- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెట్రో ధరలపై కేసీఆర్ కుట్రలను కుండబద్దలు కొట్టిన ఈటల
దిశ, డైనమిక్ బ్యూరో : రోజురోజుకూ పెరుగుతున్న పెట్రో ధరలతో సామాన్యుడిపై మరింత భారం పెరిగిందని కేంద్రం భావించి ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన విషయం తెలిసిందే. అదేవిధంగా పలు రాష్ట్రాలు కూడా కేంద్రం పిలుపుతో తగ్గించాయి. అయితే, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తగ్గించలేదు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో వ్యాట్ పెంచలేదని, అందుకే తగ్గించే ప్రసక్తిలేదని సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందిస్తూ..
‘‘తెలంగాణ అవతరించాక మొదటి ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే 31శాతం నుంచి 35 శాతానికి పెంచాము. అంతేకాకుండా పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కేంద్రం అడిగింది. పెట్రో ఉత్పత్తులను, లిక్కర్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురాలేమని తేల్చి చెప్పాం. రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ఆదాయంలో ఈ రెండు ఉత్పత్తుల ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువ. కొన్ని రోజుల క్రితం హరీష్ రావు కూడా ఢిల్లీకి వెళ్లి జీఎస్టీలోకి తీసుకురాలేము అని చెప్పి వచ్చారు. ఇక చేసేదేమి లేక కేంద్రం కొంత తగ్గించింది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల మీద ప్రేమ ఉంటే, ప్రజలు ఇబ్బందులు పడొద్దని ఉంటే.. అన్ని రాష్ట్రాలు తగ్గించినట్లు తెలంగాణలో కూడా ట్యాక్సును తగ్గించాలి.’’ అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
కేసీఆర్ ముఖ్యమంత్రి అయినంక పెట్రోల్ మీద వ్యాట్ పెరిగింది.
పెరగలేదు అని అబద్దమాడిన కేసీఆర్. pic.twitter.com/KFneAYLiaa
— 🅺🅳🆁 (@KDRtweets) November 14, 2021