సెలబ్రిటీల ప్రశంసలందుకున్న తూర్పుగోదావరి మహిళ

by srinivas |   ( Updated:2020-04-15 05:33:04.0  )

ఆంధ్రప్రదేశ్‌లోని తుని పట్టణంలో చోటుచేసుకున్న ఆసక్తికర సంఘటనను ప్రముఖ సినీ నటుడు ఆర్ మాధవన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నాడు. దీంతో ఆ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె గొప్ప మనసుకు అంతా చేతులెత్తి నమస్కరిస్తున్నారు.

ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే… ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. 500కిపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు లాక్‌డౌన్‌ను చాలా కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలో ఎండలు మండిపోతున్నాయి. మండుటెండలో పోలీసులు పహారా కాస్తున్నారు. రోడ్ల మీదకి వచ్చిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వెనక్కి పంపుతున్నారు.

ఇంతలో ముగ్గురు మహిళలు ఎండదెబ్బ తగలకుండా, ముఖానికి పైమిట చెంగులు కప్పుకుని, చేతిలో బరువైన సంచీతి పోలీసు పోస్టు దగ్గరకి వచ్చారు.
పోలీసులు: ఏం కావాలమ్మా మీకు?
మహిళ: రోజంతా ఎండలో ఉంటున్నారు అంటూ సంచిలోని ఫాంటా, థమ్సప్ 2 లీటర్ల డ్రింక్ బాటిల్స్ బయటపెడుతూ ‘తాగండి’
పోలీసులు: అంత పెద్ద డ్రింకులా?.. ఎందుకమ్మా?..
మహిళ: ఎండకద బాబు… తాగండి
పోలీసులు: మీలా చదువుకున్నోళ్లు ఉంటే ఎంత బాగుండేది?.. పోన్లెండమ్మా.. ఇంతకీ మీరేం చేస్తారమ్మా… మీ ఆదాయమెంత
మహిళ: పని చేస్తాను బాబు.. నెలకి 3,500 రూపాయలు వస్తుంది.
దాంతో ఆశ్చర్యపోయిన పోలీసు 3,500 జీతానికి ఇంత పెద్ద డ్రింకులు తెచ్చారా? మీది గొప్ప మనసమ్మా.
మహిళ: మా కోసం మీరెంతో చేస్తున్నారు. మీకోసం ఈ మాత్రం చెయ్యలేమా?
పోలీసు: ధన్యవాదాలమ్మా… అవి మీ పిల్లలకి ఇవ్వండి. అలాగే మా తరపున మీ పిల్లలకి ఇవి ఇవ్వండి అంటూ లిటిల్ బాటిల్స్ ఫ్రూటీ ఇచ్చారు.
అవి తీసుకుని ఆమె నవ్వుతూ వెళ్తుండగా.. మీరు రోజూ వచ్చి కనిపించండమ్మా… కాస్త ధైర్యంగా ఉంటుంది అని పోలీసు తెలిపారు.

ఈ తతంగాన్నంతా ఆ పక్కనే ఉన్న పోలీసు వీడియో తీసి తన సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో.. దానిని చూసిన సఖి సినిమా హీరో మాధవన్, రవీనా టాండన్, పాయల్ రోహత్గీ, క్రికెటర్ సురేష్ రైనా తదితరులు తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో ఆమె గొప్ప మనసును నెటిజన్లు కీర్తిస్తున్నారు.

Tags: eastgodavari,twitter,labourlady,offering drinks police, bollywood stars, r.madhavan, raveenatondon, suresh rina

Advertisement

Next Story

Most Viewed