- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అభ్యర్థుల నేర చరిత కోసం టైమ్‌లైన్
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల నేరచరితను ప్రచురించడానికి ఎన్నికల సంఘం కచ్చితమైన టైమ్‌లైన్‌ను ప్రకటించింది. నామినేషన్ వేసిన అభ్యర్థులు లేదా ఆయా పార్టీలు వారి నేర చరిత్రను తప్పకుండా మీడియాలో అడ్వర్టయిజ్ చేయాలని, నామినేషన్ మొదలు ప్రచారం ముగిసే సమయానికి మూడు సార్లు ప్రచురించాలని ఆదేశించింది. వీటికి కచ్చితమైన టైమ్‌లైన్ నిర్దేశించింది.
నామినేషన్ ప్రక్రియ మొదలై ఉపసంహరణ చివరి తేదీ వరకు ఉన్న నాలుగు రోజుల్లో తొలిదఫా అభ్యర్థుల నేర చరిత ప్రింట్, డిజిటల్ మీడియాలో ప్రచురించాలి. నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ నుంచి ఐదో రోజు నుంచి ఎనిమిదో రోజు మధ్యలో రెండో దఫా, తొమ్మిదో రోజు నుంచి ప్రచారం ముగిసే వరకు(పోలింగ్‌కు రెండు రోజుల ముందు) మూడో దఫా నేర చరితను అడ్వర్టయిజ్ చేయాలని ఈసీ ఆదేశించింది. పోలింగ్ వరకు నిలవకున్నా ఉపసంహరణ లోపే నామినేషన్ వేసిన అభ్యర్థి ఒకసారి తన నేరచరితను ప్రచురించాలని ఆదేశించినట్టయింది. పోటీ లేకుండా ఏకగ్రీవమయ్యే చోట్లలోనూ అభ్యర్థితోపాటు టికెట్ ఇచ్చిన పార్టీ తప్పకుండా ప్రచురించాలని తెలిపింది.