సెక్స్‌ని సైన్సుగా చూడకపోతే..

by Ravi |
సెక్స్‌ని సైన్సుగా చూడకపోతే..
X

మేడమ్, నేను పెళ్లి చేసుకోబతున్నాను. నా భార్యతో నా బాంధవ్యం ఎలా ఉంటే బాగుంటుంది..నాకు కొన్ని భయాలు ఉన్నాయి. నాకు ఈ విషయంలో పెళ్లికి ముందే కౌన్సెలింగ్ కావాలి. -రవీందర్, విజయవాడ.

మేడమ్, పెళ్లి తరువాత మా అక్కా బావ మధ్య వచ్చిన గొడవలు, అశాంతి చూస్తుంటే పెళ్లి చేసుకోవాలంటే భయంగా ఉంది. నాకూ సంబంధాలు చూస్తున్నారు వాళ్లలా నా పెళ్లి తర్వాతి జీవితం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

డాక్టర్ గారూ, నాకు పెళ్లయి ఆరు నెలలు అవుతోంది. మా మధ్య ఇంకా కలయిక జరగలేదు, కారణం నా భార్యకు సెక్స్ అంటే విపరీతమైన భయం. ఇంట్లో విడాకులు ఇమ్మంటున్నారు. నాకు ఇష్టం లేదు. ఆమెలో సెక్స్ పట్ల ఉన్న భయాన్ని ఎలా పోగొట్టాలి? ఎవర్ని కలవాలి?

మేడమ్, మా అబ్బాయి వయసు 15 సంవత్సరాలు. టెన్త్‌లో ఉన్నాడు. బాగా కోపం, ఉద్రేకం ఎక్కువ. ఎప్పుడూ గదిలోనే ఉంటాడు. సెల్‌ఫోన్‌తో ఎక్కువ కాలం గడుపుతున్నాడు. ఈ మధ్య కొద్దిగా ఎక్కువగా పడుకోవడం, మత్తుగా ఉన్నట్లు ఉండడం గమనిస్తున్నాను. మా అబ్బాయి ఏదో ప్రేమ వ్యవహారంలో ఉన్నాడని వాడి ఫ్రెండ్ చెబుతున్నారు. అలాగే తరచూ కాలేజీ దగ్గరి బడ్డీకొట్టులో ఏవో చాక్లెట్స్ కొంటున్నాడని చెప్పారు. మా వాడు ఎంత అడిగినా చెప్పడు. అబ్బాయికి కౌన్సెలింగ్ ఇప్పించాలి అనుకుంటున్నాము. ఏమైపోతాడో అని భయంగా ఉంది.

ఇవి తరచూ పెళ్లి కాబోయే.. అయిపోయిన దంపతుల్లో, టీనేజీ పిల్లల తల్లిదండ్రుల్లో.. టీనేజీ పిల్లల్లో కూడా వచ్చే సందేహాలు భయా లు. ఈ ప్రశ్నలకి సరి అయిన విధంగా శాస్త్రీ య పద్ధతిలో .. ఒక సైన్స్‌లా విశ్లేషించి సమాధానాలు ఇవ్వకపోతే వీరు అరకొర జ్ఞానం ఉన్న నకిలీ వైద్యుల దగ్గరికి వెళ్లి మోసపోతూ ఉంటారు. లేదా విరివిగా సెల్‌ఫోన్‌లో దొరికే పోర్న్ సైట్స్ చూస్తూ అందులో చూపించే నాన్ మెడికల్ అంశాలనే నమ్ముతూ.. అందులోని వికృతమైన అసహజ లైంగిక ధోరణులకు అలవాటు పడతారు. ఇది వారి భావి జీవితాలను సర్వనాశనం చేస్తుంది. జీవితాంతం నరకం అనుభవించడమే కాదు.. వాళ్ల జీవన సహచరులను కూడా కష్టపెడతారు.

సెక్స్‌ను బూతు, పాపంగా చూస్తేనే..!

ఇదంతా సెక్స్‌ని ఒక సైన్స్‌గా.. ఒక మెడికల్ సిస్టమ్, సెక్సువల్ హెల్త్‌‌లో ఒక భాగంగా చూడకపోవడం వల్ల జరుగుతుంది. సెక్స్‌ని ఇతర అవయవాల సహజమైన శరీర ధర్మాల వలె కాకుండా అంటే కన్ను, ముక్కు, గుండె, ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థ వలె కాకుండా మన జీవితంతో.. శరీరంతో, వివాహంతో సంబం ధం లేని ఒక మార్మికమైన అంశంగా.. ఒక రహస్యంగా చూడాల్సిన.. ఉంచాల్సిన అంశం గా, ఒక బూతుగా, పాపంగా చూపించడం వ లన దీని చుట్టూ ఇంత భయం, అయోమయం అలుముకుని చివరికి స్త్రీలలో జడత్వం, సెక్స్ జీవితం అంటే భయం, తద్వారా సెకండరీ వంద్యత్వం, పురుషులలో అంగస్తంభన లోపం, శీఘ్రస్ఖలన సమస్యలు, సెక్స్ కోరికలు తక్కువగా ఉండడం, అసహజ సెక్స్ ధోరణులు లాంటి లైంగిక, మనోలైంగిక, మనో శారీరక, మానసిక సమస్యలకు దారి తీస్తుంది.

లైంగిక అపోహల నుంచి..

స్రీలలో పునరుత్పత్తి అవయవాలు గర్భాశ యం, అండాశయం, యోని నాళం.. రుతుక్ర మం అలాగే పురుషుల్లో అంగం, బీర్జాలు, ప్రోస్టేట్ గ్రంధి, వీర్యకణాలు ఇవన్నీ శరీరంలో ఇతర వ్యవస్థల లాగే సహజమైనవిగా, సాధారణమైనవిగా చూడాలన్న జ్ఞానం ఇవ్వడం లేదు. శాస్త్రీయ లైంగిక అవగాహనా లోపం దంప తుల మధ్య దూరాల్ని పెంచి విడాకుల వరకు, అక్రమ సంబంధాల వరకు దారితీస్తాయి. అపోహలు, అనుమానాలు, భయాలు తీరని టీనేజ్ యువతలో కూడా ఆందోళన.. డిప్రెషన్, భయం లాంటి మానసిక సమస్యలకు, కొన్ని సార్లు ఆత్మహత్యలకు దారితీస్తుంది. టీనేజీ యువకులకి ఎక్కువగా వారి శరీరంలో వచ్చే మార్పులు.. హార్మోన్లు కలిగించే సంచయనాలు, ప్రత్యుత్పత్తి అవయవాల స్పందనలు, పరిమాణం, వీర్యస్ఖలన సంబంధిత అనుమానాలు, అపోహలు వేధిస్తుంటాయి.

స్త్రీలు అంటే దేహాలు కాదు..

విద్యాలయాల్లో సెక్స్ ఎడ్యుకేషన్‌లో ఇవన్నీ చెప్పరు. మానవ లైంగికత చుట్టూ ఉండాల్సిన విలువల గురించి, స్త్రీల లైంగిక, పునరుత్పత్తి హక్కుల గురించి, స్త్రీ‌లను దేహాలుగా కాదు విలువలున్న వ్యక్తులుగా గుర్తించాలని, స్త్రీ‌లు... పురుషుల లైంగిక అవసరాలు తీర్చే వస్తువులు కాదని.. ఇంటి పనులు స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి చేసుకోవాలని.. స్త్రీల విద్య, వృత్తికి సంబంధించిన స్వేచ్ఛని అడ్డుకోరాదని, పురు షులు, యువకులు ఈ విషయంలో సెన్సెటైజ్ అవడం గురించి కూడా చెప్పరు. సెక్సువల్ అనాటమీ అంటే స్త్రీ పురుషుల ప్రత్యుత్పత్తి అవయవాల నిర్మాణం, లైంగిక వ్యాధులు, అవి రాకుండా రక్షణ పద్ధతులు మాత్రమే చెప్తారు.

లైంగిక విద్య, కౌన్సెలింగ్ లేకనే..

ఈ మధ్య.. టీనేజీలో ఉండే విద్యార్థి, విద్యార్థినులు లైంగిక ఆకర్షణలో ఏర్పడిన సంబంధాలని ఎలా మానేజ్ చేయాలో సీబీఎస్ఈ సిల బస్‌లో చేర్చారు. ముందే అశాస్త్రీయ, తప్పుడు అవగాహన, సమాచారాలతో తప్పుదారి పడుతున్న యువత ఇంకెన్ని ప్రమాదాల్లో పడబోతున్నారో కదా. ఇలా కాకుండా ఉండా లంటే ఒక మంచి ప్లాట్ ఫామ్ మీద సెక్సువల్ హెల్త్ కౌన్సెలింగ్, ఎడ్యుకేషన్ చాలా అవసరం. ఇలాంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ తమ సందేహాలను ఈ కింద ఇచ్చే డాక్టర్ గారి ఈ-మెయిల్‌కి మెయిల్ చేయవచ్చు.

డాక్టర్ భారతి,

సెక్సువల్ హెల్త్ & ఫ్యామిలీ కౌన్సెలర్

ప్రీ & పోస్ట్ మేరేజ్ & సెక్సువల్‌ కౌన్సెలింగ్

79892 27504

[email protected]

Advertisement

Next Story

Most Viewed