- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పొట్టి ఫార్మాట్.. పుట్టకముందే వాయిదా !
దిశ, స్పోర్ట్స్: ప్రపంచంలో పేరొందిన క్రికెట్ లీగ్స్ అయిన ఐపీఎల్, బీబీఎల్‌కు పోటీగా ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రారంభించిన లీగ్ ‘ది హండ్రెడ్’. టీ20ల కన్నా తక్కువ నిడివి గల ‘ది హండ్రెడ్’ను ఈ ఏడాది నుంచే ప్రారంభించాలని ఈసీబీ భావించింది. ఇన్నింగ్స్‌కు 100 బంతులు మాత్రమే ఉండే ఈ ఫార్మాట్‌ను పాపులర్ చేసేందుకు ఇప్పటికే అన్ని ప్రణాళికలు రచించింది. కానీ, కరోనా వైరస్ ఈసీబీ ఆశలకు గండికొట్టింది. మరో రెండు నెలల వరకు క్రికెట్ ఆడే అవకాశం లేకపోవడంతో ‘ది హండ్రెడ్’ను వచ్చే ఏడాదికి వాయిదా వేస్తున్నట్లు ఈసీబీ సీఈవో టామ్ హారిసన్ గురువారం ప్రకటించారు. తొలుత ప్రేక్షకులు లేకుండానే ఖాళీ స్టేడియంలోనే ‘ది హండ్రెడ్’ నిర్వహించాలని భావించినా.. ఈసీబీ పెద్దలు ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. ప్రేక్షకులకు సరికొత్త క్రికెట్ ఫార్మాట్‌ను రుచి చూపించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ‘ది హండ్రెడ్’ను ఖాళీ స్టేడియాల్లో నిర్వహించటం సముచితం కాదని, 2021లో ప్రేక్షకుల మధ్యనే గ్రాండ్‌గా లాంచ్ చేయాలని ఈసీబీ నిర్ణయించింది.
Tags: The Hundred, Cricket, League, ECB, Tom Harrison, IPL, BBL