- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మండల్-2 ఉద్యమం అవశ్యం!
రామ మందిరం సమస్యను బీజేపీ రాజకీయ అస్త్రంగా వినియోగించుకుని రెండు పార్లమెంట్ సీట్ల స్థాయి నుంచి అధికారంలోకి వచ్చి దశాబ్ద కాలంగా వరుసగా భారతదేశాన్ని ఏలింది. ఆ రోజు మండల కమిషన్‌కు వ్యతిరేకంగా రథయాత్ర చేపట్టిన బీజేపీ తర్వాత లక్ష్యం నెరవేర్చుకోవడంలో ముందుంది. కానీ, ఇప్పటికీ పూర్తిగా అమలు కానీ ఓబీసీ రిజర్వేషన్లు. బీసీ రిజర్వేషన్ల అమలుకు మరో మండల్ పోరాటం అవసరం. సామాజిక న్యాయ శక్తులు మండల్ కమిషన్ వర్సెస్ కమండల్ యాత్రను విశ్లేషించాల్సిన చారిత్రక సందర్భం ఇది.
భారతీయ జనతా పార్టీ దశాబ్దాల ఎజెండా రామ మందిర నిర్మాణం లక్ష్యం నెరవేరింది. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం పూర్తిచేసి అప్రతిహతంగా మరోసారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. కానీ 1990లో మండల్ కమిషన్ అమలు సందర్భంగా బీజేపీ సామాజిక న్యాయ శక్తులకు వ్యతిరేకంగా అయోధ్య రామ మందిరం వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చి రాజకీయంగా లబ్ధి కోసం ప్రయత్నించింది. దీంట్లో భాగంగానే నాటి బీజేపీ అగ్రనేత ఎల్.కే.అద్వానీ దేశవ్యాప్త రథయాత్రలు చేపట్టారు. ఆరోజు మండల కమిషన్‌కు వ్యతిరేకంగా రథయాత్ర చేపట్టిన బీజేపీ తర్వాత లక్ష్యం నెరవేర్చుకోవడంలో ముందుంది కానీ, మండల్ కమిషన్‌కు అనుకూలంగా సామాజికంగా, రాజకీయంగా ఓబీసీలు సాధికారత సాధించేందుకు భారతదేశ జనాభాలో సగభాగం ఉన్న జీవన ప్రమాణాలు పెరిగేందుకు గాను ప్రతిరూపంగా నిలిచే మండల కమిషన్ లక్ష్యం మాత్రం ఇప్పటివరకు నెరవేరలేదు. కోట్లాది ప్రజల జీవన ప్రమాణాలు సామాజిక న్యాయ శక్తులు ప్రభావశీలంగా భావించే మండల కమిషన్ నివేదిక 27 శాతం బీసీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇటీవల బీజేపీ సామాజిక న్యాయ సిద్ధాంతానికి వ్యతిరేకంగా కుల గణనను అటకెక్కించింది.
మండల్ కమిషన్‌కు మద్దతుగా విద్యార్థులను, ఉద్యమకారులను ఉత్తర భారతమంతటా ఏకతాటి మీదకు తెచ్చిన నాయకులు శరద్ యాదవ్. ఢిల్లీలో అగ్రకులాలకు వ్యతిరేకంగా, మండల్ కమిషన్‌కు అనుకూలంగా తాను పెద్ద సభను ఏర్పాటు చేశారు. రాజ్యాంగపరమైన ప్రాతినిధ్యం కోసం మండల్ నివేదికను అమలు చేయడం అనేది నిశ్శబ్ద విప్లవమని వీపీ సింగ్ అన్నారు. వీపీ సింగ్ తర్వాత చంద్రశేఖర్ , పీవీ నరసింహారావు పీఎంలు అయ్యారు. పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు కరసేవ కార్యక్రమం ద్వారా బాబ్రీ మసీద్ కూల్చివేత సంఘటన జరిగింది. రిజర్వేషన్లు కోర్టు కేసుల్లో పడి 1993 నుంచి అమల్లోకి వచ్చాయి. 1993 లో కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో రిజర్వేషన్లు ప్రారంభమైనా, ఇప్పటికీ 27% పూర్తిగా అమలు కావడం లేదు.
2008లో మన్మోహన్ సింగ్ విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేశారు. మండల్‌కు వ్యతిరేకంగా ఏర్పడిన కమండల్ ఉద్యమం , రామ మందిర్ నిర్మాణాన్ని ఎజెండాగా పెట్టుకొని 2024 జనవరి 22న దాన్ని పూర్తి చేసుకున్నారు. బీజేపీ 1990లో మండల్ కమిషన్‌కు వ్యతిరేకంగా చేపట్టిన కమాండల్ రథయాత్ర ద్వారా బీజేపీ తన రాజకీయ లక్ష్యం నెరవేర్చుకుంది. బీసీ సాధికారత విషయానికి వేస్తే ఇప్పటి వరకు న్యాయ వ్యవస్థలో బీసీల వాటా, కేంద్ర పరిపాలన వ్యవస్థలో బీసీల వాటా, విశ్వ విద్యాలయాల్లో బీసీల వాటా కనీసం 25 శాతం దాటలేదు. బీసీ రిజర్వేషన్లు పూర్తిగా అమలుచేసుకోవడంలో విఫలమయ్యారు. ఇప్పటికీ అన్ని వర్గాలతో పోల్చుకుంటే ఉద్యోగాలలో అగ్రకులాలు, దళితుల కన్నా బీసీలు వెనకబడి ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని మండల్ -2 ఉద్యమం కోసం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
(నేడు బీసీ బడి (బీసీ చైతన్య సదస్సు) సందర్భంగా)
నక్క మహేష్ యాదవ్
బీసీ బడి సమన్వయకర్త
90143 84440