- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మన భద్రత.. మన చేతిలోనే
ఇంటి ముందు సీసీ కెమెరా ఏర్పాటు చేసుకుంటే వారి ఫోన్ ద్వారా ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా చూసుకునే సాంకేతికత ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. నేరం వలన నష్టం జరిగిన తర్వాత స్పందించే కంటే, నేరం జరగక ముందు దానిని నివారించే ప్రయత్నం చేయడం మన చేతులలోనే ఉన్నది. మార్కెట్‌లో దొరికే సీసీ కెమోరాలలో మంచివి, నాణ్యమైనవి, ఎక్కువ కాలం లైఫ్ ఇచ్చేవి ఉన్నట్టే నాసిరకం, నాణ్యత లేని, త్వరగా పాడయ్యే చైనా రకం కెమెరాలు విచ్చలవిడిగా ఉన్నాయి. ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకుంటే కెమెరాల ఏర్పాటుతో పెద్దగా ఉపయోగం ఉండకపోగా డబ్బు వృథా అవుతుంది. కాబట్టి సీసీటీవీల ఎంపికలో జాగ్రత్తలు పాటించడం, సెక్యూరిటీ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవడం అవసరం.
జర్మన్ సైంటిస్ట్ వాల్టర్ బరూచ్ రాకెట్ ప్రయోగాలను పర్యవేక్షించడానికి 1942లో సీసీటీవీలను రూపొందించారు. రాకెట్ ప్రయోగాల పర్యవేక్షణ కోసం కనిపెట్టిన సీసీటీవీ ప్రతి ఇంటిలో ఓ నిఘా పరికరంగా మారుతుందని మాత్రం బరూచ్ ఊహించి ఉండరు. పూర్వకాలంలో ఇండ్లకు తలుపులు లేకపోయినా ఎక్కడా దొంగతనాలు, దోపిడీలు జరిగేవి కాదని వినేవాళ్లం. కానీ, ప్రపంచం మారుతున్న కొద్దీ ప్రజలలో స్వార్థం ఆవరించడంతో దోపిడీలు, దొంగతనాలు, హత్యలు పెరుగుతున్నాయి. ఫలితంగా ప్రతి ఇంటిలో ఈ రోజు సీసీ కెమెరాల అవసరం ఏర్పడింది.
క్రైమ్ ట్రేస్‌లో కీలక పాత్ర
సీసీటీవీ నిఘా వ్యవస్థ పురాతనమైనదే అయినప్పటికీ, ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగించబడుతోంది. మనదేశంలోనూ ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, ఇండోర్, కోల్‌కతా వంటి సిటీలలో వీటికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. శాంతి భద్రతల విషయంలో సీసీ కెమెరాలు(cc camaras) నేడు పోలీసులకు అత్యంత కీలకంగా మారాయి. కంపారిటెక్ సంస్థ (comparitec) 2021 రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 150 ప్రధాన సిటీలలో వీటి వినియోగం బాగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా 770 మిలియన్ కెమెరాలు ఉంటే, వాటిలో 54 శాతం ఒక్క చైనాలోనే ఉండటం గమనార్హం. చైనాలో ఉన్న అత్యంత భారీ నగరాలు సీసీటీవీ పర్యవేక్షణలో ఉన్నాయి. దీని ప్రాధాన్యం గుర్తించిన ప్రభుత్వాలు వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే మన దేశంలో టాప్ 15 నగరాలలో దాదాపు 1.54 మిలియన్ కెమెరాలు విస్తరించి ఉన్నాయని అంచనా.
కంపారిటెక్ నివేదిక ప్రకారం అత్యధిక కెమారాలతో ఢిల్లీ మొదటి స్థానంలో, చెన్నై మూడో స్థానంలో, హైదరాబాద్ 12, ముంబై 18 వ స్థానంలో నిలిచాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది. 600 కోట్ల వ్యయంతో అత్యాధునిక హంగులతో హైదరాబాద్ లో నిర్మించిన తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్(telangana command control centre) ను ఇటీవల సీఎం కేసీఆర్(kcr) ప్రారంభించారు. ఇటువంటి ఇంటిగ్రేటెడ్ సెంటర్ దేశంలో మరెక్కడా లేదు. సుమారు 10 లక్షల సీసీ కెమెరాలను ఇక్కడి నుంచి పర్యవేక్షించే వెసులుబాటు ఉన్నది. రాష్ట్రంలో ఎక్కడ క్రైమ్ జరిగినా వెంటనే ఇవి ట్రేస్ చేయగలుగుతాయి. 'నేను సైతం' అనే కార్యక్రమంతో తెలంగాణ పోలీసులు ప్రతి పట్టణం, గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తున్నది. మిస్సింగ్ కేసులు, దోపిడీ, దొంగతనాలు, హత్యోదంతాలు, ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తుల కదలికలను గమనించేందుకు ముఖం గుర్తించే కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చి నేరాలు గణనీయంగా తగ్గి ప్రతి పౌరుడి భద్రతకు భరోసా దక్కుతుంది.
వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని 887 పీహెచ్‌సీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అక్కడి పనితీరును హైదరాబాద్‌లో ఉండే ఆఫీసర్లు పర్యవేక్షించేలా ఏర్పాట్లను చేసింది. దీంతో ఆసుపత్రుల పనితీరు మెరుగుపడి సర్కారు దవాఖానలకు రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఎక్కడ నిర్లక్ష్యం వహించినా పై అధికారులకు తెలిసిపోతుందనే భయంతో ఆసుపత్రి ఉద్యోగులు, సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహిస్తున్నారు. ఇంతలా ప్రభుత్వ, సామాజిక వ్యవస్థలలో కీలక మార్పులు తీసుకొచ్చిన ఈ సీసీ కెమెరాలను ప్రతి ఒక్కరూ వారి ఇండ్లలోనూ అమర్చుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్‌లో ఇంటికి తాళం వేసి సొంతూరికి వెళ్లే ఓ కుటుంబం ఇంటి ముందు సీసీ కెమెరా ఏర్పాటు చేసుకుంటే వారి ఫోన్ ద్వారా ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా చూసుకునే సాంకేతికత ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.
నేరం వలన నష్టం జరిగిన తర్వాత స్పందించే కంటే, నేరం జరగక ముందు దానిని నివారించే ప్రయత్నం చేయడం మన చేతులలోనే ఉన్నది. మార్కెట్‌లో దొరికే సీసీ కెమోరాలలో మంచివి, నాణ్యమైనవి, ఎక్కువ కాలం లైఫ్ ఇచ్చేవి ఉన్నట్టే నాసిరకం, నాణ్యత లేని, త్వరగా పాడయ్యే చైనా రకం కెమెరాలు విచ్చలవిడిగా ఉన్నాయి. ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకుంటే కెమెరాల ఏర్పాటుతో పెద్దగా ఉపయోగం ఉండకపోగా డబ్బు వృథా అవుతుంది. కాబట్టి సీసీటీవీల ఎంపికలో జాగ్రత్తలు పాటించడం, సెక్యూరిటీ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవడం అవసరం.
తాడెం బాబు,
సీసీటీవీ ఎనాలిసిస్ ఎక్స్‌పర్ట్
95029 ౮౪౮౧౮
READ MORE