కవి మాట

by Ravi |   ( Updated:2022-09-03 18:38:45.0  )

నీ కలలు మొలకలై కాళ్లావేళ్లా పడితే

కన్నీటిని పారించి , పోషించి , పెంచి

ఆనందాభ్యుదయం పండించిన

సంతోష నదీ సామ్రాజ్ఞివి నువ్వే కదా !

సూర్యుణ్ణి నీతో పాటు ఊళ్లోకి తీసుకెళ్లి

చంద్రుణ్ణి నీవెంట పల్లె ఇంటికి తెచ్చి

నా నిద్రతలనూ బొజ్జనూ ముద్దాడిన

ప్రేమాత్మ దీవెనవు నువ్వే కదా !

మా వేళ్ళకు నోళ్లకు అందక

జారిపోయిన అ ఆ ల గింజల్ని

ఏరించి మొలిపించి తినిపించిన

మా కొత్త తల్లివి నువ్వే కదా!

గింజ మెతుకు కావటం మధ్య

మానవ చరిత్ర, నాగరికత

సంస్కృతి దాగి ఉన్నాయి

అన్నం తినటం వ్యక్తిగతం అనిపిస్తుంది

నిజానికి ప్రతిమెతుకు మీద

ప్రభుత్వం కన్నుంది, పన్నుంది

కుట్టూ కుట్టకపో నలిపితే చచ్చే చీమ దళితుడు

నెత్తివేట్లు తిని గోడపైన దేశపటం నిలబెట్టే మేకు దళితుడు

కొలకనూరి ఇనాక్

Advertisement

Next Story

Most Viewed