- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మానసిక విశ్లేషణాత్మక సినిమా 'కాసవ్'
ఇవ్వాళ భారతదేశంలో మంచి సినిమాలకోసం, అర్థవంతమయిన సినిమాలకోసం అందరూ మరాఠీ సినిమా వైపు కూడా చూస్తున్నారు. ప్రాంతీయ భాషా చిత్రాల్లో బెంగాల్, కేరళ తర్వాత ఇప్పుడు మరాఠీ సినిమా పేరు సర్వత్రా చెప్పుకుంటున్నారు. హిందీ సినిమా వేళ్లూనుకుని వున్న ముంబైలో తన మనుగడ సాగిస్తూ చిన్న సినిమాకు పెద్ద విజయాల్ని అందిస్తున్న రంగమది. 'దంగల్',' ఉడ్తా పంజాబ్. లాంటి సినిమాలతో పోటీ పడి 2016లో జాతీయ స్థాయి ఉత్తమ సినిమాల్లో ఉత్తమ సినిమాగా ఎంపికయిన సినిమా 'కాసవ్'. సమాజంలోని చాలా సున్నితమయిన మానసిక సమస్యను ఇతివృత్తంగా తీసుకుని ఈ సినిమాను నిర్మించారు. ఇందులో పాత్రలు అనుభవించే మానసిక సంఘర్షణని దర్శకులు సరళంగానూ గొప్పగానూ తీశారు. మానసిక సమస్యలకు మనుషులు లొంగిపోరాదని, వాటి నుండి బయటపడి తాను సమాజానికి చేయాల్సిన సేవల పైన దృష్టి పెట్టాలని సూచిస్తుందీ సినిమా.
అదూర్ గోపాలక్రిష్ణన్ మొదటి సినిమా 'స్వయంవరం'. ఆ సినిమా 1972లో వచ్చింది. జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో విశేష ప్రశంసలు అందుకుని అదూర్‌ని ఐకానిక్ దర్శకుడిగా నిలబెట్టిన సినిమా అది. స్వయంవరం విడుదలై యాభై ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా ఇటీవల ఢిల్లీలో ఒక కార్యక్రమం నిర్వహించారు. ఆ సందర్భంగా అదూర్ మాట్లాడుతూ మనదేశంలో ఇప్పటికీ తనను ప్రాంతీయ భాషా దర్శకుడిగానే పరిగణిస్తారని అన్నారు. 'భారత దేశ దర్శకుడు' అనిపించుకోవాలంటే నేను విదేశాలకు వెళ్లాలని అన్నారు. మన దేశంలో కేవలం ముంబైలో తయారయ్యే వ్యాపార సినిమానే భారతీయ సినిమా అంటారని ఆయన వాపోయారు. అట్లా అదూర్ అన్నమాట నూటికి నూరు పాళ్ళు నిజం. కానీ ముంబైకి అవతల వివిధ భారతీయ భాషల్లో చాలా మంచి సినిమాలు భారతీయత నిండిన సినిమాలు వచ్చాయి, వస్తున్నాయి. బెంగాల్, కేరళ రాష్ట్రాలే కాకుండా మరాఠీ భాషలో కూడా చాలా గొప్ప సినిమాలు వచ్చాయి. శుద్ధ వ్యాపార వాతావరణం వున్న ముంబై లోనే మరో పక్క మరాఠీలో గొప్ప సినిమాలు రావడం అభినందించాల్సిన విషయం. అట్లా వచ్చిన జాతీయ ఉత్తమ చిత్రం 'కాసవ్' గురించి ఓ నాలుగు మాటలు ఇవ్వాళ ఇక్కడ పంచుకుంటాను.
ఉత్తమ సినిమాల్లో ఉత్తమ సినిమాగా..
ఇవ్వాళ భారతదేశంలో మంచి సినిమాలకోసం, అర్థవంతమయిన సినిమాలకోసం అందరూ మరాఠీ సినిమా వైపు కూడా చూస్తున్నారు. ఇటీవల మరాఠీ సినిమా ఇటు ఆర్థికంగానూ అటు కళాత్మకంగానూ విజయవంతంగానూ కొనసాగుతున్నది. ప్రాంతీయ భాషా చిత్రాల్లో బెంగాల్, కేరళ తర్వాత ఇప్పుడు మరాఠీ సినిమా పేరు సర్వత్రా చెప్పుకుంటున్నారు. నిజానికి మరాఠీ సినిమా వందల కోట్ల పెట్టుబడి కలిగి అంతకు రెట్టింపు లాభాలు ఆర్జించే రంగం కాదు. హిందీ సినిమా వేళ్లూనుకుని వున్న ముంబైలో తన మనుగడ సాగిస్తూ చిన్న సినిమాకు పెద్ద విజయాల్ని అందిస్తున్న రంగమది.
'కాసవ్' 2016లో జాతీయ ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకున్న మానసిక విశ్లేషణాత్మక చిత్రం. జాతీయ స్థాయి ఉత్తమ సినిమాల్లో ఉత్తమ సినిమాగా ఎంపికయిన సినిమా 'కాసవ్'. సుమిత్రా భావే, సునిల్ సిక్తాంకర్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాని వాళ్ళిద్దరితో పాటు ప్రముఖ నటుడు మోహన్ ఆగస్సే నిర్మించాడు. సమాజంలోని చాలా సున్నితమయిన మానసిక సమస్యను ఇతివృత్తంగా తీసుకుని ఈ సినిమాను నిర్మించారు. ఇందులో పాత్రలు అనుభవించే మానసిక సంఘర్షణని దర్శకులు సరళంగానూ గొప్పగానూ తీశారు.
'కాసవ్' లో ప్రధాన పాత్ర జానకి. ఆమె స్వతంత్ర ప్రవృత్తి గల మరాఠీ యువతి. తన వైవాహిక జీవితం కల్లోలంలో వుంటుంది. భర్తతో దాదాపుగా విడాకుల అంచున వుంటుంది. దానికి తోడు జానకికి అపుడప్పుడూ మానసిక తీవ్ర వత్తిడివల్ల మెంటల్ స్ట్రోక్స్ వస్తూవుంటాయి. డాక్టర్ ఆమెను ఎలాంటి మానసిక వొత్తిడికి గురి కాకూడదని అందుకోసం స్వార్థ రహితంగా ఇతరులకు సాయం చేస్తూ అందులో సంతోషాన్ని వెతుక్కోవాలని సూచిస్తాడు. ఆక్రమంలో ఆమె తాబేళ్ళ సంరక్షణ కోసం పనిచేసే ఒక ప్రాజెక్ట్‌లో పని చేస్తూవుంటుంది. దానికి దత్తా బాహూ (మోహన్ అగాసే) అధినేతగా వుంటాడు.
సినిమా ప్రారంభంలోనే మోచేతిని కోసుకుని ఆత్మహత్య చేసుకుందామనుకున్న, మానసికంగా వత్తిడికి గురయిన మానవ్ కళ్ళు తెరిచి చూసేసరికి ఆసుపత్రిలో వుంటాడు. కానీ ఆసుపత్రిలో వుండలేక వెంటనే అక్కడి నుండి పారిపోయి రోడ్డుమీద పడిపోతాడు. అటువైపుగా కారులో వెళ్తున్న జానకి తన డ్రైవర్ సహాయంతో అతన్ని కాపాడుతుంది. దేవ్ గఢ్‌లో సముద్రపు వొడ్డున వున్న తన ఇంటికి తీసుకొచ్చి ప్రైవేట్ డాక్టర్ తో వైద్యం చేయిస్తుంది. జానకి తోడ్పాటు, సహచర్యానికి తోడు ప్రాజెక్ట్ లో పనిచేస్తున్న అయినయదు, బలియా పార్శుల సాహచర్యంతో మానవ్ ఆరోగ్యం కుదుట పడుతుంది. ఈ క్రమంలో మానవ్‌కు జీవితమూ దాని విలువా, మనిషిగా తన బాధ్యతలు అర్థం అవుతాయి. తన సమస్యలే కాదు అనేక సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎంతో మంది తన చుట్టూ వున్నారని వారికి సహకరించడం, సేవలు అందించడంలోనే జీవితానికి అర్థం వుందని తెలుసుకుంటాడు. ఆ క్రమంలో తనను తాను మలుచుకుంటాడు. మొత్తం మీద కాసవ్ సినిమా కథ చిన్నదే అయినా దానికి దృశ్య రూపం ఇవ్వడంలో దర్శకద్వయం తమ అనుభవాన్నీ సినిమా పట్ల తమకున్న అవగాహననీ మేళవించి రూపొందించారు. జానకి పాత్రలో ఐరావతి హర్శే , మానవ్ పాత్రలో అలోక్ రాజ్వడే మంచి నటనని ప్రదర్శించారు.
కాసవ్ అంటే తాబేలు అని అర్థం, సినిమాకు ఆ పేరు పెట్టడంలోనే దర్శకుల ఉద్దేశం తెలిసిపోతుంది. డిప్ప లాంటి తన శరీరంలోకి తన తలని తాబేలు ఎలా ముడుచుకుంటూ వుంటుందో మానసిక సమస్యలతో మనుషులూ అట్లాగే తమ లోకి తాము ముడుచుకుని వుంటారని వాళ్ళని సరయిన రీతిలో ట్రీట్ చేయగలిగితే బయట పడతారని ఈ సినిమా సూచిస్తుంది. మానసిక సమస్యలకు మనుషులు లొంగిపోరాదని, వాటి నుండి బయటపడి తాను సమాజానికి చేయాల్సిన సేవల పైన దృష్టి పెట్టాలని సూచిస్తుందీ సినిమా. కాసవ్ సినిమాను చాలా హుందాగా తీశారు. సముద్రపు తీరాన అందమైన లొకేషన్లో చాలా సహజ వాతావరణంలో నిర్మించారు.
విలక్షణ నటులుండంచే..
మోహన్ ఆగస్సే లాంటి విలక్షణ నటులు ప్రధాన పాత్రలో వుండడం కూడా సినిమాకు బలాన్ని ఇచ్చింది. ఇక దర్శకులు సుమిత్రా భావే, సునిల్ సిక్తాంకర్‌లు 1985 నుంచి ఇప్పటివరకు 14 ఫీచర్ ఫిల్మ్స్ తీశారు. ఇప్పటికే 'దేవ్రాయి', 'అస్తు' లాంటి అవార్డు సినిమాలకు దర్శకత్వం వహించారు. మరాఠీ సినిమా రంగం 'శ్వాస్' నాటి నుండి పలు జాతీయ అవార్డు సినిమాల్ని దేశానికిచ్చింది. కళాత్మకమైన అర్థవంతమైన సినిమాల్లో గొప్ప ఆశావహమైన వాతావరణాన్ని కల్పిస్తున్నది. 'దంగల్',' ఉడ్తా పంజాబ్. లాంటి సినిమాలతో పోటీ పడి 2016లో ఉత్తమ సినిమా అవార్డు 'కాసవ్' గెలుచుకోవడం విశేషమే కాదు... అభినందించాల్సిన విషయం. స్ఫూర్తి పొందాల్సిన సినిమా అది. 'కాసవ్'.
కథ, స్క్రీన్ ప్లే సుమిత్ర భావే; దర్శకత్వం సుమిత్ర భావే, సునిల్ సిక్తాంకర్, నిర్మాతలు సుమిత్రా భావే, సునీల్ సుక్తాంకర్, మోహన్ ఆగస్సే; నటీనటులు ఐరావత్ హర్శే, అలోక్ రాజ్వడే, కిషోర్ కదం, మోహన్ ఆగస్సే
-వారాల ఆనంద్
9440501281
Also Read...
పెన్షన్ల అమలుపై జగన్ అబద్దాలు!