- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రికెటర్‌ను డెలీవరి బాయ్‌గా మార్చిన కరోనా
దిశ, స్పోర్ట్స్ : కరోనా కాలంలో ఎంతో మంది అష్టకష్టాలు పడ్డారు. ఉద్యోగాలు, ఉపాధి, ఆదాయం కోల్పోయి బ్రతుకు దుర్భరంగా మారింది. మరోవైపు క్రీడారంగం కూడా స్తంభించడంతో ఎన్నో మెగా టోర్నీలు వాయిదా పడ్డాయి. ఐసీసీ కూడా ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ వాయిదా వేసింది. అన్ని అనుకున్నట్లు జరిగితే మొన్న ఆదివారం వరల్డ్ కప్ ఫైనల్స్ జరగాల్సి ఉంది. పెద్ద క్రికెట్ బోర్డులకు చెందిన క్రికెటర్లకు ఎలాగోల జీతాలు వచ్చాయి. ఐపీఎల్ మరి కొంత మందిని ఆదుకుంది. అయితే నెదర్లాండ్స్‌కు చెందిన పాల్ వాన్ మీకరెన్ మాత్రం పూట గడవని పరిస్థితికి చేరుకున్నాడు. ఉదరపోషణకు ఉబెర్ ఈట్స్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఈ శీతాకాలం వెల్లదీయడానికి తాను ఉబెర్ ఈట్స్‌లో పని చేస్తున్నానంటూ ట్వీట్ చేశాడు. కాగా, అతడి ట్వీట్‌ను ప్రముఖ వెబ్‌సైట్ క్రిక్ఇన్ఫో రీట్వీట్ చేయడంతో వైరల్‌గా మారింది. కుటుంబ పోషణకు డెలివరీ బాయ్‌గా మారిన అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. త్వరలోనే తిరిగి క్రికెట్ ఆడాలని నెటిజన్లు ఆశిస్తున్నారు.