- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీసీ ‘ఎర’ వేస్తున్న పార్టీలు!
రాష్ట్రంలో ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఇందులో ఎలా గెలవాలనే దానిపైనే ఇప్పుడు అన్ని పార్టీలూ ఎత్తుకు పై ఎత్తులు వేసే పనిలో పడ్డాయి. ఓటు బ్యాంకు రాజకీయాలకు తెర లేపుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ‘ఎర’లను సిద్ధం చేసుకుంటున్నాయి. పార్టీలన్ని సామాజిక వర్గాల వారీగా ఓట్లను కొనేందుకు ఎత్తుగడలు వేస్తున్నాయి. అందుకే ఏ కమ్యూనిటీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి.. వారిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి.. ఏ పథకాలు తీసుకు రావాలి.. అనే దానిపైనే ప్రధాన పార్టీలన్నీ దృష్టి పెట్టాయి.
రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గాలకు చెందిన ఓట్లు సుమారు 60 శాతం వరకూ ఉంటాయి. అందుకే రాజకీయ పార్టీల కన్ను ఇప్పుడు బీసీలపై పడింది. వారి ఓట్లు రాబట్టుకునేందుకు కొత్తగా బీసీ మంత్రాన్ని తెరపైకి తెస్తున్నాయి పార్టీలు. అందులో భాగంగానే అధికార బీఆర్ఎస్ బీసీ జపం ఎత్తుకొని బీసీల అభివృద్ధి కోసమంటూ, ఆ సామాజికవర్గంలోని కులాలను ఆదుకునేందుకు ప్రతి కుటుంబానికీ రూ.లక్ష ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. బీసీలలో ఉన్న అన్ని కులస్తులతో పాటు ఇతర కుల వృత్తులను దళితబంధు తరహాలో ప్రవేశ పెట్టి దశల వారీగా ఒక్కో కులానికి సగటున ఐదు వేల మందికి సహాయం అందించాలని నిర్ణయించింది. అలాగే రాష్ట్రంలో అధికారం కోసం తహతహలాడుతున్న మరో ప్రధాన పార్టీ బీజేపీ కూడా ఇటీవల బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే బీసీ జనాభా ఆధారంగా బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని చెప్పుకొచ్చింది. అలాగే బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పిస్తామని ప్రకటించింది. విదేశాల్లో చదవాలనుకునే వారికి ఆర్థిక సాయం, నామినేటెడ్ పదవుల్లో బీసీలలోని చిన్నకులాలకు పెద్దపీట వేస్తామని బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించింది. బీఆర్ఎస్, బీజేపీ తరహాలో కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ జపం ఎత్తుకొని రాష్ట్రంలో బీసీ పాలన తీసుకొస్తామని, బీసీ జనాభా లెక్కించాలని రేవంత్ డిమాండ్ చేశారు. త్వరలో కాంగ్రెస్ సైతం బీసీ డిక్లరేషన్ ప్రకటించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే పార్టీలన్నీ బీసీలపై ప్రేమ కురిపించడాన్ని కేవలం ఎన్నికల ‘ఎర’గానే ఆరోపిస్తున్నారు. లేకపోతే ఇప్పటి వరకూ గుర్తుకు రాని బీసీలు ఎలక్షన్ టైంలో గుర్తొచ్చారా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
మొహ్మద్ నిసార్
95426 52786