- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ యాజమాన్యం రెండో భార్యను నామినీగా గుర్తించాలి!
భార్య చనిపోయిందని మండల రెవెన్యూ అధికారి ధ్రువీకరణ పత్రం ఇస్తున్నారు. రెండో పెళ్లికి హిందూ వివాహ చట్టం అనుమతి ఉంది. మ్యారేజ్ రిజిస్ట్రార్ కూడా ధృవీకరిస్తారు. సమాజం కూడా గౌరవిస్తున్నది. ప్రభుత్వం వారికి ఆధార్ కార్డు, పెన్షన్ సౌకర్యం కల్పిస్తుంది. కానీ, సింగరేణి యాజమాన్యం మాత్రం దీనికి నిరాకరించడం సిగ్గుచేటు. బొగ్గు గని కార్మికులు తన సర్వీస్‌లో తల్లి కడుపు లాంటి బొగ్గు బాయిలలో బొగ్గు వెలికితీసి లోకానికి వెలుగునిస్తున్నాడు. దురదృష్టవశాత్తు ఉద్యోగ విరమణ అనంతరం చనిపోయిన భార్య స్థానంలో రెండో భార్యగా నమోదు చేయడానికి యాజమాన్యం నిరాకరించడం చట్ట వ్యతిరేకం.
ప్రభుత్వాలు లోపభూయిష్ట విధానాలతో బొగ్గు గని కార్మికలను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు ఐదు లక్షల మంది రిటైర్డ్ కార్మికులు ఉంటారు. అందులో సింగరేణి వారు 40 వేలు ఉంటారు. వారికి సామాజిక భద్రత కింద విశ్రాంత జీవనంలో ఆర్థిక భరోసా కోసం 'కాంట్రిబ్యూటరీ కోల్ మైన్స్ పెన్షన్ స్కీం'ని రూపొందించారు. దీని కోసం కార్మికుని సర్వీస్ కాలంలో ప్రతి నెల వేతనం నుంచి ఏడు శాతం, యాజమాన్యం ఏడు శాతం, టన్ను బొగ్గుకు ఇరవై రూపాయలు పెన్షన్ నిధిలో జమ చేస్తున్నారు.
కార్మికుడు ఉద్యోగ విరమణ చేసే సమయాన పీఎస్-3, పీఎస్-4 పెన్షన్ ఫారంలో తన నామినీగా భార్య పేరును ధ్రువీకరిస్తాడు. ఒకవేళ విశ్రాంత కార్మికుడు చనిపోతే నామినీగా ఉన్న భార్యకు వితంతు పెన్షన్ 60 శాతం చెల్లిస్తారు. దురదృష్టవశాత్తు పెన్షన్‌దారుడి భార్య చనిపోతే, ఇంకొకరిని పెండ్లి చేసుకున్నపుడు రెండో భార్యను నామినీగా నమోదు చేయడానికి సింగరేణి యాజమాన్యం నిరాకరిస్తున్నది. రెండో భార్యను కూడా పరిగణనలోకి తీసుకోవాలని 2005 కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ రీజనల్ కమిషనర్ సూచించినా యాజమాన్యం పట్టించుకోవడం లేదు.
Also read: తెలంగాణ సాయుధ పోరులో సింగరేణి పాత్ర ఎంతంటే?
ప్రభుత్వం ఇస్తుందిగా
భార్య చనిపోయిందని మండల రెవెన్యూ అధికారి ధ్రువీకరణ పత్రం ఇస్తున్నారు. రెండో పెళ్లికి హిందూ వివాహ చట్టం అనుమతి ఉంది. మ్యారేజ్ రిజిస్ట్రార్ కూడా ధృవీకరిస్తారు. సమాజం కూడా గౌరవిస్తున్నది. ప్రభుత్వం వారికి ఆధార్ కార్డు, పెన్షన్ సౌకర్యం కల్పిస్తుంది. కానీ, సింగరేణి యాజమాన్యం మాత్రం దీనికి నిరాకరించడం సిగ్గుచేటు. బొగ్గు గని కార్మికులు తన సర్వీస్‌లో తల్లి కడుపు లాంటి బొగ్గు బాయిలలో బొగ్గు వెలికితీసి లోకానికి వెలుగునిస్తున్నాడు. దురదృష్టవశాత్తు ఉద్యోగ విరమణ అనంతరం చనిపోయిన భార్య స్థానంలో రెండో భార్యగా నమోదు చేయడానికి యాజమాన్యం నిరాకరించడం చట్ట వ్యతిరేకం.
కార్మికులు రిటైర్మెంట్ అనంతరం చికిత్స చేసుకోవడానికి కాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్డ్మెంట్ మెడికేర్ స్కీం రూపొందించారు. కార్మికుడి చేత ప్రీమియం కట్టించుకున్నారు. యాజమాన్యం రిఫర్ చేసిన ఆసుపత్రులలో భార్యకు ఎనిమిది లక్షల రూపాయల వరకు చికిత్స చేయవచ్చు. అందులోనూ చనిపోయిన భార్య స్థానంలో రెండో భార్యకు అవకాశం ఇవ్వడానికి యాజమాన్యం నిరాకరిస్తున్నది. దీంతో ఎంతో మంది కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు, అధికారులు జోక్యం చేసుకొని చనిపోయిన భార్య స్థానంలో నామినిగా రెండో భార్యను నమోదు చేయించేలా చూడాలి.
మేరుగు రాజయ్య
కేంద్ర కార్యదర్శి
సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్, ఏఐటీయూసీ
94414 40791