- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సెలవు నిబంధనలు..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సెలవు నిబంధనలు 1.6.1972 నుంచి అమల్లోకి వచ్చాయి. రైల్వే ఉద్యోగులు, మరికొందరికి తప్ప మిగిలిన అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. సెలవును హక్కుగా పొందలేము (Rule 7). ఇప్పటికే మంజూరు చేయబడిన సెలవును ప్రభుత్వ ఉద్యోగి కోరిక మేరకు వేరొక రకమైన సెలవుగా మార్చవచ్చు. కానీ ఇది హక్కుగా కాదు. (రూల్ 10). ఏదైనా రకమైన సెలవును (క్యాజువల్ లీవ్ తప్ప) మరొక రకమైన సెలవుతో కలిపి లేదా కొనసాగింపుగా మంజూరు చేయవచ్చును. (రూల్ 11). నిరంతరంగా ఐదు సంవత్సరాల మించి సెలవు మంజూరు చేయకూడదు ( Rule 12). సెలవు మంజూరు ప్రొసీడింగ్స్‌లో మిగిలిన సెలవు రోజుల సంఖ్యను తప్పనిసరిగా సూచించాలి. (GSR 1422 dt. 21.11.1979). కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సెలవు నిబంధనలు చర్చిద్దాం.
ప్రతి క్యాలెండర్ సంవత్సరం జనవరి 1, జూలై 1 నాడు రెండు విడతలుగా 15 రోజుల పాటు ఆర్జిత సెలవును వెకేషన్ డిపార్ట్మెంట్‌కు చెందని ఉద్యోగులకు జమ చేయాలి. గరిష్ట ఆర్జిత సెలవు క్రెడిట్ 300 రోజులు మాత్రమే. ఒకేసారి మంజూరు చేయబడే గరిష్ట ఆర్జిత సెలవు 180 రోజులు.. ఒకవేళ ఉద్యోగ జీత నష్టపు సెలవులో ఉన్నా లేదా అతని గైర్హా జరు కాలాన్ని dies-non గా పరిగణించినప్పుడు 1/10 వంతు చొప్పున ఆర్జిత సెలవును తీసివేస్తారు (Rule 26). ప్రతి పూర్తి క్యాలెండర్ నెలకు 21/2 రోజుల చొప్పున ఆర్జిత సెలవును లెక్కించాలి. భిన్న భాగాన్ని సమీప రోజుకు రౌండ్ ఆఫ్ చేయాలి. (Rule 27). వెకేషన్ డిపార్ట్మెంట్ ఉద్యోగుల విషయంలో జనవరి 1, జూలై 1 నాడు రెండు విడుతలుగా 5 రోజుల చొప్పున ఆర్జిత సెలవు అకౌంట్లో జమ చేయాలి. ఒకవేళ ఉద్యోగి వెకేషన్‌ను వదులుకుంటే గరిష్టంగా 20 రోజుల వరకు అదనపు ఆర్జిత సెలవు జమ చేయబడుతుంది. క్యాలెండర్ సంవత్సరంలో జమ చేయబడిన మొత్తం ఆర్జిత సెలవుల సంఖ్య 30 రోజులకు మించకూడదు. వెకేషన్‌ను ఏ రక మైన సెలవుతో కలిపి లేదా ఏ రకమై న సెలవుకు కొనసాగింపుగా మం జూరు చేయవచ్చును. (Rule 30).
అర్ధ జీతపు సెలవు..
ప్రతి క్యాలెండర్ సంవత్సరంలో జనవరి 1, జూలై 1 నాడు రెండు విడుతలుగా 10 రోజుల చొప్పున అర్ధ వేతన సెలవును అడ్వాన్సుగా జమ చేయాలి. ఇది నెలకు 5/3 చొప్పున లెక్కించబడుతుంది. గరి ష్టంగా అర్ధ సంవత్సరానికి 10 రోజులు మాత్రమే. అర్ధ వేతన సెలవును జమ చేసేటప్పుడు రోజు భిన్నాన్ని సమీప రోజుకు రౌండ్ ఆఫ్ చేయాలి. (Rule 29). ఉద్యోగి అర్ధ వేతన సెలవులో సగం మొత్తానికి మించని commuted leaveను మెడికల్ సర్టిఫికెట్‌పై మంజూరు చేయవచ్చు. ఈ లీవ్‌ను మెడికల్ సర్టిఫికెట్ లేకుండా కూడా 90 రోజుల వరకు అనుమతించిన చదువు కోసం, అట్లే 60 రోజుల వరకు మెటర్నిటీ లీవుతో కలిపి మంజూరు చేయవచ్చును(Rule 30).
లీవ్ నాట్ డ్యూ..
శాశ్వత ఉద్యోగికి లీవ్ నాడు సెలవు మంజూరు చేయవచ్చు. ఇది మొత్తం సర్వీసులో గరిష్టంగా 360 రోజులకు మించకుండా కొన్ని నిబంధనలకు లోబడి వైద్య సర్టిఫికెట్‌పై మంజూరు చేయవచ్చు. లీవ్ నాట్ డ్యూ సెలవును అతను భవిష్యత్తులో సంపాదించే అర్థవేతన సెలవులో నుండి తీసివేయాలి. తాత్కాలిక ప్రభుత్వ ఉద్యోగులకు కూడా లీవ్ నాడు సెలవును మంజూరు చేయవ చ్చు. వారు టీబి, కుష్టు, కేన్సర్, మానసిక అనారోగ్యాలతో బాధపడుతున్నట్లయితే గరిష్టంగా 360 రోజు లకు మించకుండా మంజూరు చేయ వచ్చు. (Rule 31).
ఎక్స్‌ట్రార్డినరీ లీవ్ (జీత నష్టపు సెలవు)..
తాత్కాలిక ప్రభుత్వ ఉద్యోగికి జీత నష్టపు సెలవును గరిష్టంగా మూడు నెలలు, ఆరు నెలలు ( ఉద్యోగి ఒక సంవత్సరం సర్వీసు పూర్తి చేసినట్లయితే),18 నెలలు (ఉద్యోగి ఒక సంవత్సరం సర్వీస్ పూర్తి చేసి టి.బి, కుష్టు, కేన్సర్ , మానసిక అనారోగ్యాల చికిత్స పొందుతున్నట్లయితే), 24 నెలలు (ఉద్యోగి మూడు సంవత్సరముల నిరంతర సర్వీసు పూర్తి చేసి ఉన్నత చదువులు చదువుటకు) మంజూరు చేయవచ్చును(Rule 32). సర్వీస్‌లో ఉన్నప్పుడు ఎల్టిసిని ఉపయోగించే సమయంలో 10 రోజుల వరకు ఆర్జిత సెలవును నగ దుగా చెల్లించడానికి అనుమతిస్తారు. మొత్తం సర్వీస్‌లో ఇలా నగదుగా చెల్లించబడిన సెలవు 60 రోజులకు మించకూడదు. (Rule 38 A). ప్రభుత్వ ఉద్యోగికి తన పదవీ విరమణ/కంపల్సరీ రిటైర్మెంట్ సమయంలో గరిష్టంగా 300 రోజుల వరకు (ఆర్జిత సెలవు మరి అర్ధ వేతన సెలవు కలిపి) నగదుగా చెల్లించడానికి అనుమతిస్తారు. ఉద్యోగి ఒకవేళ ఉద్యోగాన్ని వదిలిపెట్టిన, రాజీనామా చేసిన 150 రోజుల వరకు ఆర్జిత సెలవును నగదుగా చెల్లించడానికి అనుమతించవచ్చును. (Rule 39). ఉద్యోగి మరణించిన సందర్భంలో, మెడికల్ ఇన్వాలిడేషన్‌లో కూడా 300 రోజుల ఆర్జిత సెలవును నగదుగా చెల్లించడానికి అనుమతిస్తారు (Rule 39-A,39-B). ఉద్యోగి 30 రోజులకు మించి ఆర్జిత లేదా సగపు జీతపు సెలవును వినియోగించుకుంటే వారికి ఒక నెల జీతంను అడ్వాన్స్‌గా చెల్లించవచ్చు (Rule 42). అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సెలవు నిబంధనలను మన రాష్ట్ర సెలవు నిబంధనలతో కలిపి పరిశీలించినప్పుడు చాలా సెలవుల విష యంలో సారూప్యత ఉన్నను, కొన్ని సెలవుల విషయంలో భేదాలు కనిపిస్తాయి.
- సి. మనోహర్ రావు,
రిటైర్డ్ ప్రభుత్వ అధికారి
96406 75288