కలల బేహారి రాజ్ కపూర్

by Ravi |   ( Updated:2024-11-30 00:45:20.0  )
కలల బేహారి రాజ్ కపూర్
X

హిందీ చలనచిత్ర సీమలో ప్రేమిక జీవిగా, కలల బేహారిగా పేరొందిన నటుడు రాజ్ కపూర్. నటుడిగా దర్శకుడిగా సుస్థిరమైన స్థానాన్ని పొందిన వాడాయన. ‘GREATEST SHOWMAN OF INDIA’ గా పేరు గడించాడు. తాను స్వయంగా సంగీత దర్శకుడు కాదు కానీ భారతీయ ప్రధాన స్రవంతి సినిమా సంగీతాకాశంలో దార్శనికుడిగా పేరు తెచ్చుకున్నాడు.

ఆయన తనదైన ఓ అద్భుత పార్శ్వాన్ని, సంగీత ప్రపంచాన్ని నిర్మించుకుని నిలబడ్డాడు. హిందీ చిత్రసీమతో దృశ్యాన్నీ, సంగీతాన్ని మేళవించి అందాన్ని, ఆనందాన్ని ఆర్ద్రతని పలికింపచేసినవాడు. సినీ సంగీతాన్ని సాధారణ భారతీయ ప్రేక్షకుడి వద్దకు తీసుకెళ్లాడాయన. ఆయనకు తన టార్గెట్ ఆడియన్స్ ఎవరన్నది స్పష్టంగా తెలుసు. అందుకే వారిని అందుకోవడానికి, అలరించడానికి తన సినిమా గమనాన్ని నిర్దేశించుకున్నాడు. అంతేకాదు జీవితంలోని ప్రేమ, దుఃఖం, వేదన, సంతోషం అన్నింటినీ లయబద్దంగా తన చిత్రాల్లో ఇముడ్చుకున్నాడు.

చిరస్మరణీయ 'సంతకం'

తన సినిమాల్లో భారతీయతను సంతరించుకుని మన పక్కింటి వాడిగా ఆయా పాత్ర ల్ని రూపొందించాడు రాజ్. ఆయన సిని మాల్లో ‘ఆగ్’ మొదలు ‘రాం తేరి గంగా మైలీ’ దాకా విశేషమయిన ప్రజాదరణను పొందాయి. హిందీ సినిమా రంగంలో చిరస్మరణీయమైన తన ‘సంతకాన్ని’ మిగిల్చి పోయాడాయన. రాజ్ కపూర్ తీసిన ‘అవారా’ చిత్రం 1954-55 లోనే ఇరాన్, ఇరాక్, సిరియా, టర్కీ, సోవియెట్ యుని యన్ లాంటి దేశాల్లో సంచలనాల్ని సృష్టిం చి విజయాన్ని అందుకుంది. ‘అవారా హూ..’ పాటయితే మొత్తం సోవి యెట్‌ యూనియన్‌నే ఉర్రూతలూగించింది. ఆ సినిమాలోని పాటలు 12 అంతర్జాతీయ భాష ల్లోకి అనువదించబడ్డాయి. అప్పుడే పాన్ ఇంటర్నేషనల్ సినిమాని నిర్మించిన వాడు ఆయన. నిజానికి సామాన్య ప్రేక్షక జనాన్ని ఆనందపరచడం కోసం కమర్షియల్ సినిమాని తన భావ వ్యక్తీకరణ మాధ్య మం గా ఎంచుకున్నాడు. దానితోపాటు సోష లిజం భావాల్ని అంతర్లీనంగా చెప్పేం దుకు తన సినిమాల్ని వేదికగా చేసుకున్నాడు.

స్టేజీ నటనతో మొదలైన యాత్ర

1924లో పెషావర్‌లో పఠాన్ కుటుం బంలో జన్మించిన ఈయన అసలు పేరు రణబీర్ రాజ్ కపూర్. రాజ్ తండ్రి పృథ్వీ రాజ్ కపూర్ నాటకాల్లోనూ సినిమాల్లోనూ విజయవంతమైన నటుడు. తన తండ్రితో చిన్ననాటి నుండే స్టేజీ నాటకాల్లో పాల్గొంటూ తన నటనను మెరుగు పరచుకున్నాడు. తన 11వ ఏటనే మొదటిసారిగా దేవకీ బోస్ ‘ఇన్క్విలాబ్’ సినిమాలో నటిం చాడు. తర్వాత కొన్నాళ్ళకు ప్రిథ్వి థియే టర్‌లో నటుడిగానూ మేనేజర్ గాను పనిచేసాడు. సినీ జీవితాన్ని సహాయ దర్శకుడిగా ‘రంజిత్’ సినిమాతో ప్రారంభించాడు. నటుడిగా పలు సినిమాల్లో నటించినప్పటికీ మధుబాలతో కలిసి 1947లో నటించిన ‘నీల్ కమల్’తో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇవాల్టి భాషలో చెప్పుకుంటే బ్రేక్ వచ్చిందన్న మాట.

పాటలతో మార్మోగిన బర్సాత్, సంగం

1948లో రాజ్ కపూర్ తన 21 ఏండ్ల వయస్సులో ఆర్కే ఫిలిమ్స్ సంస్థను స్థాపించి మొదటి సినిమా ‘ఆగ్’ నిర్మిం చారు. ఆ తర్వాత బాంబేలోని చెంబూర్‌లో ఆర్కే స్టూడియోను పూర్తిస్థాయిలో ఆరంభించాడు. దాంతో ఆర్కే హిందీ సినిమాల్లో చరిత్రగా ఎదిగింది. ఆగ్ తర్వాత రాజ్ కపూర్ రూపొందించిన ‘బర్సాత్’ విడుదలయింది. ‘జిందా హూన్ ఇస్ తరహా...’ లాంటి పాటలతో ఆగ్ సినిమా మార్మోగిపోతే బర్సాత్ వచ్చేసరికి రాజ్ కపూర్‌తో సంగీత దర్శకుల జంట శంకర్ జైకిషన్ వచ్చి చేరారు. ‘బర్సాత్ మే తక్ దిన దిన్’ లాంటి పాటలతో బర్సాత్ ఘన విజయాన్ని సాధించింది. అదే కాలంలో రాజ్ కపూర్ ‘అందాజ్’, ‘సునహరే దిన్’, బావరా, ‘సంగం’ లాంటి సినిమాల్లో నటించాడు. ‘సంగం’ సినిమా ఆనాడే ముక్కోణ ప్రేమ కథలకు బాట వేసింది, ‘సంగం’ లోని ‘ఏ మేరా ప్రేమ పత్ర పడ్కర్’, ‘దోస్త్ దోస్త్ నా రహా’ లాంటి పాటలు నేటికీ శ్రోతల్ని అలరిస్తూనే వున్నాయి.

సామాన్య మనిషే కథానాయకుడిగా..

‘ఘర్ ఆయా మేరా పర దేశి’ నిజంగా ఆవారాను గుండెలకు హత్తుకునేలా చేసింది. ఆ తర్వాత రాజ్ వరుసగా తీసిన కపూర్ ‘ఆహ్’, ’శ్రీ 420’, ‘చోరి చోరి’, ‘జిస్ దేశ్ మే గంగా బహతీ హై’, ‘తీస్రీ కసం’, ‘మేరా నాం జోకర్’ లాంటి అనేక సినిమాలు తనను ఉతమ నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా నిలబెట్టాయి. సినిమా వినోదాత్మకం కావాలన్నదే రాజ్ కపూర్ విశ్వాసం. ఆ కోణంలోనే తన సినిమాల్ని నడిపించాడు. ఆయన సినిమాల్లో సామాన్య మనిషే కథానాయకుడు. వాటిల్లో పాట ప్రధాన కాన్వాస్‌గా నిలబడింది. దాదాపు ఆయన తీసిన అన్ని సినిమాల్లో పాట ప్రధాన భూమికను పోషించింది. అందుకు కవి శైలేంద్ర, గాయకుడు ముఖేష్, సంగీత దర్శకులు శంకర్ జైకిషన్‌లు ఆయనకు తోడుగా నిలిచారు.

నాలుగు దశాబ్దాల నట జీవితం

ఆయన డ్రీం ప్రాజెక్ట్ ‘మేరానాం జోకర్’ హాస్యంలో విషాదాన్ని, జీవితంలోని తాత్వికతని అందిపుచ్చుకుని రూపొందింది. రెండు ఇంటర్వెల్స్‌తో నాలుగు గంటల పాటు సాగే ఆ సినిమా కథా కథనాల్లో ప్రయోగాత్మకంగా వుంటుంది. మేరా నామ్ జోకర్‌లోని ‘జీనా యహా మర్నా యహా ఇస్కే సివా జానా కహా’ పాటలు భావయుక్తంగానూ తాత్వికంగానూ వుం టాయి. అయితే ఆ సినిమా ఆర్థికంగా రాజ్ కపూర్‌కు నిరాశనే మిగిల్చింది. కానీ కాలక్రమంలో విలక్షణమయిన సినిమాగా పేరొందింది. తర్వాత రాజ్ ‘బాబీ’ లాంటి పక్కా ప్రేమ కథని సినిమా తీసి నూతన ఒరవడికి దారి తీసారు. ఇంకా ఆయన తీసిన ‘సత్యం శివం సుందరం’ లాంటి సినిమా భారతీయతకు, ప్రేమకు నడుమ వారధిలా ఒక మంచి దృశ్య కావ్యంలా రూపొందింది. ఇక రాజ్ తన చివరి రోజుల్లో తీసిన ‘రాం తేరి గంగా మైలీ’ ఆయన వ్యాపార ధోరణి పరిణామాన్ని చూపించింది. అట్లా రాజ్ కపూర్ తన సినిమాలతో నాలుగు దశాబ్దాలపాటు భార తీయ సినిమా రంగంలో నిలబడి తనదయిన చిరస్థాయి ముద్రను మిగిల్చాడు.

- వారాల ఆనంద్

94405 01281

Advertisement

Next Story

Most Viewed