- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అంతరిక్ష రంగంలో సత్తా చాటనున్న భారత్
ఒకప్పుడు సాధారణ సైకిల్‌పై రాకెట్‌ను అంతరిక్ష ప్రయోగ కేంద్రానికి తీసుకువెళ్ళిన స్థాయి నుండి అంతరిక్ష రంగంలో భారతదేశం నేడు అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతూ అద్వితీయమైన ప్రగతి సాధిస్తోంది. దేశీయ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడంలో గణనీయ అనుభవం గడించిన భారత్ విదేశీ ఉపగ్రహాలను సైతం అతి తక్కువ ఖర్చుతో కక్ష్యలోకి పంపుతూ అంతర్జాతీయ ఖ్యాతి ఆర్జిస్తూ విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా ఆర్జిస్తోంది. ఈ విజయానికి మన శాస్త్రవేత్తల మేధాసంపత్తి, అకుంఠిత దీక్షతో పాటు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కారణం. అయితే అంతరిక్ష రంగంలో మరింత పురోగతి సాధించేందుకు ప్రైవేటు స్టార్టప్ కంపెనీలకు సంయుక్తంగా ఊతమిచ్చేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో, మైక్రోసాఫ్ట్‌లు అవగాహనా ఒప్పందం గత నెలలో కుదుర్చుకున్నాయి.
సంస్కరణలకు శ్రీకారం చుట్టి
అంతరిక్ష రంగంలో పురోగతి సాధించేందుకు భారత ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుట్టి జూన్ 2020లో 'ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్' (IN-SPAce) ని స్థాపించి ప్రైవేట్ కంపెనీలు ఇస్రో మౌలిక సదుపాయాలను ఉపయోగించుకునేలా వెసులుబాటు కల్పించింది. దీనికోసం 'న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్' (NSIL)ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే ఇస్రో గత ఏడాది 'స్కైరూట్ ఏరోస్పేస్' ద్వారా ఏర్పాటు చేసిన విక్రమ్-ఎస్ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. గత ఏడాది వరకు 'ఇన్‌స్పేస్'లో ప్రైవేట్ స్పేస్ టెక్ స్టార్టప్‌లు 111 నమోదయ్యాయి. గత ఏడాదిలోనే బహుళ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన 'ఎన్ఎస్ఈఎల్' ఈ ఏడాది మరింత పురోగతి సాధిస్తూ 300 మిలియన్ డాలర్ల పెట్టుబడులను టార్గెట్ పెట్టుకుంది.
అలాగే ఈ విభాగం 5 పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్స్ అభివృద్ధి చేయడానికి ఎల్&టీ, హెచ్ఏఎల్‌కు అనుమతినిచ్చింది. అలాగే వన్‌వెబ్ సంస్థ తక్కువ భూకక్షలోకి ఉపగ్రహాలను ప్రయోగించడంతో పాటు ఉపగ్రహ బ్రాడ్‌బ్యాండ్ లైసెన్స్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అలాగే హైదరాబాద్‌కి చెందిన ధృవ స్పేస్ రెండు థైబోల్డ్ ఉపగ్రహాలను, బెంగళూర్‌కి చెందిన దిగంతరా కంపెనీ అంతరిక్ష వాతావరణ సెన్సార్‌లను భూకక్షలోకి ప్రవేశపెట్టింది. మరో స్టార్టప్ స్పేస్‌ఫీల్డ్స్ ఘన-దశ రాకెట్ ఇంజిన్‌లపై పనిచేస్తోంది. మరో స్టార్టప్ పిక్సెల్ 'ఆనంద్' ఉపగ్రహంతో పాటు మూడు హైపర్ స్పెక్ట్రల్ ఉపగ్రహాలను ప్రయోగించింది.
దేశీయ పరిశ్రమకు అనుకూలం
ఇస్రో, మైక్రోసాఫ్ట్ కంపెనీల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం ఇరు సంస్థలు దేశవ్యాప్తంగా అంతరిక్ష రంగంలో ప్రవేశించాలనే ఉత్సహం గల కంపెనీలకు సాంకేతిక సాధనాలు సమకూర్చడం, పరిశోధన స్థాయి నుంచి వాణిజ్య ఉత్పత్తి వరకు మార్గదర్శనం చేయడం, వారి ఉత్పాదనలకు మార్కెట్ వసతులు కల్పించి ఈ రంగంలో వారిని నిలదొక్కుకునేలా చేయూతనిస్తాయి. ఈ సంస్థలు ఇస్రో, మైక్రోసాఫ్ట్ వనరులను వినియోగించుకొని సాంకేతిక సమాచారం సేకరించుకొని తమ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఈ ఒప్పందం ద్వారా దేశంలోని స్పేస్-టెక్ స్టార్టప్‌లు శక్తివంతం అవుతాయి. ఈ ఒప్పందంతో పాటు జీ-20 సదస్సుకు మన దేశం అధ్యక్షుడిగా వ్యవహరించడం అంతరిక్ష రంగ పరిశ్రమకు అనుకూలాంశం. ఈ కూటమి క్లైమేట్ ఫైనాన్స్, డిజాస్టర్ రెస్పాన్స్ అంశాలపై దృష్టి కేంద్రీకరించనుండడం వల్ల భారతదేశం ప్రభావవంతమైన అంతరిక్ష ఆధారిత పరిష్కారాలను అందించి భూగ్రహంపై ప్రజల జీవితాల మెరుగుదలకు కృషి చేయవచ్చు. రాబోయే సంవత్సరాల్లో ఉపగ్రహాల కోసం భారీ డిమాండ్ ఉండబోతోందని, అందువల్ల ఈ సదస్సు ఉపగ్రహ ఆధారిత సేవల వృద్ధికి దోహదపడుతుంది.
యేచన్ చంద్రశేఖర్
88850 50822