- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశాన్ని మత రాజ్యంగా మారుస్తున్న కేంద్రం
దిశ, హైదరాబాద్: దేశాన్ని మత రాజ్యాంగా మారిచేందుకు బీజేపీ కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని డీవైఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి అభయ్ ముఖర్జీ విమర్శించారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(డీవైఎఫ్ఐ) తెలంగాణ రెండో రాష్ట్ర మహాసభలు ఏప్రిల్ 21,22,23 తేదీల్లో నల్లగొండ జిల్లా చిట్యాలలో నిర్వహిస్తున్న సందర్భంగా సోమవారం బాగ్‌లింగంపల్లిలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖర్జీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువలను పాతరేస్తుందన్నారు. సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్‌పీఆర్ చట్టాలు వాటి అమలు ఈ దేశ లౌకిక రాజ్యానికి భిన్నంగా ఉన్నాయన్నారు. ప్రతిఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం యువతను మోసం చేసిందన్నారు. కానీ, ఉన్న ఉద్యోగాలను తీసేస్తూ, కులం, మతం, జాతి పేరుతో ఉన్మాదాలను పెంచి పోషిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహాసభల బ్రోచర్‌ను అభయ్ ముఖర్జీ రిలీజ్ చేశారు. రాష్ట్ర కార్యదర్శి విజయ్ కుమార్, రాష్ట్ర టెక్నికల్ ఇంచార్జి శశాంక్, నాయకులు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
tags : DYFI leaders, central govt, NRC, CAA, NPR, unemployment