గణతంత్రమే నిజమైన స్వాతంత్య్రం!

by Ravi |   ( Updated:2025-01-26 01:00:34.0  )
గణతంత్రమే నిజమైన స్వాతంత్య్రం!
X

భారతదేశ చరిత్ర గురించి చెప్పుకోవాల్సి వస్తే భారత రాజ్యాంగానికి ముందు భారత రాజ్యాంగం తర్వాత అని చెప్పుకోక తప్పని చారిత్రక సత్యం. ఎందుకంటే భారత రాజ్యాంగం అమలుకు ముందు భారత దేశంలో నివసిస్తున్న ప్రజలందరి మధ్య స్వేచ్ఛ, సమానత్వ, సోదరభావ, ప్రజాస్వామ్య, గణతంత్ర భావాలు లేవు. ఇందుకు ప్రధాన కారణం కులం. ఈ కారణంగా భారతీయ సామాజిక వ్యవస్థ మొత్తం నిట్టనిలువుగా చీలిపోయి ఉన్నది. అగ్రవర్ణాలు, బహుజనుల మధ్య సామాజిక రాజకీయ ఆర్థిక సాంస్కృతిక తారతమ్య భేదాలు ఉన్నాయి.

రాజ్యాంగానికి ముందు ఉన్న మనువు రాసిన మనుస్మృతి గ్రంథం ప్రకారమే భారత పరిపాలన వ్యవస్థ నడిచేది కాబట్టి 10% ఉన్న అగ్రవర్ణాలు మాత్రమే విద్యను అభ్యసిస్తూ రాజ్యాన్ని పాలిస్తూ దేశ సంపదను అనుభవిస్తూ 90% బీసీ, ఎస్సీ, ఎస్టీలను సామాజికంగా రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా అణచివేస్తున్న పరిస్థితులు.. ఈ సామాజిక రుగ్మతలను రూపు మాపడానికి, తరతరాలుగా మనుషులుగా కూడా గుర్తింపు లేని బీసీ, ఎస్సీ, ఎస్టీలకు మనిషిగా గుర్తింపు ఇచ్చి సామాజిక గౌరవం, మానవ హక్కులు ఇవ్వడానికి వచ్చిన ఒకే ఒక్కడు మహనీయులు డా. అంబే ద్కర్. ఆయన రాసిన భారత రాజ్యాంగం మూలంగానే దేశంలో నివసిస్తున్న మెజార్టీ ప్రజలకీ నిజమైన స్వాతంత్ర ఫలాలు అందాయి.

నేటికీ అభివృద్ధి చెందిన దేశంగా చెప్పుకోలేం!

నేడు ఆధునిక సమాజంలో కూడా దేశ పౌరులకు స్వాతంత్ర దినోత్సవానికి, గణతంత్ర దినోత్సవానికి తేడా తెలియకపోవడానికి ప్రధాన కారణం స్వాతంత్రనంతరం దేశాన్ని పాలిస్తు న్న అగ్రవర్ణ పాలకుల అసమర్థత. గాంధీ నాయకత్వంలో దేశ భూ భాగానికి స్వాతంత్య్రం వస్తే, అంబేడ్కర్ నాయకత్వంలో రాజ్యాంగం అమలు చేసిన తేదీ నుండి దేశ భూగోళంలో నివసిస్తున్న కుల, మతాలకు అతీతం గా ప్రజలందరికీ నిజమైన స్వాతంత్య్రం లభించింది. అప్పుడే దేశంలో నిజ మైన సామాజిక, రాజకీయ, ఆర్థిక సాంస్కృతిక పరివర్తనకి పునాది పడడం జరిగింది. ప్రపంచంలో ఏ దేశానికి లేని గొప్పనైన రాజ్యాంగం భారతదేశంలో ఉన్నప్పటికీ కూడా అంబేడ్కర్ ఆశించిన స్థాయిలో నేడు దేశంలో ప్రజల అభివృద్ధి లేదు. నేటికీ దేశంలో కోట్ల మంది జనాభాకి ప్రభు త్వాల ద్వారా నాణ్యమైన విద్య, వైద్యం అందడం లేదు. ఇళ్లు, వ్యవసాయ భూమి లేదు. 75 ఏళ్ల స్వాతంత్ర, గణతంత్ర దేశంలో దేశ పౌరులకీ ఇవన్నీ ఇవ్వలేకపోతున్నామంటే, అందుకు కారణం స్వాతంత్రానంతరం దేశాన్ని పాలిస్తున్న అన్ని రాజకీయ పార్టీలు, ఆయా పార్టీల నాయకుల అసమర్థత. ప్రపంచ దేశాల్లో ఏ దేశానికి లేని మానవ వనరులు, సహజ సంపద భారత దేశంలో ఉన్నప్పటికీ దేశ పౌరులకి మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతున్నాం. అందుమూలంగా భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు గర్వంగా చెప్పుకోలేకపోతున్నాం.

ఎంత గొప్ప ఉద్యోగం చేసినప్పటికీ..

అంబేడ్కర్ ‘రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలుపరిచే పాల కులు తాత్వికులు కాకుంటే రాజ్యాంగ లోపంగా ప్రజలు చూస్తారు. కానీ రాజ్యాంగం ఉన్నతంగా లేనప్పటికీ పాలకులు తాత్వికులైతే దేశ పౌరుల జీవన విధానం గొప్పగా ఉంటదని’ అన్నారు. నేను రాసిన భారత రాజ్యాం గం దేశంలో ఎలాంటి రక్తపాతం లేకుండా శాంతియుత మార్గంలో సామాజిక, రాజకీయ, ఆర్థిక సాంస్కృతిక విప్లవాన్ని తీసుకొస్తుందని అన్నారు. బహుశా ఆయన చెప్పిన విధంగా దేశంలో ఈ విప్లవాలు రాకుండా ఉండటానికి దేశ పాలకులు దేశ పౌరులకి రాజ్యాంగ అక్షరాస్యతని నేర్పించడంలో విఫలమయ్యారు. దేశ పౌరులకి తమ ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు నేటికీ కూడా సక్ర మంగా తెలవదు. దీంతో భారతదేశం వెనుకబాటుకు గురవుతూ అభివృద్ధి చెందిన దేశంగా నిలదొక్కుకోలేకపోతున్నది. దేశ పౌరులకి రాజ్యాంగం పట్ల అవగాహన లేకుంటే దేశ పౌరులు ఎంత ఉన్నతంగా చదువుకొని గొప్ప ఉద్యోగం చేసినప్పటికీ ఒక పౌరుడిగా రాజ్యాంగం చెప్తున్న విధం గా ఎలా ప్రవర్తించలో తెలియక దేశం లో రోజురోజుకీ అవినీతి, నైతిక విలువలు, మానవ విలువలు నశిస్తున్నా మిన్నకుండిపోతున్నాడు.

ప్రజల్లో జీరోలుగా ఉండొద్దని..

దేశంలో ప్రస్తుతం ఓ నాయకుడు దేశానికి నిజమైన స్వాతంత్య్రం లభిం చింది అయోధ్యలో రామ మందిరం ఏర్పాటు తర్వాతే అంటాడు. ఇంకో నాయకుడు 1947 ఆగస్టు 15నే దేశానికి నిజమైన స్వాతంత్య్రం అని చెప్తున్నాడు. వారి దృష్టిలో అవి నిజమే అయి ఉండొచ్చు కానీ, చారిత్రక సత్యం ఏంటంటే భారత రాజ్యాంగం అమలు తర్వాతే దేశంలో 100 కోట్లకు పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అగ్రవర్ణ నిరుపేదలకి, సామాన్యులకి స్వాతంత్య్రం లభించింది. నేటికీ దేశాన్ని పాలిస్తున్న పాలకులు రాజ్యాంగ గొప్పతనం చెప్పకుండా ఉచితాల మాటున ప్రజలను ఉంచుతున్నారు. రాజ్యాంగం గొప్పదనం ప్రజలకు చెబితే అప్పుడు అంబేడ్కర్, భారత రాజ్యాంగమే హీరో అవుతారని, పాలకులు జీరోలుగా ప్రజల ముందు నిరూపణ కాపాడుతారని.. పాలకులు, రాజ్యాంగ ఔన్నత్యాన్ని ఉద్దేశపూర్వకంగానే తక్కువ చేసి చూపిస్తున్నారు. అయితే పాలకులు రాజ్యాంగం గొప్పతనాన్ని ప్రజలకు తెలియకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అంతి మంగా దేశ ప్రజలపై, పాలకులపై సర్వ అధికారి భారత రాజ్యాంగం మాత్రమే అనే సత్యాన్ని ఎవరు రూపుమాపలేరు. ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ముఖ్య మంత్రి, గవర్నర్లు న్యాయమూర్తులు, ఉన్నత ఉద్యోగులు, మేధావులు, విద్యావంతులు, సామా న్యులు "భారత రాజ్యాంగానికి" కృతజ్ఞులై ఉండటమే రాజ్యాంగానికి మన మిచ్చే నిజమైన గౌరవమని గ్రహించాలి.

- పుల్లెంల గణేష్

95530 41549

Next Story

Most Viewed