆ చిత్రాలను గీసేవారిని నకాశీలు అంటారు. ఈ పదం ఉర్దూ నుండి వచ్చింది నక్ష్ అంటే అచ్చు గుద్దినట్లు చిత్రించటం అని అర్థం. దీనిని 'నగిశీ' అని కూడా అంటారు. ఈ కళను నవాబులు వారి రాజ దర్బారులలో, మహల్‌లలో వేయించేవారు.
గతమెంతో ఘనం
తరతరాలుగా ఈ చిత్రకళను వారసత్వంగా అందిపుచ్చుకుంటున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఈ చిత్రపటాలు గీసిన తర్వాత వందల యేళ్ల పాటు భద్రంగా ఉంటాయి. ఈ చిత్రకళ తెలిసిన ఒకరిద్దరు కళాకారులు నగరం నుంచి 1942లో చేర్యాలకు వలస వచ్చి స్థానికులకు నేర్పించారు. అప్పటి నుంచి ఇక్కడ నకాశీ చిత్రాలు వేయడం ఆనవాయితీగా మారింది. అవే 'చేర్యాల పెయింటింగ్స్' గా పేరు పొందాయి. ఇక్కడి కళాకారులు రామాయణం, మహాభారతాలను వస్త్రాల మీద చిత్రీకరించి, ఫొటో ఫ్రేములు తయారు చేసి దేశవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇస్తున్నారు. అయినప్పటికీ 500 యేళ్ల చరిత్ర ఉన్న ఈ కళకు రావాల్సినంత గుర్తింపు, ప్రచారం రాలేదు. ఇప్పుడిప్పుడే కొంచెం మెరుగుపడుతోంది.
ఈ కళలో సహజసిద్ధ రంగులకు పెద్దపీట వేస్తారు. ఖాదీ కాన్వాస్‌ను పెయింటింగ్ కోసం వాడతారు. రంగురాళ్లను కొనుగోలు చేసి, వాటిని, తిరుమని చెట్ల నుంచి తీసిన బంకను పొడిగా చేసుకుని నీళ్లు కలిపి సిద్ధం చేసుకుంటారు. పెయింటింగ్ వేసి, ఈ రెండిటినీ కలిపి రంగులద్దుతారు. ఈ నకాశీ చిత్రాలను గీయడానికి కొన్ని నెలలు కూడా పడుతుంది. ఇక మాస్క్‌లు, విగ్రహాల తయారీ పెద్ద తతంగం. నగరాలలో పెరుగుతున్న ఇప్పటి తరానికి గ్రామీణ వాతావరణం గురించి తెలుసుకోవాలనే తపన, తమ మూలాల గురించి తెలుసుకునే అన్వేషణ మొదలైంది. అందుకే కులవృత్తులు, వ్యవసాయం, గ్రామీణ వాతావరణం, గంగిరెద్దులు, హరిదాసులు, బతుకమ్మ, బోనాలు వంటి చిత్రపటాలకు మంచి డిమాండ్ ఉంది. హోటల్స్‌లో ఇంటీరియర్ డిజైనింగ్ కోసం ఈ పెయింటింగ్స్ వాడుతున్నారు. ఆధునికత మోజులో పడి పురాతన కళారూపాలను మర్చిపోతున్న తరుణంలో ఏదోవిధంగా దానికి జీవం పోస్తున్నారు నకాశీ కళాకారులు.
Also read: ప్రముఖ చిత్రకారుడు అనబత్తుల వెంకన్న గురించి తెలుసా?
కుల చరిత్రల స్థానంలో
తెలంగాణలోని సబ్బండ వర్ణాల వారు గతంలో కులాల చరిత్రను తరువాత తరానికి తెలియజేసేందుకు నకాశీ చిత్రాలు చూపుతూ కథలుగా చెప్పేవారు. ఆ కథకుల కోసం నకాశీ చిత్రకారులు వారు అడిగిన విధంగా బొమ్మలు తయారు చేసేవారు. వారు ఆ బొమ్మల ద్వారా ఊరూరు తిరుగుతూ కులాల చరిత్రలను వివరించేవారు. వీరులు, రాజుల పరాక్రమాలను బొమ్మలతో చూపించేవారు. టీవీలు లేని కాలంలో కళ్లకు కట్టినట్టు చరిత్రను చెప్పేవారు. దీని కోసం 20 నుంచి 50 మీటర్ల ఖాదీ బట్టను కాన్వాసుగా మార్చేవారు. దీనికి కొన్ని నెలల సమయం పట్టేది. ఎక్కువగా కాటమరాజు, పెద్దిరాజు లాంటి కథలు చెప్పేది. ఇప్పటికీ గొల్ల కురుమల చరిత్ర చెప్పే మందిచ్చ కులానికి చెందినవారు నకాశీ కళాకారుల వద్ద బొమ్మలు చేయించుకుంటున్నారు.
ఒక్క కథకు 52 బొమ్మలు అవసరమవుతాయి. దాదాపు పది కులాల పురాణాలను కథలుగా చెప్పడానికి నకాశీ చిత్రకళను వాడేవారు. ఇప్పుడు వాటి స్థానంలో రామాయణ, మహాభారతాలు కనిపిస్తున్నాయి. చేర్యాల కళాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నకాశీ చిత్రకళను కాపాడుతూ 'చేర్యాల పెయింటింగ్స్' గా పేరు తెచ్చుకోవడం గర్వకారణం. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షల పుస్తకాలతో పాటు అకడమిక్ పుస్తకాలలో ఈ పెయింటింగ్స్ గురించి లేని అంశమే లేదంటే ఈ చిత్రకళకు ఎంత ప్రాధాన్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ కళాకారులు భవిష్యత్తులో ఎన్నో జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు అందుకోవాలని ఆశిద్దాం.
ఆలేటి రమేశ్
99487 98982