- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ సవరణ బిల్లు.. వక్ప్ ఆస్తులు దుర్వినియోగపరచడానికేనా?
2014లో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముస్లిం మైనార్టీ వర్గాలలో అభద్రతా భావం పెరిగింది. ఆ సర్కార్ వచ్చినప్పటి నుంచి భారతదేశంలోని అతిపెద్ద మైనారిటీ సమూహమైన ముస్లింలకు సంబంధించిన అనేక అంశాల పట్ల దూకుడుగా ప్రవర్తించడం మొదలెట్టింది. ముస్లింల చట్టాల సవరణ, కొత్త చట్టాల పేరుతో భయాందోళనలకు గురి చేసే పరిస్థితులు ఆ సమాజాన్ని తీవ్ర ఆందోళనకు కలవరానికి గురి చేస్తున్నాయి. ఇప్పటికే యావత్ ముస్లిం సమాజాన్ని ఇబ్బంది పెట్టే సీఏఏ లాంటి చట్టాలు చేసింది. ఇప్పుడు ముస్లింల ఆచార వ్యవహారాలు, సంస్కృతిపై దాడి సైతం మొదలు పెట్టింది.
ఈ నేపథ్యంలోనే ఉమ్మడి పౌరస్మృతిని బీజేపీ తెర మీదకు తీసుకువచ్చింది. రెండో విడత అసెంబ్లీ ఎన్ని కలు జరగనున్న జార్ఖండ్‌లో ప్రచారం సందర్భంగా ఉమ్మడి పౌరస్మృతి అమలు చేసి తీరుతామని ఇప్ప టికే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ప్రకటించారు.
అవి ఒక్కరి ఆస్తులు కావు..
ఉమ్మడి పౌరస్మృతి అనేది చాలా సున్నితమైన అంశం. దీనిపై ఏమాత్రం తొందరపాటు పనికిరాదు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో ముందుగా సంప్రదింపులు జరపాలి. ఏకాభిప్రాయం వచ్చాకే యూనిఫామ్ సివిల్ కోడ్‌పై నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న తరు ణంలో ఇంత హడావిడిగా ఉమ్మడి పౌరస్మృతిపై బీజేపీ అగ్రనేతలు ప్రకటన చేయాల్సిన అవసరం ఏమిటో..? ఇవన్నీ చాలవన్నట్టు ఇటీవల వక్ఫ్ ఆస్తులపై కేంద్రంలోని బీజేపీ సర్కార్ కన్నేసింది. వక్ఫ్ ఆస్తులను నెగటివ్ షేడ్‌లో చూపించడానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చేయాల్సిందంతా చేసింది. వాస్తవానికి వక్ఫ్ ఆస్తులు అంటే ఏ ఒక్కరి వ్యక్తిగత ఆస్తులు కావు. యావత్ ముస్లిం సమాజానికి సంబంధించిన ఆస్తులు. ఈ ఆస్తులను సంరక్షించడానికి ఓ చట్టం ఉంది. అదే వక్ఫ్ చట్టం.
కనీస సమాచారం లేకుండానే…
మనదేశంలో కొన్ని దశాబ్దాల నుంచి ఈ చట్టం అమలులో ఉంది. ముస్లిం సమాజం మేలు కోసం గతంలో ముస్లిం చక్రవర్తులు, నవాబులు దానం ఇచ్చిన భూములు అవి. ఈ భూములపై వచ్చే ఆదాయాన్ని దర్గాల నిర్వహణతో సహా ముస్లింల ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగించాల్సి ఉంటుం ది. వ్యక్తిగతంగా ఏ ముస్లిం ప్రముఖుడికో ధారాదా త్తం చేసే అవకాశాలు వక్ఫ్ చట్టంలో ఏ మాత్రం ఉండవు. నూటికి నూరు శాతం ముస్లిం సమూహ ప్రయోజనాలే లక్ష్యంగా ఉంటాయి. ఇంతటి పటిష్టమైన వక్ఫ్ చట్టంలో ఇటీవల కీలక మార్పులు తీసుకువచ్చే దిశగా ఓ సవరణ బిల్లును వక్ఫ్ చట్టం సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా లోక్‌సభలో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టారు. ఇంతటి కీలకమైన సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టే ముందు సభ్యులకు ముందస్తు సమా చారం ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై లేదా? ఈ బాధ్యతను కూడా పట్టించుకోలేదు కేంద్ర ప్రభుత్వం.
ఇనాం భూములను లాక్కోవడానికేనా?
ముస్లిం సమాజానికి చెందిన ఆర్థిక మూలాలను దెబ్బతీసే కుట్ర ఈ సవరణ బిల్లులో దాగి ఉంది. ఈ చట్టం సవరణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే పర్యవసానాలు దారుణంగా ఉంటాయి. అందుకే వక్ఫ్ చట్టం సవరణ బిల్లును రాజ్యాంగంపై దాడిగానే భావించాలి. నిధులు లేక ముస్లిం ధార్మిక సంస్థలు తమ రోజువారీ కార్యక్రమాలు కూడా నిర్వహించుకోలేకపోతాయి. దేశంలోని దర్గాలతో పాటు ముఖ్యమైన జాన్ పహాడ్, అజ్మీర్ వంటి పేరొందిన దర్గాలు కూడా బిచ్చమెత్తుకునే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ఒకవైపు హిందూత్వ అజెండాతో ముస్లింలపై రాజకీయంగా దాడి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మరోవైపు దర్గాల నిర్వహణకు ఉపయోగపడే ఇనాం భూములను లాక్కోవడానికి పకడ్బందీ వ్యూహం వేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులా?
వక్ఫ్ బోర్డు అనేది మౌలికంగా ముస్లింలకు సంబంధించిన అంశం. అయితే ఈ వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులను సభ్యులుగా చేర్చేలా తాజా చట్టంలో నిబంధనలు రూపొందించారు. ముస్లింల ధార్మిక సంస్థల పర్యవేక్షణను చూడాల్సిన వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు చోటు కల్పించడం ఏ విధంగా సమంజసమో బీజేపీ నాయకత్వం, కేంద్రం వివరించాలి. అన్యమతస్తుల ఆస్తులకు సంబంధించిన విషయాల్లో హైందవులను భాగస్వామ్యులను చేయడం అంటే వారి హక్కులను కాలరాయడమే అంటున్నారు సామాజికవేత్తలు. వక్ఫ్ సవరణ బిల్లు, 2024లోని నోట్ 1, క్లాజ్ 9,11 ప్రకారం ప్రతి వక్ఫ్ బోర్డులో ఇద్దరు ముస్లిమేతర సభ్యులను తప్పనిసరిగా చేర్చాలని వాదించడం మత స్వేచ్ఛ హక్కును తీవ్రంగా ఉల్లంఘించడం కాదా? 1995 వక్ఫ్ చట్టం భారతదేశంలో వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన వివాదాలను పరిష్కరించేందుకు, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని నిర్దేశించింది. వక్ఫ్ ఆస్తి హోదాపై వివాదం తలెత్తిన సందర్భంలో, 1995 చట్టంలోని సెక్షన్ 7(1) ట్రిబ్యునల్ తీర్పు అంతి మంగా ఉంటుందని తెలిపింది. కానీ ఇప్పుడు ఈ చట్టానికి సవరణలు తెచ్చి పూర్తిగా ముస్లిం సమాజం మత స్వేచ్ఛ హక్కు హరించివేస్తుందని అందులో భాగంగానే ఎన్డీయే ప్రభుత్వం ఈ దుర్మార్గానికి తలపెడుతోందని భావించవచ్చా?
1954లో ముసల్మాన్ వక్ఫ్ చట్టం
వలసరాజ్యాల యుగంలో, బ్రిటీష్ వారు హిందూ-ముస్లిం ఉపకార వేతనాల కోసం మొదట్లో హ్యాండ్-ఆఫ్ విధానాన్ని అవలంబించారు. వక్ఫ్ హోదా వలస రాజ్యాల కాలం నుంచి స్వతంత్ర భారతదేశానికి మారింది. భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వం 1932లోని ముసల్మాన్ వక్ఫ్ చట్టాన్ని రద్దు చేసింది. ఈ నేపథ్యంలో వక్ఫ్ బోర్డుల సాధికారత లక్ష్యంతో 1954లో వక్ఫ్ చట్టాన్ని ప్రవేశపెట్టింది అప్పటి కేంద్ర ప్రభుత్వం. ఆ తర్వాత 1995 అలాగే 2013లో వక్ఫ్ చట్టాన్ని సవరించారు. అయితే, వక్ఫ్ విషయంలో, ఆ ఆస్తుల నుంచి ఎవరు ప్రయోజనం పొందారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇది పేద ముస్లిం సమాజాల అవసరాలను సమగ్రంగా నెరవేరుస్తుందా? ఇది ముస్లిం సమాజంలోని అణగారిన యువకులకు నాణ్యమైన విద్యను అందజేస్తుందా? ఆర్థికంగా వెనుకబడిన ముస్లింలకు సరైన ఆరోగ్య సంరక్షణ, మసీదులు శ్మశాన వాటికలను సులభతరం చేస్తుందా? లాంటి ఎన్నో ప్రశ్నలు తెరమీదకు వచ్చాయి. అయితే వాస్తవానికి వక్ఫ్ ఆస్తులు ముస్లిం సమాజం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయి, మసీదులు, మదర్సాలు, విద్యాసంస్థలు, శ్మశాన వాటికలు, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల స్థాపనకు దోహదపడ్డాయి. ఇది ఎవరూ కాదనలేని సత్యం. ఇలా ముస్లింల ప్రయోజనాలకు ఉపయోగపడాల్సిన ఆస్తులను దుర్వినియోగపరచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సవరణ చట్టం తీసుకొస్తున్నప్పుడు రాజ్యాంగ పరిరక్షణ కోరుకునే శక్తులన్నీ ఏకం కావాల్సి ఉంది. భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు ఉద్యమించాల్సిన అవసరం ఉంది.
-సయ్యద్ ఇస్మాయిల్,
జాతీయ వైస్ చైర్మన్
(కాన్ఫెడరేషన్ ఆఫ్ దళిత్, ఓబీసీ, మైనార్టీ, ఆదివాసీ పరిసంగ్)
94944 51414