- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కన్నీటిని మిగిలిస్తున్న రోడ్డు ప్రమాదాలు..

వరుస ప్రమాదాలతో రాష్ట్రంలో రోడ్లు నెత్తురోడుతున్నాయి. ప్రతిరోజు ఎక్కడో ఒకచోట ఎందరో ప్రాణాలు కోల్పోవడం, క్షతగాత్రులు కావడం నిత్యం చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాలు తగ్గడం లేదు. అతివేగం, డ్రైవింగ్ నిర్లక్ష్యం వల్ల బ్రతుకులు గాలిలో కలిసిపోతున్నాయి.
నిర్లక్ష్యపు డ్రైవింగే ప్రమాద హేతువు
రోడ్డు మీదకు వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి వచ్చేదాకా నమ్మకం లేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం, పోలీసులు, రవాణా శాఖ అధికారులు ఎన్ని హెచ్చరికలు, ప్రకటనలు జారీ చేసిన, పత్రికల్లో, శీర్షికలలో, వార్తలు రాసిన పోలీసులు ఎన్నిసార్లు కౌన్సెలింగ్ చేసినా, ఎన్ని జరిమానాలు విధించినా అవి ఏవీ వినిపించుకోకుండా రోడ్డుపై నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్నారు. ఇక రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఎవరైనా ప్రమాదానికి గురైతే మానవత్వం చూపకుండా తమకు అవసరం లేదని వెళ్లిపోయే వారు కొందరైతే... ప్రమాదం జరిగిన వాహనం చుట్టూ చేరి ఏదో వింతగా చూసినట్లు చూడడం గాయపడిన వారిని చూసి అయ్యో పాపం అనేవారు తప్ప వారికి సహాయం చేద్దాం అనుకునే వాళ్లు రోజురోజుకు తక్కువై పోతున్నారు. దీని ఫలితంగా రోడ్డు ప్రమాదాల్లో గాయాలపాలైన వారు ఆస్పత్రికి చేరే లోపు ప్రాణాలు వదిలేస్తున్నారు.
సహాయం అందిద్దాం!
ఒక కుటుంబంలో ఎవరైనా ఇలాంటి ప్రమాదాల బారినపడి మరణిస్తే ఆ కుటుంబం దిక్కు కోల్పో యి, ఆ కుటుంబం అంతా రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కాబట్టి మానసిక ప్రశాంతతో డ్రైవింగ్ చేయాలి. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపరాదు. టూ వీలర్ నడిపే వారు తప్పకుండా హెల్మెట్ ధరించాలి. మద్యం సేవించి వాహనం నడపకూడదు. నో పార్కింగ్ ప్రదేశాల్లో ఎట్టి పరిస్థితుల్లో పార్కింగ్ చేయకండి. వాహనాల ముందు ఎక్కువ శబ్దంతో పాటలు వింటూ డ్రైవింగ్ చేయకూడదు. ఆటో రిక్షాలో ఎక్కువ మంది పిల్లలను ఎక్కించి పాఠశాలలకు పంపకూడదు. మూల మలుపులు తిరిగేటప్పుడు సిగ్నల్ తప్పకుండా ఇవ్వాలి. రోడ్డు భద్రతా నియ మాలు పట్ల కఠినంగా ఉండాల్సిందే. కాబట్టి సాటి మనిషిగా మానవత్వంతో, సహృదయంతో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి సహాయం చేయడంలో మన వంతు సాయాన్ని అందిద్దాం.
- లకావత్ చిరంజీవి
99630 40960