- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యుత్ అవినీతిపై సన్నాయి నొక్కులా..?
సౌర విద్యుత్తు ఒప్పందాలకు సంబంధించిన వివిధ అంశాలపై మాజీ సీఎం జగన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెకీతో, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన డిస్కంలు ఒప్పందం కుదుర్చుకున్న ఒప్పందం అది. యూనిట్ ధర రూ.2.49కే ఇస్తు న్నారని, స్పెషల్ ఇన్సెంటివ్ కూడా ఇస్తున్నారు. వీటన్నింటివల్ల ఏడాదికి రూ.4,400 కోట్లు కలిసి వస్తాయి. ఒప్పందం ప్రకారం పాతికేళ్లకు లక్షల కోట్లు కలిసి వచ్చేవి. ఇది రాష్ట్ర చరిత్ర లోనే అతి తక్కువ ఖర్చుతో వచ్చే విద్యుత్ పైగా ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌మిషన్ చార్జీలు లేకుండా ఇస్తున్నారు.
రాష్ట్రానికి ఇంత తక్కువకు విద్యుత్ తీసుకువస్తే శాలువాలు కప్పి సన్మానం చేయాల్సింది పోయి, విమర్శిస్తున్నారని, మంచి చేసిన వాడిపై రాళ్లు వేస్తున్నారని, అదానీపై నమోదైన కేసు వ్యవహారంలో ఎక్కడా తన పేరు లేదని, సీఎంగా ఉన్నంత మాత్రాన తనకు సంబంధం ఏమిటని.. తనపై దుష్ప్రచారమే ధ్యేయంగా తప్పుడు వార్తలు రాస్తున్న రెండు మీడియా సంస్థలపై 100 కోట్ల రూపాయల మేరకు పరువునష్టం దావా వేస్తున్నట్లు తెలిపారు. తాను సంపద సృష్టిస్తే, చంద్రబాబు ఆవిరి చేసారని తాను ఏదో సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలో రాష్ట్రాన్ని ఉద్దరించినట్లు సన్నాయి నొక్కులతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు.
ఎందుకు సన్మానం చేయాలి..?
అబద్ధాలను అందంగా చెప్పడంలో జగన్ రెడ్డి సిద్ధహస్తుడు. అందులో ఆయనకు ఆస్కార్ అవార్డు ఇవ్వడం సముచితం. ఇంత తక్కువకు విద్యుత్ తీసుకువస్తే తనకు శాలువలు కప్పాలని, సన్మానాలు చేయాలని, అవార్డులు ఇవ్వాలని కోరుకోవడం సిగ్గుచేటు.. ఐనా ఆయనకు ఎందుకు సన్మానాలు చెయాలి? అవార్డులు ఎందుకు ఇవ్వాలి? 2021 మేలో సెకీ వేసిన వేలంలో యూనిట్ గరిష్ట ధర రూ.2.14 ఉంటే మీరు రూ.2.49కు కొన్నందుకు శాలువాలు కప్పాలా? అదానీ వద్ద యూనిట్ రూ.1.99 చొప్పున గుజరాత్ కొనుగోలు చేస్తే అదే కంపెనీ నుంచి 50 పైసలు ఎక్కువకు కొన్నందుకు మీకు సన్మానాలు చేయాలా? ట్రాన్స్‌మిషన్ చార్జీల భారం అక్కడ ఎక్కడా లేకుంటే గుజరాత్‌కు ఇచ్చిన రేటు ప్రకారం ఏపీకి రూ.1.99కే అదానీ ఇవ్వనందుకు మీకు అవార్డులు ఇవ్వాలా? ట్రాన్సిమిషన్ చార్జీలు గరిష్టంగా యూనిట్‌కు రూ.1.70 పడతాయంటూ జగన్ జమానాలోని ఇంధన శాఖ అధికారులే చెబుతుంటే, ఎటువంటి చార్జీలూ లేవని అబద్దాలు చెప్పినందుకు అవార్డులు ఇవ్వాలా? ఎవరూ కొనని విద్యుత్తును కొని బంపర్ ఆఫర్‌గా రూ.1,750 కోట్లు నేరుగా ముడుపులు తీసుకున్నందుకు సన్మానాలు చెయ్యాలా?
అమెరికా మీడియాపై దావా వేయలేదెందుకు..?
అప్పటి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అవినీతి చేశారని అమెరికా అధికారిక దర్యాప్తు సంస్థలు ఎఫ్‌బీఐ, ఎస్‌ఈసీ వెల్లడించినందుకు, ముడుపులు ముట్టాకే ఒప్పందాలు చేసుకున్నారని నివేదికలో వెల్లడించిందుకు అవార్డులు ఇవ్వాలా? గంగవరం పోర్టును అదానీకి రూ.640 కోట్లకు అమ్మేసినందుకు అవార్డులు ఇవ్వాలా? అదానీతో చేసుకున్న ఒప్పందంలో అవినీతి లేకపోతే, అమెరికా దర్యాప్తు సంస్థలు మీ మీద తప్పుడు ఆరోపణలు చేసి ఉంటే వారి మీద ఎందుకు దావా వేయడం లేదు? విద్యుత్తు కొనుగోళ్ల కుంభకోణంలో జగన్‌కు రూ.1,750 కోట్లు ముట్టాయని ఎఫ్‌బీఐ నివేదిక స్పష్టంగా వెల్లడిస్తే, మీ ఆర్థిక నేరం ప్రపంచవ్యాప్తంగా పత్రికలలో ప్రచురితమైంది. మరి ఎఫ్‌బీఐతో పాటు అంతర్జాతీయ పత్రికలపై పరువునష్టం దావా వేయకుండా, కేవలం ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై దావా వేస్తాననడం ఏమిటి? జగన్ కుంభకోణాన్ని ఒక్క సాక్షి మీడియా తప్ప జాతీయ, అంతర్జాతీయ మీడియాతో పాటు లండన్ ఎకనమిస్ట్ వంటి ఆంగ్ల పత్రికలు కూడా ప్రచురించాయి. మరి ప్రపంచం గుర్తించిన అవినీతి నేరాన్ని జగన్ ఖండించడం ఎవరిని మోసం చెయ్యడానికి?
అడ్డంగా దొరికినా బుకాయింపా..?
సౌర విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలలో అవినీతి జరిగిందని ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వరకు కేసు నమోదు అయి రచ్చ అవుతున్నది. అయినా జగన్ రెడ్డి మాత్రం ఇంకా బుకాయిస్తూ తన ముడుపుల బాగోతంపై పరదాలు కప్పే ప్రయత్నం చేస్తున్నారు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో ఒప్పందం చేసుకుంటే అదానీకి ఏం సంబంధం అంటూ జగన్ రెడ్డి అడ్డంగా వాదిస్తున్నారు. సౌర విద్యుత్తు కొనుగోలుపై అడ్డంగా దొరికిపోయిన నిజాలు దాచేందుకు ప్రయత్నించడం కాదా? సెకీతో ఒప్పందానికి ముందు పనిగట్టుకుని ప్రత్యేక విమానంలో తాడేపల్లికి 3 సార్లు అదానీ వచ్చి తనని ఎందుకు కలిశారు? ఒకవేళ విద్యుత్తు ఒప్పందం కోసం కాదని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అదానీ వచ్చారని ఆ విషయాన్ని ఆనాడు జగన్ ఎందుకు బహిర్గతం చేయలేదు? ప్రపంచ కుబేరుల్లో ఒకరుగా పేరున్న అదానీ 3 నెలల్లో మూడుసార్లు రహస్యంగా కలవాల్సిన అవసరం ఏమిటి? పంప్డ్ స్టోరేజీ, డేటా సెంటర్‌ను అదానీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆనాడు సీఎం కార్యాలయం అధికారికంగా ఎందుకు ప్రకటించలేదు? ఆ భేటీ వెనుక ఉన్న మర్మం ఏమిటి? అమెరికా దర్యాప్తు సంస్థలు ఆ సందేహాలను నివృత్తి చేస్తూ స్కాముల కోసం స్కీమ్‌లకు స్కెచ్ వేసి రాష్ట్రంపై లక్షల కోట్ల రూపాయల సోలార్ ఒప్పంద భారాన్ని జగన్ వేశారంటూ న్యూయార్క్ కోర్టులో అభియోగం మోపింది. జగన్ ముడుపుల బాగోతం కళ్లకు కనిపిస్తున్నా అబద్దాలు చెప్పడం, బుకాయించడం ఏమిటి? ఆయన సాగించిన ముడుపుల బాగోతాన్ని అమెరికా దర్యాప్తు సంస్థ వెలుగులోకి తెచ్చింది.
గంగవరం పోర్టును కట్టబెట్టిందెవరు..?
అధిక ధరలకు అదానీ కరెంటు కొనుగోలుకు ఒప్పందం చేసుకొన్న జగన్ రెడ్డి మూలంగా ప్రజల నడ్డి విరిగిన అదనపు భారం అక్షరాలా రూ.1.10 లక్షల కోట్లు అయింది. ఆంధ్ర ప్రదేశ్‌ను అదానీకి అప్పనంగా కట్టబెట్టేందుకు జగన్ రెడ్డి చీకటి ఒప్పందాలు చేసుకొన్నారు. అదానీతో చేసుకున్న చీకటి ఒప్పందాల వల్ల డిసెంబర్ నుండి రాష్ట్ర ప్రజలు రూ.6072 కోట్ల విద్యుత్ భారం మోయాల్సిన పరిస్థితి దాపురించింది. మరో రూ.11,820 కోట్లను విద్యుత్ సర్దుబాటు చార్జీల పేరుతో ప్రజలపై భారం వేయాల్సిన పరిస్థితి. ఒకపక్క చార్జీలు, పన్నుల భారం ప్రజలు మోస్తుంటే, అవినీతికి పాల్పడి అదానీకి దాసోహమయిన జగన్ రెడ్డి మరోవైపు విద్యుత్ చార్జీలు పెంచుతున్నారని మొసలి కన్నీరు కారుస్తూ ప్రజలను మభ్యపెడుతూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. సెకీతో రాష్ట్ర ఇంధన సంస్థలు కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటే అదానీ ప్రస్తావన ఎందుకు వస్తుందని జగన్ అమాయకంగా ప్రశ్నిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. కృష్ణపట్నం పోర్టులో 75 శాతం వాటాను 2020 అక్టోబరులో అదానీ సంస్థ దక్కించుకుంది. మిగిలిన 25 శాతాన్ని, 2021 ఏప్రిల్ 5వ తేదీన రూ.2800 కోట్లకు అదానీ కంపెనీయే దక్కించుకుంది. గంగవరం పోర్టు లిమిటెడ్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న 10.4 శాతం ఈక్విటీని రూ.645.10 కోట్లకు అదానీ సంస్థకు కట్టబెట్టి అదానీ ప్రదేశ్‌గా మార్చారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్ సృష్టించిన అవినీతికి యావత్ ఆంధ్రప్రదేశ్ బలైంది. విద్యుత్ ఒప్పందాల అంశం జోలికి వెళ్లకుండా జగన్ చేసిన రూ 1,750 కోట్ల అవినీతిపై ఏసీబీ విచారణకు ఆదేశించాలి. స్వాహా పర్వాలతో రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసిన అవినీతి పరులను చట్టబద్దంగా శిక్షించాలి.
- నీరుకొండ ప్రసాద్
98496 25610