- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విలువలకు విఘాతం రవీశ్ నిష్క్రమణ
అంత నిబద్ధతతో పని చేసే ఎన్‌డీటీవీని ప్రమోటింగ్ కంపెనీ 'రాధికారాయ్ ప్రణయ్‌రాయ్ (ఆర్ఆర్‌పీఆర్) హోల్డింగ్స్ ప్రయివేట్ లిమిటెడ్'ను ఆసియా కుబేరుడు, ప్రధాని సన్నిహితుడు అదానీ కొనుగోలు చేయడంతో నవంబర్ 30న తన పదవికి రాజీనామా చేశారు రవీశ్ కుమార్. దీంతో ఎన్‌డీటీవీతో తన 28 సంవత్సరాల సుదీర్ఘ అనుబంధానికి తెరపడింది. అంతకుముందు ఎన్‌డీటీవీ ఛానల్ ఫౌండర్, ప్రమోటర్, ప్రపంచ ప్రఖ్యాత ఎన్నికల విశ్లేషకుడు అయిన ప్రణయ్‌రాయ్, ఆయన భార్య రాధికారాయ్ తమ డైరెక్టర్ పదవులకు రాజీనామా చేశారు. దీంతో రవీశ్ కుమార్ సైతం రాజీనామా చేశారు. అనంతరం తన స్వంత హిందీ యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించారు. ఈ చానల్ సైతం అతి తక్కువ సమయంలోనే లక్షలాది అభిమానులను తన వైపు ఆకర్షించడం విశేషం.
జర్నలిజం ప్రమాణాలను సమున్నతంగా నిలబెట్టింది ప్రఖ్యాత న్యూస్ చానల్ ఎన్‌డీటీవీ(ndtv). దాని హిందీ విభాగానికి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా పనిచేసిన రవీశ్ కుమార్(ravish kumar) గత నెల 30న తన పదవికి రాజీనామా చేశారు. ఇది ఆ చానల్ వీక్షకులలో సంచలనం సృష్టించింది. 47 యేళ్ల వయసున్న జర్నలిస్ట్ రవీశ్ కుమార్ అసలు పేరు రవి కుమార్ పాండే. ఆయన బిహార్ రాష్ట్రంలోని తూర్పు చంపారన్ జిల్లా జీత్వర్పూర్ గ్రామంలో 5 డిసెంబర్ 1974న జన్మించారు.
తండ్రి బలిరామ్ పాండే. రవి కుమార్ కులాంతర వివాహం చేసుకున్నారు. సతీమణి హిస్టరీ ప్రొఫెసర్. రవీశ్ కుమార్ పాట్నాలోని లయోలా హైస్కూల్, దేశబంధు కళాశాలలో హిందీ లిటరేచర్‌లో గ్రాడ్యుయేషన్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ హిందీ విభాగంలో ఎంఏ ప్రథమ శ్రేణిలో పాసై బంగారు పథకాన్ని సాధించారు. హిందీ కవి, రచయిత కూడా. ఆయన కలం నుంచి అనేక విలువైన పుస్తకాలు వెలువడి అనతికాలంలోనే ప్రాచుర్యం పొందాయి. మంచి వ్యక్త, హాస్య ప్రియుడు, సంభాషణ చతురుడు కూడా.
పలు అవార్డులు పొంది
1994లో జర్నలిస్ట్‌గా ఎన్‌డీటీవీలో తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన రవీశ్(journalist ravish kumar) అనేక స్థాయిలలో విశిష్ట రీతిలో పని చేసి కోట్లాది మంది వీక్షకుల మనసు దోచుకున్నారు. ముఖ్యంగా వీక్ డే షో, ప్రైమ్ టైమ్, హమ్ లోగ్, రవీశ్ కీ రిపోర్ట్, దేశ్ కీ బాత్‌తో పాటు ఎన్నో కార్యక్రమాలు సమర్థవంతంగా నడిపించి హిందీ భాషాభిమానుల పై తనదైన ముద్ర వేశారు. ఆయన వార్తలను సరళంగా, సూటిగా, స్పష్టంగా, చక్కటి ఉచ్చారణతో ప్రవేశపెట్టి ప్రేక్షకులను టీవీ సెట్ల ముందు కట్టిపడేసారు.
ఆయన కథనాలలో లేవనెత్తిన అంశాలు మూలాలను వెలికి తీసేవిగా ఉండేవి. ఆయన సమస్యను విశ్లేషించే పద్ధతి అపురూపంగా ఉండి అనితర సాధ్యంగా ఉండేది. ఆయన ప్రజాపక్షంగా వాదించే విధానంలో కొంత హాస్యం, వ్యంగ్యం సామాన్య ప్రజలను ఆకర్షించేది. ఆయన వృత్తి జీవితంలో చూపించిన నిష్పాక్షికతకు, నిర్భయానికి మెచ్చి 2013 లో రామ్‌నాథ్ గోయెంకా అవార్డు(Ramnath Goenka Award), 2016లో రెడ్ ఇంక్, 2017లో రెండోసారి రామ్‌నాథ్ గోయెంకా అవార్డుతో పాటు ఆసియా నోబెల్ ప్రైజ్‌గా పిలిచే ప్రతిష్టాత్మక 'రామన్ మెగసెసే'(Ramon Magsaysay Award) వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలూ అందుకున్నారు.
ఆయన కొనుగోలు చేయడంతో
అంత నిబద్ధతతో పని చేసే ఎన్‌డీటీవీని ప్రమోటింగ్ కంపెనీ 'రాధికారాయ్ ప్రణయ్‌రాయ్ (ఆర్ఆర్‌పీఆర్) హోల్డింగ్స్ ప్రయివేట్ లిమిటెడ్'ను ఆసియా కుబేరుడు, ప్రధాని సన్నిహితుడు అదానీ(adani) కొనుగోలు చేయడంతో నవంబర్ 30న తన పదవికి రాజీనామా చేశారు రవీశ్ కుమార్. దీంతో ఎన్‌డీటీవీతో తన 28 సంవత్సరాల సుదీర్ఘ అనుబంధానికి తెరపడింది.
అంతకుముందు ఎన్‌డీటీవీ ఛానల్ ఫౌండర్, ప్రమోటర్, ప్రపంచ ప్రఖ్యాత ఎన్నికల విశ్లేషకుడు అయిన ప్రణయ్‌రాయ్(prannoy roy), ఆయన భార్య రాధికారాయ్(radhika roy) తమ డైరెక్టర్ పదవులకు రాజీనామా చేశారు. దీంతో రవీశ్ కుమార్ సైతం రాజీనామా చేశారు. అనంతరం తన స్వంత హిందీ యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించారు. ఈ చానల్ సైతం అతి తక్కువ సమయంలోనే లక్షలాది అభిమానులను తన వైపు ఆకర్షించడం విశేషం. ఈయన రాజీనామా చేశాక ఎన్‌డీటీవీ టీఆర్‌పీ(ndtv trp) కొంతమేరకు తగ్గింది. చూద్దాం భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో!?
డా. కోలాహలం రామ్‌కిషోర్
వరంగల్, 98493 28496