- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజా ప్రభుత్వం సుఖీభవ!
తెలంగాణకు ఆరు లక్షల కోట్ల అప్పులు, వాటికి నెలనెలా మిత్తీలు, రాష్ట్ర ఖజానాలో రూపాయి లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ.. రేవంత్ రెడ్డి నేతృత్వంలో పాలనా పగ్గాలు చేపట్టింది. అప్పటి నుంచి ప్రభుత్వం పడుతున్న అష్ట కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు కనిపించకుండా.. పాత అప్పులను ఎలాగోలా తీర్చుతూ ముందుకు సాగుతూ ఏడాది పూర్తవుతుంది. ఒక్క ఏడాదిలో ఏం మారిందని అడిగేవాళ్లూ ఉన్నారు. ఏం మారిందో చేతల్లో చెప్పడం కష్టం.. కానీ, లెక్కల్లో చెప్పడం మాత్రం తేలికే! రేవంత్ సర్కారు కొన్ని కీలకమైన పనులు చేసింది. పదేండ్ల కష్టాల పాలన నుంచి ప్రజలు సంతోషంగా ఉన్నామనే ఫీలింగ్‌ను మాత్రం కల్పించింది. వచ్చే నాలుగేండ్ల కాలానికి భారీ లక్ష్యాలను ముందు పెట్టుకున్నది. అందుకే.. ప్రజా ప్రభుత్వం సుఖీభవ!
ఏడాది కిందట వరకు సీఎంగా ఉన్న పెద్దా యన అసలు కనిపించే వాడు కాదు. ఇక అప్పుడో.. ఇప్పుడో కనిపించే మంత్రులు, ఎమ్మెల్యేలు జనం సమస్యలు పట్టించుకోరు. భూ దందాలు, ప్రాజెక్టుల్లో కమీషన్లు ఇవే ప్రాధాన్యంగా.. ముఖ్యమన్నట్టుగా పనిచేశారు. కానీ, ఇప్పుడు.. సచివాలయంలో అధికారులు అందుబాటులో ఉంటారు. సామాన్య ప్రజలను కూడా సీఎం, మంత్రులు, అధికారులు కలుస్తారు. ప్రతీ వారం ప్రజావాణి ఉంటుంది. మంత్రులు కూడా గాంధీభవన్‌లో వారానికి ఒక్కరోజు సమస్యలను వినతిపత్రాల రూపం లో స్వీకరిస్తారు. ఉద్యోగాల భర్తీలో ఊహిం చని మార్పులు చేసి ఒక్క ఏడాదిలోనే అర లక్ష ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగుల నుంచి శభాష్ అనిపించుకుంది ఈ ప్రజా ప్రభుత్వం. అంతేకాదు.. రైతు లకు రుణమాఫీ, సన్నాలకు బోనస్, ధాన్యం కొనుగోళ్లు, నిరంతర విద్యుత్‌లో ఎక్కడా అ వాంతరాలు లేకుండా పాలన జరుగుతున్నది. కొత్తగా స్కిల్ యూనివర్సిటీ నెలకొల్పడం మరో మెట్టు. ఇలా చెప్పుకుంటూపోతే.. ఒక్కటేమిటి, రేవంత్ సర్కారు సాధించిన విజయాలు వరుసలెక్కన చాలా ఉన్నాయి.
నిజంగానే ప్రజా ముఖ్యమంత్రి!
ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ కవరేజీని రూ.10 లక్షలకు పెంపు వంటి హామీలు ప్రజల మనసును చూర గొన్నాయి. అదే విధంగా విద్యార్థులు, నిరుద్యోగులు కూడా రేవంత్ పాలనపై సంతృప్తిగానే ఉన్నారు. ఎక్కువగా ప్రజలకు అందుబాటులో ఉంటున్న ముఖ్యమంత్రి అని రేవంత్‌ను ఉద్దేశించి ప్రజలు పేర్కొనడం గమనార్హం. నిరాడంబరత్వం.. ప్రజలకు అందుబాటులో ఉండడం.. ఏ విషయంపైనైనా తక్షణమే స్పం దించడం.. బలమైన గళం వంటివి రేవంత్ ప్రభుత్వానికి మంచి మార్కులు పడేలా చేశా యి. ఇక, రైతు రుణమాఫీ కూడా.. గ్రామీణ స్థాయిలో కాంగ్రెస్ సర్కారుకు మార్కులు వేసి నట్టు తెలుస్తోంది. ఆడంబరాలకు, వివాదాలకు దూరంగా.. ఉండడాన్ని మెజారిటీ ప్రజలు ఆహ్వానిస్తున్నట్టు సర్వే పేర్కొంది. ఒకటీ, రెండు కారణాలు మినహా.. ఆరు గ్యారెం టీలను అమలు చేస్తుండడమే సర్కారుకు మంచి మార్కులు వేసేలా చేసిందని వెల్లడవుతున్నది. ముఖ్యంగా మహిళలు, రైతుల పక్షపాత ప్రభుత్వంగా ఉందని, అందుకే ప్రజలు పాలనపై సంతృప్తితో ఉన్నారు.
యువత జీవితాల్లో కీలక మలుపు
వ్యవసాయం పండుగ అని భావించే ప్రజా ప్రభుత్వం.. రైతు రుణమాఫీ చేసి నిరూపించింది. ఇంకా చేస్తూనే ఉన్నది. దీనికి తోడుగా బోనస్, రాయితీలు కూడా రైతులకు అందుతున్నాయి. మద్దతు ధరతో ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నాం. ఇదంతా ఒకవైపు ఉంటే.. తొలి ఏడాదే రాష్ట్ర యువత జీవితాల్లో కీలక మలుపు కు శ్రీకారం చుట్టింది. ప్రజా పాలనలో తెలం గాణ యువత భవిత మలుపు తిరిగిందా..? అంటే అవుననే సమాధానమే వస్తుంది. తొలి ఏడాదిలోనే ప్రజా ప్రభుత్వం యువతకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగ నియామకాల మేళా నిర్వహించామని సగౌరవంగానే చెప్పుకుంటుంది. ఉద్యోగాల భర్తీలో కొత్త రికార్డు నమోదు చేసింది తెలంగాణ సర్కార్. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మొదటి ఏడాదిలోనే 53 వేలకు పైగా ఉద్యోగ నియామకాలు చేపట్టింది. గడిచిన పదేండ్లలో ఉద్యోగాల భర్తీ లేక విసిగివేసారిన నిరుద్యోగుల జీవితాల్లో సరికొత్త మార్పు తెచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూపీఎస్సీ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేపట్టారు. అప్పటివరకు పెండింగ్‌లో ఉన్న పరీక్షలు, ఫలితాలకు ఉన్న అడ్డంకులన్నింటినీ ప్రభుత్వం తొలిగించింది. పదేండ్లుగా ఉద్యోగాల భర్తీ లేనందున యువత నష్టపోకుండా టీజీపీఎస్సీ నియామకాలకు వయోపరిమితిని సడలించింది. గత ప్రభు త్వంలో రద్దయినవి.. వాయిదా పడ్డవి.. పెండిం గ్‌లో పెట్టిన ఫలితాలన్నింటినీ విడుదల చేసిం ది. ఎంపికైన అభ్యర్థులందరికీ నియామక పత్రాలను అందించింది.
ఊరిస్తున్న జాబ్ క్యాలెండర్
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో వార్షిక జాబ్ క్యాలెండర్‌ను సైతం ప్రకటించింది. క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను నిరంతర ప్రక్రియగా నిర్వ హించే వినూత్న విధానాన్ని అమల్లోకి తెచ్చింది. బీఆర్ఎస్ హయాంలో పదేండ్లలో ఒకేసారి డీఎస్సీ వేసి 7,857 టీచర్ పోస్టులు భర్తీ చేస్తే.. కొత్త ప్రభుత్వం కేవలం పది నెలల వ్యవధిలోనే 11,062 పోస్టులతో మెగా డీఎస్సీ 2024 నిర్వహించింది. జూలైలో పరీక్షలు నిర్వహించి, రికార్డు వేగంతో సెప్టెంబర్ 30వ తేదీన ఫలితాలను వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థులకు దసరా పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారు. వీరిలో 10,006 మంది ఉద్యోగాల్లో చేరారు. రెసిడెన్షియల్ సొసైటీల పరిధిలో టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులన్నీ కలిపి కొత్త ప్రభుత్వం 8,304 మందికి నియామక పత్రాలను అందించింది. పేపర్ లీకేజీతో గందరగోళంగా మారిన గ్రూప్ -1 పరీక్షను కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేసింది. 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. గ్రూప్- 1 ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. షెడ్యూలు ప్రకారమే నవంబర్‌లో గ్రూప్- 3 పరీక్షలు నిర్వహించింది. త్వరలోనే గ్రూప్-2 పరీక్షలను నిర్వహించబోతోంది.
ముందున్నవి భారీ లక్ష్యాలు..
రేవంత్ సర్కార్ ఇటు పాలనాపరమైన సంస్కరణలు చేస్తూనే.. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపైనా ఉక్కుపాదం మోపుతున్నది. గత ప్రభుత్వ అక్రమాలను ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. కానీ, ప్రజా ప్రభుత్వం చేపట్టే పనులను ఘనంగా చెప్పుకోవడం మంచిది. ఏడాదిలోనే ఇంత చేసిన ప్రభుత్వం వచ్చే నాలుగేండ్ల కాలా నికి భారీ లక్ష్యాలను ముందు పెట్టుకున్నది. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం నుంచి మొదలుకుని.. అనుకున్నట్లు ఏటా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయా లనే సంకల్పం మాది. అందుకే.. ప్రజా ప్రభుత్వం సుఖీభవ..
మెట్టు సాయి కుమార్,
తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్