- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డిమాండ్ కొనసాగకపోతే జాగ్రత్త పడాలి : ఆర్‌బీఐ గవర్నర్
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా పండుగ సీజన్ ముగియడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ డిమాండ్ స్థిరత్వంపై ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్-19 మహమ్మారి ప్రభావం నుంచి దేశ ఆర్థికవ్యవస్థ ఊహించిన దానికి మించి అధికంగానే పుంజుకుంటోందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, పండుగ సీజన్ సమయంలో ఉన్న డిమాండ్ ఇలాగే కొనసాగకపోవచ్చని, దానికోసం అవసరమైన జాగ్రత్తలను తీసుకోవాల్సిన అవసరముందని సూచించారు.
ఫారిన్ ఎక్స్ఛేంజ్ డీలర్ అసోసియేషన్ నాలుగో వార్షిక దినోత్సవంలో మాట్లాడిన ఆయన.. ప్రపంచదేశాలతో పాటే భారత్ కూడా ఆర్థికవ్యవస్థలో వృద్ధి క్షీణతను ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. పండుగ సీజన్ తర్వాత డిమాండ్ స్థిరత్వం, వ్యాక్సిన్ చుట్టూ ఉన్న మార్కెట్ అంచనాలను బట్టి జాగ్రత్త పడాల్సి ఉంది. వృద్ధి దృక్పథం మెరుగుపడినప్పటికీ, భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసుల పెరుగుదల కారణంగా వృద్ధికి నష్టాలు కొనసాగుతున్నాయని దాస్ పేర్కొన్నారు. పండుగ సీజన్ ముగిసిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న డిమాండ్ ఇలాగే కొనసాగుతుందా లేదంటే వ్యాక్సిన్ ఫలితాలను బట్టి మార్కెట్లపై ప్రభావం కారణంగా జాగ్రత్త పడాల్సి ఉందా అనేది చూడాలని శక్తికాంత దాస్ డీలర్లకు చెప్పారు.